News March 31, 2024

చంద్రబాబువి పిల్ల చేష్టలు: సజ్జల

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబువి పిల్ల చేష్టలు అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘వాలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారు. వాలంటీర్ల వ్యవస్థపై ఆయన పూటకో మాట మాట్లాడుతున్నారు. చంద్రబాబు కడుపుమంటతో మంచి వ్యవస్థను ఆపించారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛన్ అందకుండా చేశారు. వాలంటీర్లు సీఎం జగన్‌కు మేలు చేస్తారని ఆయన భయం. చంద్రబాబుది మోసపూరిత రాజకీయం’ అని ఆయన మండిపడ్డారు.

News March 31, 2024

మయాంక్‌పై దిగ్గజాల ప్రశంసలు

image

పంజాబ్‌తో మ్యాచ్‌లో సూపర్ ఫాస్ట్ బౌలింగ్‌తో అదరగొట్టిన మయాంక్ యాదవ్‌పై దిగ్గజ క్రికెటర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సౌతాఫ్రికా లెజెండ్ డేల్ స్టెయిన్ Xలో స్పందిస్తూ.. ‘155.8KPH స్పీడ్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కున్నావ్ మయాంక్’ అని ప్రశ్నించారు. ‘మయాంక్ వేగంగా బంతి విసరడంతో పాటు లైన్ అండ్ లెంత్‌ను కొనసాగిస్తున్నారు. ఇది చూడటం ముచ్చటేస్తోంది’ అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నారు.

News March 31, 2024

రైతుకు ఆర్థికసాయం ప్రకటించిన కేసీఆర్

image

TG: ‘పొలంబాట’లో భాగంగా జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధరావత్‌తండాకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ ఓ రైతుకు అండగా నిలిచారు. ‘పొలం ఎండిపోయింది. బిడ్డ పెళ్లి చేసేందుకు డబ్బుల్లేవు’ అని ఓ రైతు కేసీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన బీఆర్ఎస్ అధినేత ఆ రైతు కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News March 31, 2024

పిఠాపురం ఆలయాల్లో పవన్ కళ్యాణ్ పూజలు

image

AP: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటిస్తున్నారు. పాదగయ క్షేత్రం, కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామి, శ్రీపాద శ్రీ వల్లభుడి ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు, జనసైనికులు తరలివచ్చారు. కాగా సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించనున్నారు.

News March 31, 2024

ఆర్సీబీలో ఆ ఇద్దరిని పక్కనపెట్టాలి: K శ్రీకాంత్

image

గత 3 మ్యాచుల్లో విఫలమైన పాటీదార్, అల్జారీ జోసెఫ్‌ను ఆర్సీబీ టీమ్ పక్కనపెట్టాలని మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ సూచించారు. వారి స్థానంలో విల్ జాక్స్, ఆకాశ్ దీప్‌ను ఆడిస్తే జట్టులో సమతూకం వస్తుందని అభిప్రాయపడ్డారు. అలాగే కోహ్లీ, జాక్స్ ఇద్దరూ ఓపెనింగ్ చేయాలని, డుప్లెసిస్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలని అన్నారు. జాక్స్ ఆఫ్ స్పిన్ కూడా వేయగలుగుతారని, అతనితో 2 ఓవర్లు వేయించవచ్చని చెప్పారు.

News March 31, 2024

పాక్‌లో కటకట.. తివాచీలూ బంద్

image

ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన పాక్, డబ్బును ఆదా చేసుకునేందుకు దారుల్ని అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ కార్యక్రమాలకు ఎర్ర తివాచీలను వాడటాన్ని నిషేధించింది. కేవలం రాయబారులు వచ్చినప్పుడు మాత్రమే వాటిని వినియోగించాలని తేల్చిచెప్పింది. ఇప్పటికే ప్రధాని షరీఫ్ సహా కేబినెట్ అంతా తమ జీతాల్ని వదులుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.

News March 31, 2024

‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’.. చంద్రబాబు స్కీమ్: కేశినేని నాని

image

AP: శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైరయ్యారు. ఆయనకు పేదలంటే చులకన అని, పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. క్యాష్ కొట్టు టికెట్ పట్టు అనేది ఆయన స్కీమ్ అని మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకోవడానికి ఆయన ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నాడని ఎద్దేవా చేశారు.

News March 31, 2024

iPhone వాడుతున్నారా.. జాగ్రత్త!

image

ఐఫోన్ యూజర్లను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. రీసెట్ పాస్వర్డ్ అంటూ మెసేజ్‌లు పంపి యాపిల్ కస్టమర్ కేర్ నంబర్ నుంచే ఫోన్ చేస్తున్నారు. ‘మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్ చేస్తున్నారు. వారి నుంచి రక్షిస్తాం. ఓటీపీ చెప్పండి’ అని మోసాలకు పాల్పడుతున్నారు. ఈ సమయంలో OTP షేర్ చేస్తే మన వ్యక్తిగత సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

News March 31, 2024

సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ రేపటికి వాయిదా

image

కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ(CEC) సమావేశం రేపటికి వాయిదా పడింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో ఇవాళ INDIA కూటమి మహార్యాలీ చేపట్టింది. దీంతో CEC భేటీ రేపటికి వాయిదా పడింది. ఇందులో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి టూర్ కూడా క్యాన్సిల్ అయింది. రేపు ఆయన ఢిల్లీ వెళ్లి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు.

News March 31, 2024

మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ సౌత్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించారు. వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ అక్కడి నుంచి పోటీ చేస్తారని తెలిపారు. పాలకొండ, అవనిగడ్డ స్థానాలపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. కాగా ఇప్పటి వరకు 19 ఎమ్మెల్యే, 2 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.