India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. ఎగువ భాగంలోని సుంకేసుల జలాశయం నుంచి 4వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలకు సుంకేసులకు భారీ ప్రవాహం వస్తుండటంతో.. అక్కడి నుంచి శ్రీశైలానికి వదులుతున్నారు. అటు జూరాలకు 3వేల క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయానికి 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న నాలుగో సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ‘ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.
TG: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
TG: గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
T20 వరల్డ్ కప్‌లో పాక్‌ను ఓడించిన భారత్ ఓ అరుదైన రికార్డు సాధించింది. WCలో అత్యల్ప టార్గెట్(120)ను డిఫెండ్ చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. 2014లో శ్రీలంక 120 స్కోరు(vsకివీస్)ను కాపాడుకుని విజయం సాధించింది. ఓవరాల్‌గా పొట్టి ఫార్మాట్‌లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. గతంలో జింబాబ్వేపై 139, ఇంగ్లండ్‌పై 145, బంగ్లాదేశ్‌పై 147 స్కోర్లను డిఫెండ్ చేసుకుంది.
లోక్‌సభ మొత్తం సభ్యుల్లో కనీసం పదో వంతు మంది ఎంపీలు కలిగిన పార్టీకి ‘ప్రతిపక్ష’ హోదా అర్హత లభిస్తుంది. 2014, 2019లో ఏ పార్టీకి ఆ స్థాయిలో సభ్యులు లేరు. దీంతో పదేళ్లుగా లోక్ సభలో ప్రతిపక్ష నేత లేరు. ఈసారి INCకు 99 సీట్లు రావడంతో ఈ పదవిని చేపట్టాలని రాహుల్ గాంధీని CWC కోరింది. దీనిపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈసారి తమ సంఖ్య పెరగడంతో విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవి ఆశిస్తున్నాయి.
AP: ఏలూరు(D) తూర్పుదిగవల్లి సర్పంచి భర్త జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి ఎన్నికల్లో YCP గెలుస్తుందని పలువురితో రూ.30 కోట్ల బెట్టింగ్ కట్టాడు. ఈనెల 4న YCP ఓడిపోవడంతో ఇల్లు విడిచి వెళ్లాడు. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పందెం వేసినవారు ఇంటికి వచ్చి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లారు. మరుసటిరోజు ఇంటికొచ్చిన వేణుగోపాల్ మనస్తాపానికి గురయ్యాడు. నిన్న పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
T20WC: అత్యంత ఒత్తిడి ఉండే మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ అదుర్స్ అనిపించారు. తన పదునైన వ్యూహాలతో PAKపై 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకున్నారు. తొలి ఓవర్లలో వికెట్లు పడకపోయినప్పటికీ ఆ తర్వాత పుంజుకున్నారు. సరైన సమయానికి రోహిత్ చేసిన బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు ఫలించాయి. ముఖ్యంగా బుమ్రాను కీలక సమయాల్లో తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు. రెండు రివ్యూలు తీసుకోగా అవీ సూపర్ హిట్ అయ్యాయి.
BJP చీఫ్ జేపీ నడ్డాకి మోదీ 3.0 మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ పార్టీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నట్లు తెలుస్తోంది. ‘వన్ పర్సన్, వన్ పోస్ట్’ అనే పాలసీని ఆ పార్టీ అనుసరిస్తున్నందున కొత్త చీఫ్‌ను నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2019లో అమిత్ షా హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నడ్డా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. ఆయన నేతృత్వంలోనే 2024 ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి మరోసారి అధికారం సొంతం చేసుకుంది.
IPLలో ముంబై కెప్టెన్సీ మార్పుతో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న వారిద్దరి మధ్య జరిగిన సంఘటన అభిమానులను హత్తుకుంటోంది. PAKపై తీవ్ర ఉత్కంఠగా మ్యాచ్ సాగుతుండగా పాండ్య షాదాబ్ ఖాన్ వికెట్ తీశారు. దీంతో కెప్టెన్ రోహిత్.. పాండ్యను ఎత్తుకుని అభినందించారు. నిన్న బ్యాటింగ్‌లో విఫలమైన ఈ ఆల్‌రౌండర్ రెండు కీలక వికెట్లు తీసి, గెలుపులో కీలకపాత్ర పోషించారు.
Sorry, no posts matched your criteria.