News April 10, 2024

ఐపీఎల్‌-2024లో అత్యధిక రన్స్, వికెట్స్ ఎవరివంటే..

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో 23 మ్యాచులు ముగిశాయి. అత్యధిక పరుగుల జాబితాలో ఆర్సీబీ స్టార్ కోహ్లీ(316) అగ్రస్థానంలో ఉన్నారు. ఇక రెండో స్థానంలో గుజరాత్ ఆటగాడు సాయి సుదర్శన్(191), మూడో స్థానంలో సన్‌రైజర్స్ బ్యాటర్ క్లాసెన్(186) కొనసాగుతున్నారు. అత్యధిక వికెట్ల జాబితాలో చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్(9 వికెట్లు) అగ్రస్థానంలో, RR స్పిన్నర్ చాహల్ (8) రెండో స్థానంలో, పంజాబ్ బౌలర్ అర్షదీప్(8) మూడో స్థానంలో నిలిచారు.

News April 10, 2024

IPL: టాస్ గెలిచిన గుజరాత్

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, గుజరాత్‌ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది.
రాజస్థాన్ జట్టు: యశస్వి, బట్లర్, సంజూ, పరాగ్, హెట్మయిర్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, కుల్‌దీప్ సేన్, చాహల్
గుజరాత్ జట్టు: గిల్, సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్, వేడ్, తెవాతియా, రషీద్, నూర్, ఉమేశ్, స్పెన్సర్, మోహిత్ శర్మ

News April 10, 2024

పోలవరం గురించి అడిగితే మంత్రి డాన్స్ చేస్తారు: పవన్ కళ్యాణ్

image

AP: రైతులకు వ్యతిరేకంగా మాట్లాడిన మంత్రి, అతని కుమారుడు రాజకీయాల నుంచి తుడిచిపెట్టుకుపోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ‘పోలవరం అయ్యిందా అంటే ఓ మంత్రి డాన్సులు చేస్తారు. పునరావాసం అడిగితే అబ్బనీ తియ్యని దెబ్బ అంటారు. వైసీపీ పాలన పోవడం కోసం ఎన్నో త్యాగాలు చేశాం. తణుకులో అభ్యర్థిని ప్రకటించి వెనక్కి తగ్గాం. నాగబాబుకు టికెట్ ప్రకటించి కూడా బీజేపీ కోసం తప్పుకున్నాం’ అని స్పష్టం చేశారు.

News April 10, 2024

IPL: RR vs GT వర్షం కారణంగా టాస్ ఆలస్యం

image

ఐపీఎల్‌లో భాగంగా ఈరోజు జైపూర్‌లో రాజస్థాన్, గుజరాత్‌ మధ్య మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. వర్షం పడుతుండటంతో టాస్ ఆలస్యమైంది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో స్టేడియం సిబ్బంది కవర్స్ తొలగించారు. కాసేపట్లో టాస్ వేసే అవకాశం ఉంది.

News April 10, 2024

BIG BREAKING: ఫలితాలు విడుదల

image

AP: గ్రూప్-2 ఫలితాలను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. జూలై 28న గ్రూప్-2 మెయిన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 10, 2024

జన్మభూమి కమిటీ సభ్యులే వాలంటీర్లు: సీఎం జగన్

image

AP: చంద్రబాబు సీఎం అయితే జన్మభూమి కమిటీ సభ్యుల్ని వాలంటీర్లుగా తీసుకొస్తారని సీఎం జగన్ అన్నారు. వాళ్లకు దోచిపెట్టేందుకే రూ.10వేలు జీతం ఇస్తాననే హామీ ఇచ్చాడని ఆరోపించారు. ‘వృద్ధులకు ఇంటి వద్దే అందాల్సిన పెన్షన్‌ను చంద్రబాబు ఆపించారు. ఇప్పుడు గాలి ఎదురు తిరగడంతో మళ్లీ మోసపు హామీలిస్తున్నారు. 2014లో టీడీపీ, బీజేపీ, దత్తపుత్రుడు కలిసి మోసం చేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలి’ అని కోరారు.

News April 10, 2024

ఈ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలి: పవన్ కళ్యాణ్

image

AP: రైతులను ఏడిపించిన ప్రభుత్వం తుడిచిపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. తణుకు సభలో మాట్లాడిన ఆయన.. ‘ధాన్యం తడిచిందని మంత్రికి చెబితే చీత్కారంగా మాట్లాడారు. బూతులు తిట్టి, దాడులు చేసే మంత్రులు YCP కేబినెట్‌లో ఉన్నారు. దోపిడీపై దృష్టి ఉన్న నేతలు ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారు? ఇక్కడ దోచుకున్న సొమ్ముతో మరోచోట పరిశ్రమలు పెడుతున్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో డబ్బులు దోచుకున్నారు’ అని ఆరోపించారు.

News April 10, 2024

వాలంటీర్లు రాజీనామా చేయవద్దు: చంద్రబాబు

image

AP: వాలంటీర్ల వ్యవస్థ లేదని, రాజీనామా చేసినట్లు మంత్రులు మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ‘వాలంటీర్లు దయచేసి రాజీనామా చేయవద్దు. మేం అధికారంలోకి రాగానే వారి వేతనాలను రూ.10వేలకు పెంచుతాం. వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటిస్తాం. బోగస్ వ్యక్తులను నమ్మకండి. దొంగలు సృష్టించే వార్తలను నమ్మవద్దు’ అని విజ్ఞప్తి చేశారు.

News April 10, 2024

హైదరాబాద్‌లో 15 పెట్టెల్లో నగదు పట్టివేత

image

TG: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో భారీగా నగదు పట్టుబడింది. కియా కారులో 15 పెట్టెల్లో రూ. 2కోట్ల డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నగదు స్వాధీనం చేసుకున్నామని, తరలింపుపై ఆరా తీస్తున్నామని అధికారులు తెలిపారు.

News April 10, 2024

లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: సీఎం

image

AP: ప్రపంచంలోనే వ్యవసాయం దండగ అన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు అని CM జగన్ ఫైర్ అయ్యారు. ‘రైతు రుణమాఫీ, సున్నా వడ్డీ, ఇన్‌పుట్ సబ్సిడీ హామీలన్నీ ఎగ్గొట్టాడు. రైతన్నలకు మేం తోడుగా నిలిచాం. మోసాలు చేసే చంద్రబాబు కావాలా? లేక వ్యవసాయానికి అండగా ఉంటున్న జగన్ కావాలా? సంక్షేమ కార్యక్రమాలతో రూ.2.70 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. లంచాలు, వివక్ష లేకుండా పాలన, పథకాలు అందించాం’ అని చెప్పుకొచ్చారు.