News June 11, 2024

BJP ముందు మరో రెండు టాస్క్‌లు

image

మంత్రివర్గ ఏర్పాటుతో కాస్త ఉపశమనం పొందినా BJP ముందు మరో 2 పనులు మిగిలి ఉన్నాయి. అవి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక, BJP జాతీయాధ్యక్షుడి ఎంపిక. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేబినెట్‌లోకి రావడంతో ఆ పోస్టు ఖాళీగా మారనుంది. నూతన అధ్యక్షుడి ఎంపిక తమ చేతుల్లోని వ్యవహారమే కావడంతో ఆ టాస్క్ పెద్ద కష్టమేం కాదు. కానీ, లోక్‌సభ స్పీకర్ ఎన్నిక మాత్రం అలా కాదు. ఆ పదవి కోసం ఇటు TDP, అటు JDU పోటీలో ఉన్నాయి.

News June 11, 2024

అక్కడ ఒక రోజు ముందే ‘కల్కి’ రిలీజ్

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ లండన్‌లో ఒక రోజు ముందుగానే రిలీజ్ కానుంది. అక్కడి బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఐమ్యాక్స్‌లో ప్రీమియర్ వేయనున్నారు. గతంలో ఇక్కడ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కూడా ఒక రోజు ముందే విడుదలైంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.

News June 11, 2024

సింగరేణి కారుణ్య నియామక ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్

image

సింగరేణి కారుణ్య నియామకాల్లో వారసుల వయోపరిమితి 35 నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ ప్రకటించారు. 2018 మార్చి 9 నుంచి దీన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

News June 11, 2024

500 ఏళ్ల నాటి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు ఇవ్వనున్న ఇంగ్లండ్

image

భారత్‌లో దోచుకుని తమ దేశానికి తరలించిన విలువైన పురాతన వస్తువులను విదేశీ ప్రభుత్వాల ఒత్తిడితో ఆంగ్లేయులు తిరిగిచ్చేస్తున్నారు. తాజాగా హిందూ కవి తిరుమంగై ఆళ్వార్‌కు చెందిన 500 ఏళ్లనాటి కాంస్య విగ్రహాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అంగీకరించింది. తిరుమంగై ఆళ్వార్ విగ్రహాన్ని ఓ ఆలయం నుంచి దొంగిలించారని నాలుగేళ్ల క్రితం UKలోని భారత హైకమిషన్ ఆరోపణలు చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

News June 11, 2024

విద్యార్థులకు గుడ్‌న్యూస్

image

ఈ విద్యా సంవత్సరం నుంచి ఉన్నత విద్యాసంస్థల్లో ఏటా రెండుసార్లు జులై-ఆగస్టు, జనవరి-ఫిబ్రవరిలో ప్రవేశాలు నిర్వహించనున్నట్లు UGC చీఫ్ జగదీశ్ కుమార్ తెలిపారు. బోర్డు ఫలితాల్లో ఆలస్యం తదితర సమస్యల వల్ల జులై-ఆగస్టులో అడ్మిషన్ తీసుకోలేనివారు JAN-FEBలో ప్రవేశం పొందొచ్చన్నారు. కంపెనీలు కూడా రెండుసార్లు క్యాంపస్ ప్లేస్‌మెంట్లు నిర్వహించడం వల్ల పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని జగదీశ్ వెల్లడించారు.

News June 11, 2024

ఈనెల 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక?

image

ఈనెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 రోజులపాటు సాగే ఈ సెషన్‌లో తొలి రెండు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణం స్వీకారం చేస్తారు. 26న లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరగనున్నట్లు సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలకంగా మారిన టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది.

News June 11, 2024

‘అగ్నిపథ్’పై రాజ్‌నాథ్ సమీక్ష!

image

మరోసారి రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రాజ్‌నాథ్ సింగ్ అగ్నిపథ్‌ స్కీమ్‌ సమీక్షకు తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే సైనిక దళాల నుంచి అభిప్రాయ సేకరణ కూడా ప్రారంభమైందట. ఆ సూచనల మేరకు స్కీమ్‌‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. దీంతో పాటు జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాదుల ముప్పు పెరగడం, LAC, LOC వద్ద మౌలికవసతుల అభివృద్ధి వంటి అంశాలపై కూడా రాజ్‌నాథ్ దృష్టిసారించనున్నారు.

News June 11, 2024

అదే జరిగితే యాపిల్ డివైజ్‌లను నా కంపెనీల్లో బ్యాన్ చేస్తా: మస్క్

image

ఓపెన్ఏఐతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోవడాన్ని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ తప్పుపట్టారు. ఈ స్పైవేర్‌ను యాపిల్ డివైజ్‌లలోకి తీసుకురావొద్దని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్‌కు సూచించారు. ఒకవేళ ఐఓఎస్‌లో ఓపెన్ఏఐ వస్తే తన సంస్థల్లో యాపిల్ డివైజ్‌లను బ్యాన్ చేస్తానని హెచ్చరించారు. ‘ఓపెన్ఏఐతో యూజర్ల ప్రైవసీకి భంగం కలగదని యాపిల్ నమ్ముతోంది. కానీ ఓపెన్ఏఐ చేతికి డేటా వెళ్తే ఏమవుతుందో ఆ కంపెనీకి తెలియదు’ అని పేర్కొన్నారు.

News June 11, 2024

కేసీఆర్‌కు నోటీసులు

image

TG: ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన పాత్ర ఏంటో వివరించాలని మాజీ సీఎం కేసీఆర్‌కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందంపై ఈ నెల 30లోపు వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొంది. కాగా జులై 30 వరకు తాను విచారణకు రాలేనని కేసీఆర్ తెలిపారు.

News June 11, 2024

CM ప్రమాణ స్వీకారానికి స్టేట్ గెస్ట్‌గా చిరంజీవి

image

AP: సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఇవాళ సాయంత్రానికే ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. కాగా ఇప్పటివరకు ఈ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరవుతారని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలుస్తోంది. మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.