News October 8, 2024

కొత్త టీచర్లకు పోస్టింగ్ ఎప్పుడంటే?

image

TG: డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు రేపు ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ నియామక పత్రాలను అందజేయనున్నారు. నియామక పత్రాలు అందజేసిన తర్వాత అధికారులు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు. మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపికైన వారికి ఏ పాఠశాలలో పనిచేయాలో డీఈవోలు ఉత్తర్వులు ఇస్తారు. ఈ నెల 14తో దసరా సెలవులు ముగియనుండగా ఆలోపే వారికి పోస్టింగులు ఇచ్చే అవకాశమున్నట్లు సమాచారం.

News October 8, 2024

ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

image

కర్ణాటకలోని బేకరీల్లో లభించే కేకుల్లో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఘటన మరువకముందే బెంగళూరులో ఐదేళ్ల బాలుడు కేక్ తిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్విగ్గీ డెలివరీ బాయ్ బాలరాజ్ ఆర్డర్ క్యాన్సిల్ అవడంతో సదరు కేక్‌ను ఇంటికి తీసుకొచ్చారు. దానిని ఎవరికీ పంచకుండా ఇంట్లోని భార్య, కుమారుడితో తినగా కొద్ది సేపటికే వీరు అనారోగ్యం పాలయ్యారు. కొడుకు ధీరజ్ చనిపోగా భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News October 8, 2024

హరియాణా: బీజేపీ లేదంటే కాంగ్రెస్.. లోకల్‌ పార్టీలకు ఓటర్లు నై.. నై!

image

హరియాణా ఓటర్లు ఈసారి సుస్పష్టమైన తీర్పునిచ్చారు. రాజకీయ సమీకరణాల్లో స్థానిక పార్టీలకు చోటివ్వలేదు. జాతీయ పార్టీలకే పట్టం కట్టారు. గందరగోళానికి తావులేకుండా ఏదో ఒకవైపే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. అయితే బీజేపీ లేదంటే కాంగ్రెస్‌కు ఓటేశారు. EC ప్రకారం ఈ 2 పార్టీలే 81% ఓట్‌షేర్, 84 సీట్లను పంచుకున్నాయి. INLD, BSP చెరోసీటు, ఇండిపెండెంట్లు 10% ఓట్‌షేర్‌తో 4 సీట్లలో ఆధిక్యంలో ఉన్నారు. JJP జాడే లేదు.

News October 8, 2024

BREAKING: వినేశ్ ఫొగట్ విజయం

image

భారత మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేశారు. రెండో స్థానంలో BJP అభ్యర్థి యోగేశ్ కుమార్, మూడో స్థానంలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ నిలిచారు.

News October 8, 2024

ఒలింపిక్ మెడలిస్ట్ తండ్రి గొంతెమ్మ కోర్కెలు

image

ఒలింపిక్స్-24 బ్రాంజ్ మెడలిస్ట్ <<13758670>>స్వప్నిల్ కుసాలె<<>>కు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నజరానాలపై తండ్రి సురేశ్ అసంతృప్తి వెలిబుచ్చారు. ఆయన ₹5Cr రివార్డ్, పుణే స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర్లో ఫ్లాట్, షూటింగ్ ఎరీనాకు స్వప్నిల్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. MH కంటే చిన్నదైన హరియాణా అథ్లెట్లకు భారీ నజరానాలు ఇస్తోందన్నారు. కాగా స్వప్నిల్‌కు MH ప్రభుత్వం తమ గైడ్‌లైన్స్ ప్రకారం ₹2Cr రివార్డ్ ప్రకటించింది.

News October 8, 2024

విచిత్రం: సీట్లు తగ్గాయ్.. కానీ ఓట్లు పెరిగాయి

image

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సీట్ల ఆధిక్యంలో వెనుకబడిన కాంగ్రెస్ ఓట్ల శాతంలో మాత్రం ముందుంది. ఈసీ వెబ్‌సైట్ ప్రకారం మ.12.15 గంటల సమయానికి కాంగ్రెస్ 40.25 శాతం, బీజేపీ 39.29 శాతం ఓట్లను సాధించాయి. అయితే బీజేపీ 49 సీట్లలో ఆధిక్యంలో ఉండగా, కాంగ్రెస్ 35 స్థానాలకే పరిమితమైంది.

News October 8, 2024

ఇన్‌స్టాగ్రామ్ డౌన్.. మీకూ ఇలానే జరిగిందా?

image

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదని చాలా మంది ట్విటర్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఇన్‌స్టా ఓపెన్ చేయగానే ‘something went wrong’ అని చూపిస్తుందని ఫొటోలు పంచుకుంటున్నారు. దీంతో ఇన్‌స్టాగ్రామ్ డౌన్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, దీనిని కొద్ది సమయంలోనే ఫిక్స్ చేశారని మరికొందరు ట్వీట్స్ చేస్తున్నారు. మీకూ ఇలా జరిగిందా?

News October 8, 2024

ఆధిక్యంలో భారతదేశ అత్యంత సంపన్నురాలు

image

భారతదేశపు అత్యంత సంపన్న మహిళగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ హరియాణా ఎన్నికల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమె హిసార్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా నిల్చున్నారు. కాగా ఆమె 5,103 ఓట్లు లీడింగ్‌లో ఉన్నారు. ఆమె తర్వాత INC అభ్యర్థి రామ్ నివాస్ రారా, BJP అభ్యర్థి కమల్ గుప్తా ఉన్నారు. సావిత్రి ప్రస్తుతం జిందాల్‌ స్టీల్‌ అండ్‌ పవర్‌ లిమిటెడ్‌కు ఛైర్‌పర్సన్‌‌గా ఉన్నారు.

News October 8, 2024

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ

image

AP: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారి ప్రాజెక్టులు, అమరావతి ఔటర్ రింగు రోడ్డు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. మరికొందరు కేంద్రమంత్రులతోనూ చంద్రబాబు ఇవాళ భేటీ కానున్నారు.

News October 8, 2024

ECపై BJP ఒత్తిడి చేస్తోందా: జైరామ్ రమేశ్

image

ఓట్ల లెక్కింపు తాజా వివరాలను వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తోందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ‘లోక్‌సభ ఎలక్షన్స్ తరహాలోనే అప్ టు డేట్ ట్రెండ్స్‌ను ECI వెబ్‌సైట్లో ఆలస్యంగా అప్‌డేట్ చేయడాన్ని గమనిస్తున్నాం. ఔట్ డేటెడ్, మిస్ లీడింగ్ ట్రెండ్స్‌ను షేర్ చేసేలా ECపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా’ అని ట్వీట్ చేశారు.