News April 1, 2024

పెన్షన్లను అడ్డుకున్న చంద్రబాబును దేవుడు క్షమించడు: బొత్స

image

AP: నిమ్మగడ్డ రమేశ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు వాలంటీర్లపై కుట్ర చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఇంటి వద్దే పెన్షన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని ఇప్పుడు నంగనాచి కబుర్లు చెబుతున్నారని ఫైరయ్యారు. ఇన్ని నెలలు పెన్షన్లు పంపిణీ చేస్తే రాని ఇబ్బంది ఇప్పుడెందుకు వచ్చిందని ప్రశ్నించారు. ‘వికలాంగులు, పెన్షనర్లకు ఏం సమాధానం చెప్తారు? చంద్రబాబును దేవుడు కూడా క్షమించడు’ అని మండిపడ్డారు.

News April 1, 2024

పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తాను: గడ్కరీ

image

దేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలను నిర్మూలిస్తానని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఇది కష్టమే కానీ అసాధ్యం కాదన్నారు. మరోవైపు హైబ్రీడ్ వాహనాలపై ఉన్న GSTని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ‘ప్రస్తుతం భారత్ ఇంధన దిగుమతులకు రూ.16లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ వాహనాలను నిషేధిస్తే ఆ డబ్బును రైతులు, గ్రామాలు, ఉపాధి మొదలైన అంశాలకు ఉపయోగించొచ్చు’ అని పేర్కొన్నారు.

News April 1, 2024

కడియం శ్రీహరి, కావ్యకు డిపాజిట్ రాకుండా చేస్తాం: పల్లా

image

TG: కాంగ్రెస్‌లో చేరిన MLA కడియం శ్రీహరి, కావ్య ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ రాకుండా చేస్తామని BRS MLA పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. కడియం హస్తం గూటికి చేరే కుట్రకు అసెంబ్లీ సమావేశాల్లోనే బీజం పడిందన్నారు. అందుకే ముందుగా BRSలోని నాయకులను వేధించి, వెళ్లగొట్టి కూతురుకు టికెట్ ఇప్పించుకున్నారని మండిపడ్డారు. NTR, CBN, KCRకు వెన్నుపోటు పొడిచిన పెద్ద మోసగాడు కడియం అని ఫైరయ్యారు.

News April 1, 2024

బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభం

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. రౌస్ అవెన్యూ కోర్టు జడ్జి కావేరీ బవేజా ముందు వాదనలు కొనసాగుతున్నాయి. కవిత తరఫున న్యాయవాది నితీశ్ రానా, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు.

News April 1, 2024

భగవద్గీతతో జైలుకు కేజ్రీవాల్!

image

లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ 15 రోజులు తీహార్ జైలులో జుడీషియల్ రిమాండ్‌లో ఉండనున్నారు. అయితే తనతోపాటు కొన్ని వస్తువులు జైలుకు తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. అందులో మూడు పుస్తకాలు(భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్), స్పెషల్ డైట్, మెడిసిన్స్, ఓ కుర్చీ, టేబుల్‌తో పాటు ఓ లాకెట్‌ను తనతో ఉంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.

News April 1, 2024

ఏప్రిల్ 16న IPL టీమ్ ఓనర్ల సమావేశం

image

ఐపీఎల్ సీజన్-18 మెగా వేలానికి బీసీసీఐ, ఐపీఎల్ పాల‌క మండలి కసరత్తు ప్రారంభించాయి. అందుకు సన్నాహక సమావేశాన్ని ఏప్రిల్ 16న అహ్మదాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీల ఓనర్లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వేలం విధివిధానాలు, ప్లేయర్ల రిటెన్షన్స్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ప్ర‌తి మూడేళ్లకు ఓసారి భారీ స్థాయిలో ఐపీఎల్ వేలం పాట‌ను నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే.

News April 1, 2024

ఈరోజు NEFT లావాదేవీలు చేయొద్దు: HDFC

image

తమ వినియోగదారులకు HDFC బ్యాంకు కీలక సూచనలు చేసింది. ఈ రోజు NEFT లావాదేవీలు చేయొద్దని స్పష్టం చేసింది. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా జరిగే కొన్ని కార్యకలాపాల దృష్ట్యా ఈరోజు చేపట్టే NEFT ట్రాన్సాక్షన్స్ ఆలస్యం కావడం లేదా అందుబాటులో ఉండకపోవడం జరగొచ్చని వివరించింది. దాని బదులు IMPS, RTGS, UPI విధానాలను వాడుకోవాలని కోరింది.

News April 1, 2024

ఎన్నికల వరకు కేజ్రీవాల్ బయటికొచ్చేనా?

image

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ CM కేజ్రీవాల్‌కు కోర్టు ఏప్రిల్ 15 వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఢిల్లీలో మే 25న 7 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. దీంతో ఆయన అప్పటివరకు బయటికి వస్తారా? లేదా? అని పార్టీ శ్రేణులు సందిగ్ధంలో పడ్డాయి. విచారణ పేరుతో కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ను పొడిగిస్తే పోలింగ్ నాటికి ఆయన బయటికి రావడం కష్టమే.

News April 1, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో పెద్ద నేతలు ఉన్నారు: ఉత్తమ్

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పెద్ద నేతలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారని మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ‘నా ఫోన్‌ కూడా ట్యాప్ చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారో త్వరలోనే తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్‌ చేసి జైలుకు వెళ్లారు. వారి సర్కారు గొర్రెల స్కామ్ చేసింది. ఆ పార్టీ త్వరలోనే మొత్తం ఖాళీ కావడం ఖాయం’ అని పేర్కొన్నారు.

News April 1, 2024

అక్కడే మా మ్యాచ్ పోయింది: మురళీధరన్

image

ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు 16వ ఓవర్లో లెగ్ స్పిన్నర్‌‌తో బౌలింగ్ వేయించడమే నిన్న SRH ఓటమికి ప్రధాన కారణమని ఆ జట్టు బౌలింగ్ కోచ్ మురళీధరన్ తెలిపారు. ‘మార్కండే లెగ్ స్పిన్నర్ కావడంతో తనపై షాట్స్ ఆడతారని తెలుసు. వికెట్లు పడతాయన్న ఆలోచనతో తనతో వేయించాం. సక్సెస్ కాలేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కచ్చితంగా బలంగా తిరిగొస్తాం’ అని స్పష్టం చేశారు. హసరంగ జట్టులో చేరతారని నమ్మకం ఉందని ఆయన తెలిపారు.