India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహారాష్ట్ర కేర్‌టేకర్ సీఎం ఏక్నాథ్ శిండే ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. కొన్నిరోజులుగా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శిండేకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
RBI గవర్నర్ శక్తికాంత దాస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. DEC 10న ఆయన పదవీకాలం ముగుస్తుంది. క్రితంసారి నెలన్నర ముందుగానే కేంద్రం ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. ఇప్పుడలాంటి పరిస్థితి లేకపోవడంతో కొత్త గవర్నర్‌ను నియమిస్తారన్న ఊహాగానాలు పెరిగాయి. పైగా రెపోరేటును తగ్గించాలని ఆర్థిక, వాణిజ్య మంత్రులు బహిరంగంగానే దాస్‌ను డిమాండ్ చేస్తున్నారు. 2025 Q2లో GDP 5.4%కు తగ్గడంతో ఆయనపై విమర్శలు పెరిగాయి.
పొగమంచు, చలి, వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వైరల్ ఫీవర్లు వ్యాప్తిచెందే ఈ కాలంలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫైటో న్యూట్రియంట్స్ ఎక్కువగా లభించే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, ఉసిరి, అల్లం, వెల్లుల్లి, పసుపు, తులసి, తేనె, సోంపును విరివిగా తీసుకోవాలి. నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను తినాలి. ప్రోబయాటిక్స్ ఉండే పెరుగు, మజ్జిగ, సద్దన్నం మేలు చేస్తాయి.
AP: విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఏమైందని జనసేన ఎంపీ బాలశౌరి లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ అంశం తమ ముందు లేదని కేంద్రమంత్రి కుమారస్వామి బదులిచ్చారు. ఒకవేళ ప్రతిపాదన వస్తే దీన్ని పరిశీలిస్తామని స్వామి సభలో సమాధానం ఇచ్చారు. కేంద్రమంత్రి సమాధానంతో కడప స్టీల్ ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.
AP: నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు బండరాళ్లు, మట్టి, చెట్లను తొలగిస్తున్నారు. ఈ రోడ్డులో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
HYDలోని ఉప్పల్‌కు చెందిన భరత్ ‘గుడ్ మార్నింగ్ లండన్’ అంటూ రేడియో జాకీగా శ్రోతలను మెప్పిస్తున్నారు. UKలో MS చేసి, బిజినెస్ ఇంటెలిజెన్స్ డెవలపర్‌గా జాబ్ చేస్తున్న భరత్‌కు ప్రజలతో మమేకమవడం ఇష్టం. అందుకే జాబ్ చేస్తూనే RJగా మారారు. అక్కడి SPICE FMలో గొప్పవ్యక్తుల జీవిత విశేషాలను చెబుతూ తన గొంతుతో రేడియో ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఎంతోమంది తనను ఫోన్లో మెచ్చుకుంటుంటే ఆ తృప్తి వేరని భరత్ అంటున్నారు.
స్టీల్ దిగుమతులపై టారిఫ్స్ విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ సంకేతాలివ్వడం భారత్‌ను భయపెడుతోంది. ప్రస్తుతం దేశీయ స్టీల్ దిగుమతులు 41% పెరగ్గా ఎగుమతులు 36% తగ్గాయి. స్టీల్ నిల్వలు 15 నుంచి 30 రోజులకు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గడంతో లాభాలు తగ్గాయని కంపెనీలు అంటున్నాయి. దీంతో టారిఫ్స్ నుంచి కాపాడేందుకు 25% సేఫ్‌గార్డ్ డ్యూటీ విధించాలని కోరుతున్నాయి. 2024-25 H1లో స్టీల్ వినియోగం 13% పెరిగింది.
తెలంగాణ మలి దశ ఉద్యమ అమరుడు శ్రీకాంతచారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ‘నీ త్యాగం, తెలంగాణ గుండెలపై పచ్చబొట్టై శాశ్వతంగా నిలుస్తోంది. శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, శ్రీకాంతచారి 13 ఏళ్ల క్రితం LB నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకుని ఆత్మార్పణం చేసుకున్న దృశ్యాలు నేటికీ TG ప్రజల గుండెల్లో జై తెలంగాణ నినాదాన్ని రగిలిస్తూనే ఉంటాయి.
TG: RR(D) ఇబ్రహీంపట్నంలో కానిస్టేబుల్ నాగమణి హత్య కేసులో నిందితుడు పరమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆస్తిలో వాటా <<14770190>>అడగనని <<>>బాండ్ రాసివ్వాలని సోదరుడు పరమేశ్ గతంలో చేసిన ఒత్తిడికి ఆమె అంగీకరించలేదు. దీనికి తోడు తన పెళ్లి రద్దవడం మరో కారణం. నాగమణి కులాంతర వివాహం చేసుకోవడం, పొలం వివాదం ఉండటంతో అమ్మాయి తరఫు వారు పెళ్లి రద్దు చేసుకున్నారు. దీంతో అక్కపై కక్ష పెంచుకుని, మాటు వేసి హతమార్చాడు.
AP: శ్రీశైల దేవస్థానంలో ప్రభుత్వ సెలవులు, శని, ఆది, సోమ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సామూహిక అభిషేకాలను రద్దు చేస్తున్నట్లు ఈవో చంద్రశేఖర్ ప్రకటించారు. ఏయే రోజుల్లో ఈ సేవలు అందుబాటులో ఉండవో తెలిపేలా వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఆయా రోజుల్లో అలంకార దర్శనం మాత్రమే ఉంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.