News April 29, 2024

మే 1 నుంచి చెన్నైలో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్

image

శంకర్ డైరెక్షన్‌లో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీ షూటింగ్ మే 1 నుంచి చెన్నైలో జరగనుందట. హైదరాబాద్ షెడ్యూల్ ఇవాళ పూర్తయిందని సినీవర్గాలు తెలిపాయి. శంషాబాద్‌లో రామ్ చరణ్, సునీల్, నవీన్ చంద్ర కాంబోలో పలు సన్నివేశాలను చిత్రీకరించినట్లు సమాచారం. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

News April 29, 2024

రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ

image

ఐపీఎల్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. అత్యధిక సార్లు 500కుపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ఆయన 7 సీజన్లలో 500కుపైగా పరుగులు బాదారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు సాధించారు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ డేవిడ్ వార్నర్ (7) రికార్డును ఆయన సమం చేశారు.

News April 29, 2024

చెన్నై రివేంజ్.. SRH పరాజయం

image

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 78 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి SRH 134 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు హెడ్(13), అభిషేక్(15) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. మార్క్రమ్(32), క్లాసెన్(20) ఫర్వాలేదనిపించినా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. CSK బౌలర్లలో తుషార్ 4, పతిరన, ముస్తాఫిజుర్ చెరో 2, జడేజా, శార్దూల్ తలో ఒక వికెట్ తీశారు.

News April 28, 2024

రేపటి నుంచి తెలంగాణలో తమిళిసై ఎన్నికల ప్రచారం

image

TG: మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. తమిళనాడు బీజేపీ వాలంటీర్లతో కలిసి 10 రోజులపాటు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొంటారు. గవర్నర్ పదవికి రాజీనామా చేసిన ఆమె తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆ స్థానానికి తొలి విడతలో పోలింగ్ పూర్తయింది.

News April 28, 2024

శ్రీరాముడిని అడిగితే బండి సంజయ్‌కి ఓటేయొద్దంటాడు: KTR

image

TG: BJP MP బండి సంజయ్‌పై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శలు గుప్పించారు. కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన KTR.. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ పరస్పర అవగాహనతో ఉన్నారని ఆరోపించారు. బండికి జైశ్రీరామ్ అనడం ఒక్కటే తెలుసని, ఒకవేళ శ్రీరాముడిని అడిగితే ఆయన కూడా బండి సంజయ్‌కు ఓటు వేయవద్దని చెబుతాడని ఎద్దేవా చేశారు.

News April 28, 2024

చరిత్ర సృష్టించిన సీఎస్కే

image

టీ20ల్లో చెన్నై సూపర్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. అత్యధిక సార్లు 200కుపైగా స్కోరు సాధించిన తొలి జట్టుగా వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఆ జట్టు 35 సార్లు 200కుపైగా స్కోర్ సాధించింది. ఎస్ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఈ ఫీట్ నెలకొల్పింది. ఆ తర్వాతి స్థానాల్లో సోమర్‌సెట్ (34), ఇండియా (32), ఆర్సీబీ (31), యార్క్‌షైర్ (29), సర్రే (28) ఉన్నాయి.

News April 28, 2024

T20WC: మే 1న భారత జట్టు ప్రకటన?

image

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక తుదిదశకు చేరుకుంది. ఈ మేరకు ఈరోజు బోర్డు సభ్యులతో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్‌శర్మ సమావేశం అయ్యారు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ జట్టు ఎంపికపై తీవ్రంగా చర్చించింది. మే 1న జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు మే 22న న్యూయార్క్‌‌కు బయలుదేరనున్నట్లు సమాచారం.

News April 28, 2024

డైరీమిల్క్ తింటున్నారా?

image

చాలామంది వేసవిలో ఫ్రిడ్జ్‌లో పెట్టిన చల్లటి చాక్లెట్లు తింటుంటారు. ముఖ్యంగా డైరీమిల్క్ అంటే చాలామంది ఇష్టపడతారు. అయితే.. ఇటీవల డైరీమిల్క్ కొన్న ఓ కస్టమర్ కంగుతిన్నారు. అది మొత్తం బూజుపట్టి, పాడైపోయి ఉండటం గమనించి.. వెంటనే సదరు కంపెనీని ట్యాగ్ చేస్తూ ట్విటర్‌లో ఫొటోలు పంచుకున్నారు. 2024 జనవరిలో తయారైన ఈ చాక్లెట్‌పై 12నెలల ఎక్స్‌పైరీ డేట్ ఉన్నా.. ఇప్పుడే ఇలా కావడం ఏంటని ప్రశ్నించారు.

News April 28, 2024

NDAకు ఓటేయకుంటే ప్రజలకే నష్టం: పవన్

image

AP: ఎన్డీఏ కూటమికి ఓటేయకుంటే ప్రజలే నష్టపోతారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ‘నేను ప్రధాని మోదీతో ధైర్యంగా మాట్లాడగలను. కానీ సీఎం జగన్‌కు ఆయనంటే భయం. కేసుల గురించే ఆయన మోదీని కలుస్తారు. రాష్ట్ర సమస్యలపై ఎన్నడూ ప్రధానిని కలవలేదు. అరటి తొక్క లాంటి వైసీపీ ప్రభుత్వాన్ని చెత్తబుట్టలో పడేయండి. జనసేన గళాన్ని అసెంబ్లీలో వినిపించాలి. అందుకే ఈ ఎన్నికల్లో కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News April 28, 2024

జయశంకరే తెలంగాణ జాతి పిత: రేవంత్

image

TG: ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతి పిత అని సీఎం రేవంత్ అన్నారు. ‘అందరూ కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. కోదండరామ్ జేఏసీ ఛైర్మన్ అయిన తర్వాతే ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. కేసీఆర్ ఉద్యమం ముసుగులో అధికారం చేపట్టారు. ఆస్తులు పెంచుకుని అవినీతికి పాల్పడ్డారు. కేసీఆర్‌పై ఎవరికీ జాలి లేదు. ఆయన అబద్ధాలతోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది’ అని ఆయన మండిపడ్డారు.