India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
దేశీయ స్టాక్ మార్కెట్లోనే ₹25,000 కోట్ల అతిపెద్ద హ్యుందాయ్ IPO అక్టోబర్ 14న ప్రారంభంకానున్నట్టు తెలుస్తోంది. సెబీకి దాఖలు చేసిన కంపెనీ DRHP ప్రకారం సంస్థ భారతీయ విభాగం కంపెనీ, ప్రమోటర్ల ద్వారా 142,194,700 ఈక్విటీ షేర్ల ఆఫర్-ఫర్-సేల్ (OFS)ని ప్రతిపాదించింది. ఈ IPOతో మారుతీ సుజుకి తర్వాత హ్యుందాయ్ మోటార్ ఇండియా గత 20 ఏళ్లలో ప్రజలకు షేర్లు ఆఫర్ చేస్తున్న మొదటి కార్ల తయారీ సంస్థగా అవతరించనుంది.
TG: మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సైబరాబాద్‌లో పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో కొండా సురేఖతో ఉన్న ఫొటోలపై ట్రోలింగ్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. దీంతో కేటీఆర్, హరీశ్‌తో పాటు పలు యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ గొడ్డు మాంసం తినేవారని చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక మంత్రి దినేష్ క్షమాపణలు చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సావర్కర్ గొడ్డు మాంసం తినడం మాత్రమే కాకుండా, ఆ ఆచారాన్ని బహిరంగంగా ప్రచారం చేశారని చెప్పడంతో వివాదం చెలరేగింది. దీంతో ‘నిజం మాట్లాడినందుకు క్షమించండి’ అని దినేష్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సావర్కర్ బ్రిటిష్ వారికి చెప్పారంటూ పోస్ట్ చేశారు.
AP: జగన్ నివాసంలోని <<14263408>>ఫర్నీచర్‌పై<<>> ప్రభుత్వానికి YCP లేఖ రాయడంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘CM పదవి నుంచి జగన్‌ని జనం దించేసినా సిగ్గు లేకుండా కుర్చీలు, టేబుళ్లు, సోఫాలు ఎత్తుకుపోయారు. అడ్డంగా దొరికిపోయిన దొంగ జగన్, తన ముఠా సభ్యులతో దొంగ ఉత్తరాలు రాయిస్తున్నాడు. ఆనాడు కోడెల శివప్రసాద్ ఇదే లేఖ రాస్తే ఎంత అమానవీయంగా ప్రవర్తించావో గుర్తుతెచ్చుకో జగన్’ అంటూ Xలో చురకలంటించారు.
JSW Steels (1.18%) మినహా BSEలో మిగిలిన 29 స్టాక్స్ గురువారం రెడ్‌లోనే ముగిశాయి. LT అత్యధికంగా 4.18% నష్టపోయింది. ఇటీవల సూచీలు జీవితకాల గరిష్ఠాలను తాకుతున్నాయి. అయినా ఒడిదొడుకుల మధ్య బుల్ జోరు కొనసాగింది. అయితే, ఓవర్ వాల్యూయేషన్ భయాలకు మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు, క్రూడాయిల్ ధరలు తోడవ్వడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. దీంతో ఒక్కరోజులోనే రూ.11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది.
ఇటీవల భార్యకు విడాకులిచ్చి వార్తల్లో నిలిచిన నటుడు జయం రవి హీరోయిన్ ప్రియాంక మోహన్‌ను పెళ్లి చేసుకోనున్నారని ఓ ఫొటో వైరలవుతోంది. ఫొటోలో ప్రియాంక, జయం రవిలు పూల దండలు ధరించారు. దీంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరేమో ఎడిట్ చేసిన ఫొటో అని చెప్తున్నారు. అయితే, ఇది వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘బ్రదర్’ మూవీలోనిదని సినీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. తప్పుడు సమాచారాన్ని నమ్మొద్దని సూచించాయి.
AP: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాడ వీధుల్లో సేనాధిపతి విశ్వక్సేనుల వారి ఉత్సవం వైభవంగా జరిపించారు. రేపు సాయంత్రం 5.45 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీ గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
AP: రాష్ట్రంలో రేపు ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
AP: రాష్ట్రంలో లాబీయింగ్‌కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, 12 నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. బార్‌ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
AP: ‘వారాహి’ డిక్లరేషన్ కార్యక్రమంలో నాలుగు భాషల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగం సాగింది. జాతీయ మీడియాకు అర్థమవ్వాలంటూ ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆయన ప్రసంగించారు. దీంతో పాటు తమిళంలోనూ ఆయన మాట్లాడారు. ఇక తెలుగులోనూ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో పవన్‌కు బహు భాషల్లో ప్రావీణ్యం ఉందని ఆయన ఫాలోవర్స్ పోస్టులు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.