India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్రాన్ని అప్పుల కుప్పపై కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నావా చంద్రబాబూ? అని వైసీపీ ప్రశ్నించింది. ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే 6 నెలల్లో రూ.1,12,750 కోట్ల అప్పు చేశారని విమర్శించింది. ప్రభుత్వ అప్పులు, ప్రభుత్వ గ్యారంటీతో పౌర సరఫరాల సంస్థ పేరుతో, ఏపీఎండీసీ, రాజధాని పేరుతో అప్పులు చేసిందంటూ ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. ఇక మిగిలిన నాలుగున్నరేళ్లలో ఎంత అప్పు చేస్తుందో? అని ఎద్దేవా చేసింది.

సంక్రాంతికి సరదాగా ఎగురవేసే గాలిపటాలకు వాడే మాంజాలు మనకే పాశాలుగా మారుతున్నాయి. ఏటా చైనా మాంజాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనగామ (TG)లో మాంజా దారం మెడకు చిక్కుకుని నలుగురు గాయపడ్డారు. సెలవులు ఇచ్చి, పండుగ దగ్గర పడేకొద్దీ పతంగులు ఎగరేయడం ఎక్కువవుతుంది. ఈ మాంజా వాడితే ప్రమాదాలూ ఎక్కువయ్యే అవకాశముంది. కాబట్టి గాలిపటం తెగినా ఫర్వాలేదు కానీ వీటిని వాడకండి.
Share It

మెల్‌బోర్న్ టెస్టులో టీమ్ఇండియా ఘోర ఓటమిపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీ, రోహిత్ వీడ్కోలు పలకాలంటూ Retire హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికే 55k పోస్టులు పెట్టారు. ‘సిగ్గుంటే రోహిత్, కోహ్లీ రిటైరవ్వాలి’, ‘టెస్టులకు అశ్విన్ రిటైర్మెంట్ ఇవ్వడం అవమానం కాదు. రోహిత్, కోహ్లీ ఇంకా ఆడుతుండగా ఇవ్వడమే అవమానం’, ‘భారత్‌కు బ్యాడ్‌న్యూస్. ఎవ్వరూ రిటైరవ్వడం లేదు’ అని ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు.

TG: వాజ్‌పేయి తరహాలోనే మన్మోహన్ సింగ్‌కు అంత్యక్రియలు నిర్వహించినట్లు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని దుయ్యబట్టారు. ప్రధానిగా సేవలందించిన నెహ్రూ కుటుంబేతర వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ తగిన విధంగా గౌరవించలేదని విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు.

Mon ప్రారంభ సెషన్‌ను లాభాలతో ఆరంభించిన స్టాక్ మార్కెట్లు చివరికి నష్టాలతో ముగించాయి. Sensex 78,248 (-450) వద్ద, నిఫ్టీ 23,644 (-168) వద్ద స్థిరపడ్డాయి. అధిక వెయిటేజీ రంగాలైన బ్యాంకు, ఫైనాన్స్, ఆటో, మెటల్ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఐటీ, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్ ఇండెక్స్ రాణించాయి. Sensexలో 79,090 వద్ద, నిఫ్టీలో 23,900 వద్ద కీలక రెసిస్టెన్స్ సూచీలకు అడ్డుగోడలా నిలిచింది.

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి మూవీ అరుదైన ఘనత సాధించింది. ఈ ఏడాది IMDb అత్యంత ఆదరణ పొందిన టాప్-10 చిత్రాల్లో తొలి స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ ట్వీట్ చేసింది. ఈ ఘనత సాధించినందుకు సంతోషంగా ఉందని పేర్కొంది. అమితాబ్, కమల్ హాసన్, దీపిక నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.

CM రేవంత్ గొప్ప నాయకుడని <<15019113>>కొనియాడిన<<>> Dy.CM పవన్ కళ్యాణ్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో పవన్ చెప్పాలన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసినట్టు భావిస్తున్నారా అని ప్రశ్నించారు. ‘అల్లు అర్జున్ కోసమే అసెంబ్లీ పెట్టినట్లు ఉంది. పుష్ప-2 విడుదలకు ముందే రేవంత్ సినిమా చూపించారు. వారిమధ్య 14% కమీషన్ దగ్గర చెడినట్లుంది’ అని పేర్కొన్నారు.

ఆసీస్ కెప్టెన్, బౌలర్ పాట్ కమిన్స్ చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి జట్టు సారథిని ఎక్కువసార్లు ఔట్ చేసిన కెప్టెన్‌గా నిలిచారు. ఇప్పటి వరకు కమిన్స్ ఆరుసార్లు రోహిత్‌ను పెవిలియన్‌కు పంపారు. అంతకుముందు రీచీ బెనాడ్(AUS) ఇంగ్లండ్ ప్లేయర్ టెడ్ డెక్స్‌టర్‌ను ఐదుసార్లు ఔట్ చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్vsగవాస్కర్(5), రీచీ బెనాడ్vsరామ్‌చంద్(4), కపిల్ దేవ్vs స్లివే ల్యాడ్(4), రిచర్డ్ బెనాడ్vs పీటర్ మే(4) ఉన్నారు.

AP: సీఎం చంద్రబాబుతో TTD ఛైర్మన్ BR నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై ఆయనతో చర్చించారు. వారానికి 4సార్లు TG మంత్రులు, MLAలు, MLCలు, MPల సిఫార్సు లేఖలకు CM ఓకే చెప్పారు. వారానికి 2సార్లు బ్రేక్ దర్శనం, 2సార్లు రూ.300 సిఫార్సు లేఖలకు అంగీకారం తెలిపారు. తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని TG ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.

జనరేషన్ ఆల్ఫాకు రేపటితో గుడ్‌బై చెప్పనున్న మానవాళి కొత్త ఏడాదిలో జనరేషన్ బీటాకు స్వాగతం పలకనుంది. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను ఇక నుంచి జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో వీరు 16% ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు వంటి సౌలభ్యాలతో వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తారని లెక్కలేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.