India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పార్లమెంటును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ఎన్నికల(స్నాప్ ఎలక్షన్స్)కు ఆయన పిలుపునిచ్చారు. EU ఎన్నికల్లో విపక్షాలకు మద్దతు పెరిగిన నేపథ్యంలో పార్లమెంటును రద్దు చేశారు. 2022లో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా మాక్రాన్ ఎన్నికయ్యారు. రాజీనామా చేయలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 30, జులై 7న ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
T20 WCలో విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా పంపడం కలిసి రావట్లేదు. ఫస్ట్ 2 మ్యాచుల్లో కింగ్ ఫెయిల్ అయ్యారు. ఐర్లాండ్‌తో తొలి మ్యాచులో 1 రన్ మాత్రమే చేసిన విరాట్.. నిన్న PAKపై 4 పరుగులు చేశారు. విరాట్ తొలి ఓవర్లలో ఔట్ కావడంతో మిడిల్ ఆర్డర్లో అనుభవజ్ఞుడైన ప్లేయర్ లోటు ఏర్పడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ శర్మకు జోడీగా యువ సంచలనం యశస్వీ జైస్వాల్‌ను పంపితే బెటర్ అంటున్నారు.
AP: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని CRDA కమిషనర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో ఇవాళ ఆయన పర్యటించారు. అక్కడి తాగునీటి ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. జంగిల్ క్లియరెన్స్ తర్వాత రాజధానిలో రహదారులను బాగు చేస్తామని చెప్పారు. చివరి దశలో ఉన్న నిర్మాణాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు మరణించడం లేదా రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన పలు స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాల్లో జులై 10న ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 14న విడుదల కానుంది. జూన్ 21న నామినేషన్ల దాఖలు, 24న పరిశీలన, 26న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. జులై 13న కౌంటింగ్ ఉంటుందని వివరించింది.
TG: కేంద్రమంత్రి అమిత్‌షాతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన షాకు ఈటల శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటలను నియమిస్తారనే చర్చ నడుస్తున్న వేళ ఈ భేటీ ఆసక్తిగా మారింది.
ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని రైతుల జీవితాలను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రధానిగా మూడో సారి బాధ్యతలు స్వీకరించాక మొదట పీఎం కిసాన్ నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశానని పేర్కొన్నారు. దీంతో 9 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందుతారని తెలిపారు. రాబోయే రోజుల్లో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ వ్యవసాయ రంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తామన్నారు.
BJP ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయాపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పలువురు మహిళలను లైంగికంగా వేధించారని RSS సభ్యుడు శాంతను సిన్హా ఆరోపించడం చర్చనీయాంశమైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సైతం డిమాండ్ చేస్తోంది. అయితే తనపై నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారంటూ శాంతనుపై మాలవీయా రూ.10కోట్ల పరువునష్టం దావా వేశారు.
మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ కాన్వాయ్‌పై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ భద్రతా సిబ్బంది గాయపడ్డారు. కాంగ్పోక్పీ జిల్లాలో ఈ ఘటన జరిగింది. జిరిబామ్ ప్రాంతంలో రేపు సీఎం పర్యటించనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు సెక్యూరిటీ బృందం ఆ ప్రాంతానికి బయలుదేరింది. ఈ క్రమంలో మిలిటెంట్లు కాన్వాయ్‌పై ఆకస్మిక దాడికి పాల్పడ్డారు. కాగా జిరిబామ్‌లో ఇటీవల మిలిటెంట్లు 70కిపైగా ఇళ్లకు నిప్పుపెట్టారు.
AP: వైఎస్ జగన్ ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నాడని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన TDP నేత గౌరీనాథ్ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్లే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. హత్యారాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
జమ్మూకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ ప్రకటించింది. పర్యాటకులు, స్థానికేతరులే లక్ష్యంగా భవిష్యత్తులో మరిన్ని దాడులు జరుగుతాయని, ఇది సరికొత్త ఆరంభమని పేర్కొంది. కాగా నిన్నటి ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతాబలగాలు గాలిస్తున్నాయి.
Sorry, no posts matched your criteria.