News October 3, 2024

BJPకి ప్రచారం.. 2గంటల్లోనే కాంగ్రెస్‌లోకి

image

హరియాణాకు చెందిన మాజీ MP అశోక్ తన్వర్ కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. గతంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన తన్వర్ 2019లో పార్టీకి గుడ్ బై చెప్పి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. 2022లో AAP తీర్థం పుచ్చుకున్నారు. 2024 ప్రారంభంలో BJP కండువా కప్పుకొని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఈరోజు జింద్ జిల్లాలోని సఫిడాన్‌లో BJP తరఫున ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని గంటలకే కాంగ్రెస్‌లో చేరారు.

News October 3, 2024

దేశ సంస్కృతికి మూలం శ్రీరాముడు: పవన్

image

AP: దేశ సంస్కృతికి మూలం శ్రీరామచంద్రుడని పవన్ కళ్యాణ్ అన్నారు. ‘రాముడిని హేళన చేస్తే ప్రతిఘటించకుండా ఇంట్లో కూర్చొని ఏడుస్తాం. రాముడు ఆర్యుడు, ఉత్తరాది దేవుడనే తప్పుడు సిద్ధాంతాన్ని కొందరు ముందుకు తీసుకెళ్లారు. ఆయన నల్లని ఛాయలో ఉంటాడు. సనాతన ధర్మానికి రంగు, వివక్ష లేదు. సూడో సెక్యులర్ వాదులు తమ సిద్ధాంతాలను ఇతరులపై రుద్దవద్దు’ అని అన్నారు.

News October 3, 2024

గిఫ్టులు అక్క‌ర్లేదు.. రైతుల‌కు హ‌క్కులు కావాలి: రాహుల్ గాంధీ

image

దేశంలోని రైతులు ఉచిత బ‌హుమ‌తుల‌ను కోరుకోవ‌డం లేద‌ని, వారి హ‌క్కుల‌ను మాత్ర‌మే కోరుకుంటున్నార‌ని రాహుల్ గాంధీ అన్నారు. అదానీ, అంబానీల రుణాల‌ను మాఫీ చేసిన‌ప్పుడు, రైతుల‌వి కూడా మాఫీ చేయాల‌న్నారు. హ‌రియాణా ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న మాట్లాడుతూ అదానీ పోర్టుల్లో వేల కిలోల డ్ర‌గ్స్ దొరికినా మోదీ చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. హరియాణా పిల్ల‌ల భ‌విష్య‌త్తును అదానీ నాశ‌నం చేస్తున్నార‌ని ఆరోపించారు.

News October 3, 2024

ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలు బయట పెట్టాలి: సబిత

image

TG: అక్రమంగా నిర్మించిన సబిత ఫామ్ హౌస్‌ను కూల్చాలా? అన్న సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. తన అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి 3 ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రకాలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని Xలో పేర్కొన్నారు.

News October 3, 2024

ఫేక్ SBI బ్రాంచ్ పెట్టి రూ.లక్షలు దోచారు

image

ఈమధ్య సైబర్ నేరాలను తరచూ చూస్తున్నాం. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో కొందరు కేటుగాళ్లు మరో అడుగు ముందుకేసి ఏకంగా నకిలీ SBI బ్రాంచ్‌ ప్రారంభించారు. అందులో ఉద్యోగాలు, శిక్షణ పేరుతో మోసగించి రూ.లక్షలు దండుకున్నారు. నిజమైన బ్యాంకులాగే ఉండటంతో ఈ మోసం గ్రహించలేకపోయిన ప్రజలు కొత్త అకౌంట్లు, లావాదేవీల కోసం రావడం ప్రారంభించారు. అందులో ఉద్యోగం పొందినవారు సైతం నిజం తెలిసి షాకయ్యారు.

News October 3, 2024

దేవుడికి అపచారం జరిగితే ఊరుకుంటామా?: పవన్

image

AP: తనను వ్యక్తిగతంగా హేళన చేసినా ఎన్నడూ స్పందించలేదని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. అలా అని సాక్షాత్తూ కలియుగ వేంకటేశ్వరుడికే అపచారం జరిగితే ఊరుకుంటామా? అని ప్రశ్నించారు. ‘అన్నీ రాజకీయాల కోసమేనా? ఇలాంటి సభలో మాట్లాడతానని అనుకోలేదు. 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా వైసీపీ నేతలకు బుద్ధి రాలేదు. ఇది సినిమా, రాజకీయ సమయం కాదు. భగవంతుడి సమయం’ అని వ్యాఖ్యానించారు.

News October 3, 2024

వాళ్లతో గొడవ పెట్టుకోవడానికే వచ్చా: పవన్

image

AP: సనాతన ధర్మాన్ని ఎవరైతే మట్టిలో కలిపేస్తాం అన్నారో వాళ్లతో గొడవ పెట్టుకోవడానికే వచ్చానని తిరుపతి వారాహి సభలో పవన్ స్పష్టం చేశారు. సభలో యువత అరుస్తుండగా ‘ముస్లిం మతాన్ని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్లు అల్లా అని రాగానే సైలెంట్ అవుతారు. మనం హైందవ ధర్మానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వం. డిప్యూటీ సీఎంగా, జనసేన అధినేతగా నేను ఇక్కడికి రాలేదు. సనాతన ధర్మాన్ని ఆచరించే సాధారణ వ్యక్తిగానే వచ్చా’ అని తెలిపారు.

News October 3, 2024

చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు: రేవంత్

image

TG: యువత డ్రగ్స్ జోలికి వెళ్తే ఏమి సాధించలేరని సీఎం రేవంత్ అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం కప్ క్రీడా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చదువుతోనే కాకుండా క్రీడలతోనూ భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. దానికి సిరాజ్, నిఖత్ జరీన్, మాలవత్ పూర్ణ నిదర్శనమన్నారు. రాష్ట్ర అథ్లెట్లకు శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. 2028 ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారులు పతకాలు సాధించాలన్నారు.

News October 3, 2024

నాకు ఏ రాజకీయ నాయకుడితో సంబంధం లేదు: రకుల్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఖండించారు. ‘బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మహిళ ఇలాంటి నిరాధారమైన, దుర్మార్గపు పుకార్లను వ్యాప్తి చేయడం బాధాకరం. పొలిటికల్ మైలేజీ కోసం నా పేరును కూడా ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నా. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. నాకు ఏ రాజకీయ పార్టీ/వ్యక్తితో సంబంధం లేదు. రాజకీయాలకోసం ఇలాంటి కల్పిత కథలతో ముడిపెట్టడాన్ని ఆపేయాలి’ అని కోరారు.

News October 3, 2024

గడియారం గుర్తును వాడకుండా అజిత్‌ను అడ్డుకోండి: శరద్ పవార్

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ ఆధ్వర్యంలోని NCP గడియారం గుర్తును ఉపయోగించకుండా అడ్డుకోవాలంటూ శరద్ పవార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. NCP SP, NCPల గుర్తుల విషయంలో ఇప్పటికీ ప్రజల్లో అయోమయం నెలకొందని పేర్కొన్నారు. పారదర్శక ఎన్నికల కోసం గడియారం గుర్తు వాడుకోకుండా అజిత్ వర్గాన్ని అడ్డుకోవాలని కోరారు. గతంలో పార్టీ చీలికతో మెజారిటీ MLAలు అజిత్ వైపు ఉండడంతో గుర్తు ఆయనకే దక్కింది.