India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాయలసీమ, పరిసర ప్రాంతాలపై సముద్రమట్టానికి 1.5కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు మన్యం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

టాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘స్కిల్ లేకుండా జీతాలు పెంచి ఇవ్వడం నిర్మాతలకు తలకు మించిన భారమే. కొన్ని క్రాఫ్ట్స్ వాళ్లు రోజుకు గంట పనిచేసినా ఫుల్ వేతనం ఇస్తున్నాం. స్కిల్స్ ఉన్నప్పటికీ యూనియన్ మెంబర్స్ కాకపోవడంతో ముంబై నుంచి అధికంగా చెల్లించి తీసుకొస్తున్నాం. ఈ సిస్టమ్ మార్చాలి. నచ్చిన వాళ్లతో పనిచేయించుకునే హక్కు మాకు ఉంది’ అని చెప్పారు.

AP: రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. 750 PVT ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన RTC అందుబాటులోకి తేనుంది. AMVTI, ATP, CUD, NLR, GNT, VJW, RJY, KKD, VSP, KRNL, TPT డిపోల నుంచి ఇవి తిరగనున్నాయి. వీటికోసం కేంద్రం అందించే రూ.190కోట్లతో ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పుతారు. ఒక్కో స్టేషన్‌కు రూ.4కోట్లు ఖర్చవుతుందని, డిసెంబర్ నాటికి వీటిని సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

తమ కుటుంబానికి అండగా ఉంటానని సోనూసూద్ భరోసా ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి తెలిపారు. తన తండ్రి దశదిన కర్మకు రూ.1.5లక్షలు ఇచ్చారని, అందువల్లే గ్రాండ్‌గా కార్యక్రమం జరిగిందని చెప్పారు. తమ ఇంటి నిర్మాణ బాధ్యతను తాను చూసుకుంటానని సోనూసూద్ చెప్పారన్నారు. ఇటీవల చనిపోయిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన సోనూసూద్, వెంకట్ తనకు సోదరుడిలాంటి వారని చెప్పారు. ఆ కుటుంబానికి పర్సనల్ నంబర్ ఇచ్చారు.

భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(UPI) సరికొత్త <<17296134>>రికార్డు<<>> సృష్టించింది. ఈనెల 2న UPI ద్వారా 70.7 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి. 2024 AUGలో రోజుకు 50 కోట్లకు చేరిన లావాదేవీలు సరిగ్గా ఏడాదిలోనే 70 కోట్ల మైలురాయిని అధిగమించాయి. మరో ఏడాదిలోగా రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దాదాపు 85% డిజిటల్ పేమెంట్స్ UPI ద్వారానే జరుగుతుండటం విశేషం.

TG: కాళేశ్వరంపై ప్రభుత్వ ఆరోపణలకు అసెంబ్లీలోనే KCR బదులిస్తారని పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగే సమావేశాలకు హాజరై ప్రాజెక్టు నిర్మాణ ఉద్దేశం, డిజైన్‌లు, నిర్మాణం తదితర అంశాల గురించి మాజీ సీఎం వివరించనున్నారు. అనారోగ్యం సహా ఇతర కారణాలతో ఇంతకాలం సభకు KCR వెళ్లలేదు. అయితే ఇప్పుడూ గైర్హాజరైతే ప్రభుత్వ వాదనే నిజమనే సందేశం ప్రజలకు వెళ్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

AP: ఈ నెల 19 నుంచి P4 అమలు చేయాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో CM చంద్రబాబు అన్నారు. ‘పేదరిక నిర్మూలనలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టాం. మార్గదర్శుల ఎంపికలో వ్యతిరేకత రాకూడదు. మార్గదర్శుల పేరుతో ఎవరినీ బలవంతం చేయవద్దు. P4పై వ్యతిరేకత తెచ్చేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు. గతంలో శ్రమదానం, నీరు-మీరునూ ఇలాగే విమర్శించారు’ అని సీఎం తెలిపారు.

టారిఫ్స్ విషయంలో ట్రంప్ మరోసారి భారత్‌కు హెచ్చరికలు జారీ చేశారు. మరో 24 గంటల్లో టారిఫ్స్ భారీగా పెంచనున్నట్లు ప్రకటించారు. ‘భారత్ మంచి వ్యాపార భాగస్వామిగా ఉండటం లేదు. వారితో బిజినెస్ చేయడం కష్టంగా మారింది. 25% టారిఫ్స్‌తో సరిపెడదామనుకున్నా. కానీ ఇప్పుడు మరింత పెంచాలని నిర్ణయించాను. రష్యా నుంచి ఆయిల్ కొంటున్నందున 24 గంటల్లో భారీ స్థాయిలో సుంకాలు పెంచబోతున్నా’ అని వ్యాఖ్యానించారు.

AP: TDP MLAల పనితీరుపై పార్టీ చీఫ్ చంద్రబాబు త్వరలో రివ్యూ చేయనున్నారు. IVRS కాల్స్, ఇంటెలిజెన్స్, పార్టీ చేసిన 2సర్వేల రిపోర్టు ఆధారంగా ఈ రివ్యూ ఉంటుందని విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి. ఓవరాల్ రిపోర్టులో రెడ్ జోన్‌లోని టాప్-20లో ఇప్పటికే కొందరితో రివ్యూ జరిగింది. త్వరలోనే మిగతా నేతలతో సమీక్షలు జరుపుతారని సమాచారం. ఇంప్రూవ్‌మెంట్ కోసం 3నెలలు టైం ఇచ్చి మారకుంటే చర్యలు తీసుకునే అవకాశముంది.

ఆయిల్ దిగుమతులపై US బెదిరింపుల నేపథ్యంలో రష్యా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ‘ట్రేడ్, ఎకనామిక్ సహకారం కోసం పార్ట్‌నర్స్‌ను ఎంచుకోవడం ఆయా దేశాల ఇష్టం. ఇది వారి హక్కు. ఇందుకు విరుద్ధంగా US చేస్తున్న ప్రయత్నాలు, హెచ్చరికలు లీగల్ కాదు’ అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆక్షేపించారు. కాగా టారిఫ్స్ భారీగా పెంచుతానన్న ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఇప్పటికే స్ట్రాంగ్ <<17305975>>కౌంటర్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.