India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది IMDb అత్యంత ఆదరణ పొందిన టాప్-10 చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

CM రేవంత్ గొప్ప నాయకుడని <<15019113>>కొనియాడిన<<>> Dy.CM పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీ పెట్టినట్లు ఉంది. పుష్ప-2 విడుదలకు ముందే రేవంత్ సినిమా చూపించారు. వారిమధ్య 14% కమీషన్ దగ్గర చెడినట్లుంది’ అని పేర్కొన్నారు.

ఆసీస్ కెప్టెన్, బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి జట్టు సారథిని ఎక్కువసార్లు ఔట్ చేసిన కెప్టెన్‌గా నిలిచారు. ఇప్పటి వరకు కమిన్స్ ఆరుసార్లు రోహిత్‌ను పెవిలియన్‌కు పంపారు. అంతకుముందు రీచీ బెనాడ్(AUS) ఇంగ్లండ్ ప్లేయర్ టెడ్ డెక్స్‌టర్‌ను ఐదుసార్లు ఔట్ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్vsగవాస్కర్(5), రీచీ బెనాడ్vsరామ్‌చంద్(4), కపిల్ దేవ్vs స్లివే ల్యాడ్(4), రిచర్డ్ బెనాడ్vs పీటర్ మే(4) ఉన్నారు.

AP: సీఎం చంద్రబాబుతో TTD ఛైర్మన్ BR నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఆయనతో చర్చించారు. వారానికి 4సార్లు TG మంత్రులు, MLAలు, MLCలు, MPల సిఫార్సు లేఖలకు CM ఓకే చెప్పారు. వారానికి 2సార్లు బ్రేక్ దర్శనం, 2సార్లు రూ.300 సిఫార్సు లేఖలకు అంగీకారం తెలిపారు. తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని TG ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

జనరేషన్ ఆల్ఫాకు రేపటితో గుడ్‌బై చెప్పనున్న మానవాళి కొత్త ఏడాదిలో జనరేషన్ బీటాకు స్వాగతం పలకనుంది. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను ఇక నుంచి జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో వీరు 16% ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు వంటి సౌలభ్యాలతో వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తారని లెక్కలేస్తున్నారు.

మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ రెండు సీజన్లు సూపర్ హిట్‌గా నిలిచాయి. రాజ్-డీకే డైరెక్షన్‌లో మూడో పార్ట్ కూడా రూపొందుతోంది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి తన షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా సిరీస్ యూనిట్ అతడిని అభినందించి సెట్‌లో కేక్ కట్ చేయించింది. ఈ సిరీస్ వచ్చే ఏడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.

TG: వచ్చే ఏడాది బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. మరోవైపు కొత్త చీఫ్‌గా తిరిగి KCRను ఎన్నుకుంటారా లేదా కొత్త నాయకుడు వస్తారా అనేది తెలియాల్సి ఉంది. కాగా ఇది కాంగ్రెస్ ఢోకా నామ సంవత్సరం అని విమర్శలు చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ కోసం నిలబడ్డారని తెలిపారు.

పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేస్తున్నప్పుడు ఎక్కడికెళ్లారంటూ ప్రశాంత్ కిశోర్‌పై నిరుద్యోగులు మండిపడ్డారు. BPSC పరీక్షల్ని రద్దు చేయాలని బిహార్ గర్దానీబాఘ్‌లో నిరసనకు దిగిన ఆందోళనకారులపై PCలు గత రాత్రి లాఠీఛార్జ్ చేశారు. అనంతరం PK అక్కడికి చేరుకోగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అయితే మా బ్లాంకెట్లు తీసుకొని మాపైనే యాటిట్యూడ్ చూపిస్తారా అని PK వ్యాఖ్యానించడం ఉద్రిక్తతకు దారితీసింది.

AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. YCP అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.

ఈ ఏడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా(65 వికెట్లు)కు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో చోటు దక్కింది. మొత్తం నలుగురు ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్(1556 రన్స్), హ్యారీ బ్రూక్(1100 రన్స్), శ్రీలంక నుంచి కమిందు మెండిస్(1049 రన్స్) ఈ రేసులో నిలిచారు. విజేతను నిర్ణయించే మీ ఓటు వేసేందుకు ఇక్కడ <
Sorry, no posts matched your criteria.