News December 30, 2024

ప్ర‌శాంత్ కిశోర్‌పై ఆందోళ‌నకారుల ఫైర్‌

image

పోలీసులు త‌మ‌పై లాఠీఛార్జ్ చేస్తున్న‌ప్పుడు ఎక్క‌డికెళ్లారంటూ ప్ర‌శాంత్ కిశోర్‌పై నిరుద్యోగులు మండిపడ్డారు. BPSC పరీక్ష‌ల్ని ర‌ద్దు చేయాల‌ని బిహార్ గ‌ర్దానీబాఘ్‌లో నిర‌స‌న‌కు దిగిన‌ ఆందోళ‌న‌కారుల‌పై PCలు గత రాత్రి లాఠీఛార్జ్ చేశారు. అనంత‌రం PK అక్క‌డికి చేరుకోగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అయితే మా బ్లాంకెట్లు తీసుకొని మాపైనే యాటిట్యూడ్ చూపిస్తారా అని PK వ్యాఖ్యానించడం ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

Similar News

News April 11, 2026

IRCTC చెన్నైలో 84 పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు

image

కాంట్రాక్ట్ పద్ధతిలో 84 హాస్పిటాలిటీ మానిటర్స్ పోస్టుల భర్తీకి IRCTC చెన్నైజోనల్ ఆఫీస్ నోటిఫికేషన్ ఇచ్చింది. BSc హాస్పిటాలిటీ&హోటల్‌ అడ్మినిస్ట్రేషన్, హోటల్‌ మేనేజ్‌మెంట్‌&క్యాటరింగ్‌ సైన్స్, సంబంధిత విభాగాల్లో BSc/BBA/MBA చేసినవారు అర్హులు. నెలకు రూ.30,000 స్టైఫండ్‌గా ఇస్తారు. వయసు 27 ఏళ్లు ఉండాలి. APR- 25, 27, 28న ఇంటర్వ్యూలు ఉంటాయి. మరిన్ని వివరాలకు https://irctc.com/new-openings.php చూడండి.

News April 11, 2026

సింగర్ మంగ్లీపై కేసు నమోదు

image

ప్రముఖ సింగర్ మంగ్లీపై HYD పంజాగుట్ట PSలో కేసు నమోదైంది. మంగ్లీ, ఆమె సోదరుడు, మరికొంతమందితో కలిసి పెట్టుబడులు, అధిక లాభాల పేరుతో 100 మంది నుంచి రూ.10 కోట్ల మేర వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. న్యాయం కోరుతూ వారు లాయర్ సుబ్బారావును ఆశ్రయించారు. కాగా ఆ న్యాయవాదిని మంగ్లీ బృందం బెదిరించడంతో అతను PSలో ఫిర్యాదు చేశారు. దీంతో మంగ్లీ సహా సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల తదితరులపై కేసు నమోదైంది.

News April 11, 2026

ఇరాన్‌కు కొత్త తలనొప్పి.. మైన్స్ దొరకట్లేదు!

image

‘హార్ముజ్’ను ఇరాన్ పూర్తిస్థాయిలో తెరవకపోవడం వెనుక ఆసక్తికర విషయాలను న్యూయార్క్ టైమ్స్ ఓ కథనంలో వెల్లడించింది. యుద్ధం ప్రారంభ దశలో IRGC మెంబర్లు స్మాల్ బోట్ల సాయంతో హార్ముజ్‌లో ఇష్టారీతిన <<19350581>>మైన్స్<<>> పెట్టారని తెలిపింది. ఇప్పుడు ఆ లొకేషన్లను ట్రాక్ చేయడం కష్టంగా మారిందని, మైన్లను తొలగించే సామర్థ్యం ఇరాన్ వద్ద లేదని పేర్కొంది. మైన్లను పెట్టడం కంటే తొలగించడం కష్టం, ఖర్చుతో కూడుకున్న పని అని వివరించింది.