India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర వర్గాల సమాచారం. ఈ మీటింగ్‌లో పీఎం ఆవాస్ యోజన – గ్రామీణ్ (PMAY-G) కింద 2 కోట్ల ఇళ్లను మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. PMAY-G లబ్ధిదారులకు ఆర్థికసాయాన్ని మరో 50% పెంచొచ్చని పేర్కొన్నాయి. ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.
జమ్మూకశ్మీర్ రియాసిలో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ALL EYES ON REASI’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. అయితే రఫాపై ఇజ్రాయెల్ దాడి సమయంలో ‘ALL EYES ON RAFAH’ అని పోస్టులు పెట్టిన సినీ సెలబ్రిటీలకు రియాసి ఉగ్రదాడి కనిపించడం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
IPL ఆడకపోవడం తాను తీసుకున్న మంచి నిర్ణయమని ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అన్నారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘IPL సమయంలో అలసటతో ఉన్నా. చిన్నచిన్న గాయాలు కూడా వేధించాయి. టోర్నీలో ఆడకుండా విశ్రాంతి తీసుకున్నా. WC వరకు ఫిట్‌నెస్ సాధించా’ అని జంపా వివరించారు. ప్రస్తుతం అతడు RR టీమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తమిళనాడు (3), హరియాణా (3) ఉన్నాయి. తెలంగాణ, పంజాబ్, వెస్ట్ బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, అస్సాం, ఒడిశా రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, హిమాచల్, అరుణాచల్, గోవా, J&Kలకు ఒక్కోటి చొప్పున పదవులు కేటాయించారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 77వేల మార్క్ తాకగా, నిఫ్టీ 23,411 పాయింట్లకు చేరి ఆల్ టైమ్ హై నమోదు చేసింది. అయితే ఐటీ, మెటల్ రంగాల షేర్లు నష్టాలు నమోదు చేయడంతో సూచీలు జోరును కొనసాగించలేకపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 140కిపైగా పాయింట్ల నష్టంతో 76,550 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 23,267 వద్ద కొనసాగుతోంది.
బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, నటుడు జహీర్ ఇక్బాల్ ఈనెల 23న పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ముంబైలో అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య వీరి వివాహం జరగనున్నట్లు తెలిపాయి. ఇప్పటికే పలువురికి ఆహ్వాన పత్రికలు అందినట్లు సమాచారం. కాగా సోనాక్షి చివరగా ‘హీరామండి’ వెబ్ సిరీస్‌లో నటించారు. జహీర్ నోట్‌బుక్, డబుల్ XL వంటి సినిమాలు చేశారు.
AP: శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం మొదలైంది. ఎగువ భాగంలోని సుంకేసుల జలాశయం నుంచి 4వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలకు సుంకేసులకు భారీ ప్రవాహం వస్తుండటంతో.. అక్కడి నుంచి శ్రీశైలానికి వదులుతున్నారు. అటు జూరాలకు 3వేల క్యూసెక్కులు, తుంగభద్ర జలాశయానికి 4వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో రానున్న నాలుగో సినిమాపై అధికారిక ప్రకటన విడుదలైంది. ఈ మూవీని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. నేడు బాలయ్య బర్త్‌డే సందర్భంగా ‘ద మాసివ్ ఎపిక్ కాంబినేషన్ ఈజ్ బ్యాక్ అగైన్’ అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ప్రకటించాల్సి ఉంది.
TG: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్, పెమ్మసాని, శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
TG: గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.