India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.
TG: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో KTR కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ACBకి MAUD లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్‌పైనా చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.
అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.
TG: మూసీ నది గరిష్ఠ వరదపై ఐఐటీ హైదరాబాద్ సహకారంతో మళ్లీ అధ్యయనం చేపట్టనున్నారు. ఇటీవల హైడ్రాలజీ విభాగం మూసీ గరిష్ఠ వరద 1.5 లక్షల క్యూసెక్కులే అని నివేదిక ఇచ్చింది. అయితే ఈ నివేదికను ఐఐటీ హైదరాబాద్ నిపుణుల సహకారంతో పున:పరిశీలన చేయించిన తర్వాత నిర్ధారణకు రావాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే మూసీ నది సరిహద్దులు ఖరారు చేయాలని నిర్ణయించింది.
AP: విజయవాడ దుర్గగుడిలో ఈ నెల 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల స్వీకరణ జరగనుంది. డిసెంబర్ 1న అర్ధమండల దీక్షల స్వీకరణ ప్రారంభమై 5వ తేదీతో ముగుస్తుంది. DEC 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు జరుగుతాయి. దీంతో డిసెంబర్ 21-26 వరకు ఆలయంలో ప్రత్యక్ష, పరోక్ష ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఏకాంతంగా అర్చకులు మాత్రమే సేవలు నిర్వహిస్తారు. దీక్షల విరమణ సందర్భంగా ప్రతిష్ఠాపన, శతచండీయాగం, గిరి ప్రదక్షిణలు జరుగుతాయి.
TG: ప్రభుత్వం నిన్నటి నుంచి కులగణన సర్వే ప్రక్రియ ప్రారంభించింది. ప్రతి ఇంటికీ వెళ్తున్న సిబ్బంది ఇంటి నంబర్, యజమాని పేరు నమోదు చేసుకుంటున్నారు. రేపటి వరకు ఆ వివరాలన్నీ సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎల్లుండి నుంచి కుటుంబ సర్వే మొదలవుతుంది. ప్రతి ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఎంటర్ చేస్తారు. ఈ ప్రక్రియను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
AP: బంగాళాఖాతంలో రేపు లేదా ఎల్లుండిలోగా అల్పపీడనం ఏర్పడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి తోడుగా ఈశాన్య రుతుపవనాలు బలపడి రాష్ట్రంలో రానున్న 5 రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శని, ఆదివారాల్లో పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడతాయంది. అటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిన్న ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి.
అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న <<14543492>>ఉషా వాన్స్ <<>>చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని తెలుగువారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. అటు డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.
టెస్టు జట్టులో ఛతేశ్వర్ పుజారాకు ఇంకా చోటు ఉందని మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అతడిని ఎంపిక చేయకపోవడం భారత మేనేజ్‌మెంట్ చేసిన తప్పిదమని అభిప్రాయపడ్డారు. ‘ఈ జట్టులో పుజారాకు చోటు ఇవ్వడం ప్రస్తుతం ఓ అవసరం. ఓపెనింగ్ నుంచి 6వ ప్లేస్ వరకు అందరూ దూకుడుగా ఆడే ఆటగాళ్లే. పుజారా, ద్రవిడ్, విలియమ్సన్ వంటి ఆటగాళ్లకు టెస్టుల్లో చోటు ఎప్పుడూ ఉంటుంది’ అని వివరించారు.
TG: సచివాలయ ‘<<14547237>>బాహుబలి<<>>’ గేటును శాశ్వతంగా మూసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనువుగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తు బాగాలేదనే కారణంతో ఈ చర్యలు చేపట్టినట్లు మరోవైపు ప్రచారం జరుగుతోంది. కాగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపలే పెట్టాలని ప్రజలు అడిగారా? రూ.3.2కోట్ల ప్రజాధనం వృథా చేయడమెందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.