News June 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 11, 2024

పాక్ ఓటమికి ఇమాద్ బ్యాటింగే కారణం: మాజీ కెప్టెన్

image

భారత్ అద్భుత బౌలింగ్‌తోపాటు పాక్ బ్యాటర్ల తప్పిదాల వల్లే తమ జట్టు ఓడిపోయిందని మాజీ కెప్టెన్ సలీమ్ మాలిక్ అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన వసీమ్ ఇమాద్ 23 బంతుల్లో 15 రన్స్ చేయడం కూడా ఓ కారణమన్నారు. దూకుడుగా ఆడాల్సి ఉన్నా అతను బంతులను వృథా చేశారని విమర్శించారు. కెప్టెన్ బాబర్‌తో ఆటగాళ్లకు సమస్య ఉన్నట్లుందని, అది జట్టుపై ప్రభావం చూపుతోందని మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది చెప్పారు.

News June 11, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 11, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: జూన్ 11, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 4:20 గంటలకు
సూర్యోదయం: ఉదయం 5:41 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:16 గంటలకు
అసర్: సాయంత్రం 4:52 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:50 గంటలకు
ఇష: రాత్రి 8.12 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News June 11, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 11, మంగళవారం
జ్యేష్ఠమాసం
శు.పంచమి: సాయంత్రం 5.27 గంటలకు
అశ్లేష: రాత్రి 11:39 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:13 నుంచి 9:05 వరకు
దుర్ముహూర్తం: రాత్రి 11:00 నుంచి 11:45 వరకు
వర్జ్యం: ఉదయం 11.31 నుంచి మధ్యాహ్నం 1.15 వరకు

News June 11, 2024

నేటి ముఖ్యాంశాలు

image

* కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
* పౌరవిమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు
* గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖల సహాయ మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్
* హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్
* భారీ పరిశ్రమలు, ఉక్కు సహాయ మంత్రిగా శ్రీనివాసవర్మ
* PMAY కింద 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని కేబినెట్ నిర్ణయం
* రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన వైసీపీ నేత కేశినేని నాని

News June 11, 2024

మలావీ ఉపాధ్యక్షుడు ప్రయాణిస్తున్న విమానం మిస్సింగ్

image

ఆఫ్రికా ఖండంలోని మలావీ దేశ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా ప్రయాణిస్తున్న విమానం కనిపించకుండా పోయినట్లు అక్కడి ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ల్యాండింగ్ వైఫల్యం తర్వాత మిస్ అయినట్లు పేర్కొంది. వైమానిక అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ జాడను తెలుసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని వెల్లడించింది. ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చిలిమాతో పాటు మరో 9 మంది ఉన్నారు.

News June 11, 2024

బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ

image

T20WCలో బంగ్లాదేశ్‌పై సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తొలుత 20 ఓవర్లలో 113/6 స్కోరు మాత్రమే చేసిన ప్రొటీస్ టీమ్.. తర్వాత బంగ్లాదేశ్‌ను 109/7 స్కోరుకే కట్టడి చేసింది. చివరి ఓవర్‌లో బంగ్లా 11 రన్స్ చేయాల్సి ఉండగా, స్పిన్నర్ మహరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. 6 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టి జట్టుకు అపురూప విజయాన్ని అందించారు.

News June 10, 2024

ప్రేయసితో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ వివాహం

image

ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డేనియెల్ వ్యాట్ తన ప్రేయసి జార్జి హోడ్జ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. సుదీర్ఘ కాలం నుంచి రిలేషన్ షిప్‌లో ఉన్న వీరిద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఈ జోడీకి భారత మహిళా క్రికెటర్ షఫాలీ, ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ అభినందనలు తెలియజేశారు. గతంలో ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు నాట్ స్కీవర్, కేథరిన్ బ్రంట్ కూడా పెళ్లి చేసుకున్నారు.

News June 10, 2024

రాష్ట్రంలో తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం

image

APలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రూ.5కే ఆహారం అందించే ఈ క్యాంటీన్‌ను స్థానిక MLA నందమూరి బాలకృష్ణ పున:ప్రారంభించారు. NBK స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం తినిపించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది. ఆ దిశగా ఇవాళ తొలి అడుగు పడటంతో మిగతా చోట్ల కూడా త్వరలోనే ప్రారంభమయ్యే ఛాన్సుంది.