News July 12, 2024

టుడే టాప్ స్టోరీస్

image

➥AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదు: కేంద్రమంత్రి కుమారస్వామి
➥2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్టు పూర్తి: CM చంద్రబాబు
➥75% హాజరు ఉండే విద్యార్థులకే ‘తల్లికి వందనం’ పథకం
➥AP: 19 మంది IAS, 9 మంది IPSల బదిలీ
➥TG: DSC హాల్ టికెట్లు విడుదల
➥రేపు కాంగ్రెస్‌లోకి BRS MLA ప్రకాశ్ గౌడ్
➥యూట్యూబర్‌ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్
➥BSF, CISF కానిస్టేబుల్ నియామకాల్లో మాజీ అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్

News July 11, 2024

కేంద్రమంత్రి ప్రకటన సంతోషాన్నిచ్చింది: లోకేశ్

image

AP: కేంద్ర ఉక్కుశాఖ మంత్రి <<13607142>>కుమారస్వామి<<>>కి మంత్రి నారా లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ లేదంటూ ఆయన చేసిన ప్రకటన సంతోషాన్ని ఇచ్చిందన్నారు. AP ప్రజల మనోభావాలను కుమారస్వామి నిలబెట్టారన్నారు. కేంద్రమంత్రి ప్రకటన నీలి మీడియాను నిరాశపరిచి ఉండొచ్చని ఎద్దేవా చేశారు. YCP తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ప్రజల అంచనాలను అందుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ట్వీట్ చేశారు.

News July 11, 2024

ఉత్తమ నటులుగా రామ్‌చరణ్, ఎన్టీఆర్

image

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023లో RRR సినిమాకు అవార్డుల పంట పండింది. తెలుగులో బెస్ట్ ఫిల్మ్‌గా ఈ సినిమా ఎంపికయింది. ఉత్తమ నటులుగా రామ్ చరణ్, ఎన్టీఆర్, బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళిని అవార్డులు వరించాయి. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు గాను కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ బెస్ట్ కొరియోగ్రాఫర్ పురస్కారం దక్కించుకున్నారు.

News July 11, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితుల బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పుని న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. తమను అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని నిందితులు ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఛార్జ్‌షీటు సైతం సక్రమంగా దాఖలు చేయలేదని తెలిపారు.

News July 11, 2024

రాష్ట్ర ప్రగతి కోసం పార్లమెంటులో చర్చించండి: ఎంపీలకు పవన్ సూచన

image

AP: జనసేన MPలు, MLAలు ప్రతి నెలా ఓ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. రాష్ట్ర ప్రగతి, మానవ వనరుల అభివృద్ధి కోసం పార్లమెంటులో చర్చించాలని MPలకు సూచించారు. NDA, జనసేన పక్షాన మాట్లాడాలని, టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి సారించాలని తెలిపారు. తనను కలిసేందుకు వచ్చే వారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కాకుండా 10 మంది కడుపు నింపేవి తీసుకువస్తే బాగుంటుందన్నారు.

News July 11, 2024

WJHS పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

image

AP: వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్(WJHS) పొడిగింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ పథకం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకు, 34 వేల మంది కుటుంబ సభ్యులకు లబ్ధి జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.

News July 11, 2024

గంభీర్ డిమాండ్‌ను తోసిపుచ్చిన బీసీసీఐ?

image

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ డిమాండ్‌ను బీసీసీఐ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఫీల్డింగ్ కోచ్‌గా సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్‌ను తీసుకోవాలని గౌతీ కోరారు. కానీ ఈ ప్రతిపాదనకు బోర్డు పెద్దలు నో చెప్పినట్లు సమాచారం. స్వదేశీ స్టాఫ్‌ను నియమించుకునే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

News July 11, 2024

కల్కి@రూ.1,000 కోట్లు.. చరిత్ర సృష్టించిన ప్రభాస్

image

ప్రభాస్ నటించిన కల్కి 2898AD సినిమా ₹వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రెండు సినిమాలకు(బాహుబలి-2, కల్కి) ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటుడిగా డార్లింగ్ చరిత్ర సృష్టించారు. ఓవరాల్ కలెక్షన్ల జాబితాలో ఏడో స్థానానికి మూవీ చేరింది. తొలి 6 ప్లేస్‌లలో దంగల్‌(₹2,024Cr), బాహుబలి-2(₹1,810Cr), RRR(₹1,387Cr), KGF-2(₹1,250Cr), జవాన్‌(₹1,148Cr), పఠాన్‌(₹1,050Cr) ఉన్నాయి.

News July 11, 2024

అంబానీ ఇంట పెళ్లి వేడుకలు.. ముంబైలో వారికి వర్క్ ఫ్రం హోం

image

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు హాట్ టాపిక్‌గా మారాయి. మూడు రోజులపాటు జరగనున్న అనంత్-రాధిక వివాహ వేడుకలకు వీవీఐపీలు హాజరవుతున్నారు. దీంతో ముంబైలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో మూడు రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని వాణిజ్య కార్యాలయాలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశించాయి. ఈ నెల 15 వరకూ ఇంటి నుంచే పని చేయాలని పేర్కొన్నాయి.

News July 11, 2024

FILMFARE AWARDS: ‘బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం’

image

ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 బెస్ట్ ఫిల్మ్‌గా సీతారామం చిత్రం నిలిచింది. ఇందులో నటించిన హీరో హీరోయిన్లు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌లు బెస్ట్ యాక్టర్లుగా ఎంపికయ్యారు. సపోర్టింగ్ రోల్‌ బెస్ట్ యాక్టర్‌గా రానా(బీమ్లా నాయక్), ఉత్తమ నటి క్రిటిక్స్ సాయిపల్లవి(విరాటపర్వం), బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ప్రేమ్ రక్షిత్(నాటు నాటు), ఉత్తమ రచయితగా సిరివెన్నెల(కానున్న కళ్యాణం, సీతారామం)కి అవార్డులు వరించాయి.