News December 30, 2024
ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు: పవన్
AP: రేవంత్ గొప్ప నాయకుడు అని, కిందిస్థాయి నుంచి ఎదిగారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ‘YCP తరహాలో CM రేవంత్ వ్యవహరించలేదు. తెలంగాణలో బెనిఫిట్ షోలకు, టికెట్ల ధర పెంపునకు అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ముందూ వెనుక ఏం జరిగిందో నాకు తెలియదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది. ఈ ఘటనలో హీరోను ఒంటరిని చేశారు. ఇందులో పోలీసుల తీరును తప్పుబట్టను’ అని మీడియా చిట్ చాట్‌లో పవన్ అన్నారు.
Similar News
News January 24, 2025
650 పోస్టులు.. ఎంపికైన వారి లిస్టు విడుదల
TG: అసిస్టెంట్ సివిల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్టును TGPSC విడుదల చేసింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం ప్రొవిజినల్ లిస్టును <
News January 24, 2025
ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్య నిషేధం
మధ్యప్రదేశ్(MP) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ సహా 17 ఆధ్యాత్మిక పట్టణాల్లో మద్యం పూర్తిగా నిషేధించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆధ్యాత్మిక ప్రాంతాల పవిత్రను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. మద్యపానం వల్ల కలిగే దుష్పరిణామాలను సీఎం నొక్కి చెప్పారు. కాగా గుజరాత్, బిహార్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే సంపూర్ణ మద్య నిషేధం అమలులో ఉంది.
News January 24, 2025
RRR కేసు.. తులసిబాబుకు కస్టడీ
AP: రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో తులసిబాబుకు కోర్టు కస్టడీ విధించింది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం తులసిబాబు గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కస్టోడియల్ టార్చర్ కేసులో అతడు A-6గా ఉన్నారు. కాగా తులసిబాబు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ప్రధాన అనుచరుడిగా ఉన్నట్లు తెలుస్తోంది.