India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రిప్టో కరెన్సీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ క్రిప్టో మార్కెట్ విలువ 1.48% తగ్గి $3.28Tగా ఉంది. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.77% మేర తగ్గి $1561 (Rs 1.32L) నష్టపోయింది. ప్రస్తుతం $93,412 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ విలువ $1.84Tగా ఉంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 0.16% తగ్గి $3,387 వద్ద చలిస్తోంది. XRP 4.19, BNB 2.52, SOL 2.15, DOGE 2.37, ADA 1.84, TRX 0.74, AVAX 3.02% మేర పడిపోయాయి.

TG: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ రెగ్యులర్ బెయిల్ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. చిక్కడపల్లి పోలీసులు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయడంతో ఇరువురు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. జనవరి 3న జరిగే విచారణలోనే కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.160 పెరిగి రూ.78,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పెరిగి రూ.71,500కు చేరింది. వెండి ధర ప్రస్తుతం కేజీ రూ.99,900గా ఉంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఇవాళ Dy.CM పవన్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు జనవరి 4 లేదా 5న జరిగే ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. పవన్ తన నిర్ణయం వెల్లడించగానే వేదికను యూనిట్ ఖరారు చేయనుంది. అటు పవన్‌తో భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై దిల్ రాజు మాట్లాడారు.

TG: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ Xలో ప్రశ్నల వర్షం కురిపించారు. ‘అట్టహాసంగా ప్రారంభించిన కామన్ డైట్ ఆరంభ శూరత్వమేనా? గురుకులాలను ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఏడాదిలో 50 మందికి పైగా విద్యార్థులు మరణించినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా ఉంటే ఇప్పుడు నిర్లక్ష్యం చూపిస్తున్నారు’ అని రాసుకొచ్చారు.

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు 184 రన్స్ తేడాతో పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్సులో ఓపెనర్ జైస్వాల్(84), పంత్(30) మినహా మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. AUS బౌలర్లలో కమిన్స్, బోలాండ్ తలో 3, లయన్ 2, స్టార్క్, హెడ్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆస్ట్రేలియా 2-1తో లీడ్‌లోకి దూసుకెళ్లింది. దీంతో భారత్ WTC ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి.

H1B వీసా వివాదం సద్దుమణిగినట్టే. <<15002323>>టాప్<<>> టాలెంట్‌ను ఆకర్షించేందుకు వీసాలపై పరిమితి ఉండొద్దన్న మస్క్, రామస్వామి వాదనకు డొనాల్డ్ ట్రంప్ తలొగ్గారు. తానెప్పుడూ ప్రతిభకు వ్యతిరేకం కాదన్నారు. టెక్ సహా అనేక రంగాల్లో ప్రతిభావంతుల కొరతను మస్క్ ఎత్తిచూపడంతో ఆయన ఆలోచనలో పడ్డారని తెలిసింది. పరిమితి పెడితే భారతీయులు, చైనీయులు సొంత దేశాలకు వెళ్లి కంపెనీలు పెట్టి అక్కడే ఉపాధి కల్పిస్తారన్న వాదనకు అంగీకరించారు.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌ను కలిశారు. రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏపీలో చేయాలని నిర్ణయించినట్లు రాజు ఆయనకు వివరించారు. వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని పవన్‌ను ఆహ్వానించారు. అలాగే ఏపీలో సినీ ఇండస్ట్రీ అభివృద్ధి పైనా ఇరువురు చర్చిస్తున్నారు.

AP: BCల పట్ల CM చంద్రబాబు మరోసారి చిత్తశుద్ధి నిరూపించుకున్నారని మంత్రులు అన్నారు. BC అయిన విజయానంద్‌కు CS బాధ్యతలు అప్పగించడం గొప్ప విషయమని, కూటమి ప్రభుత్వం అంటేనే BC, SC వర్గాల ప్రతినిధి అని అనగాని చెప్పారు. తొలిసారి BCని CSగా నియమించడం సంతోషమని కొల్లు రవీంద్ర అన్నారు. DGP, పార్టీ అధ్యక్షుడు, CS పదవులను BCలకు ఇచ్చి CBN వారి పట్ల ప్రేమాభిమానాలను చాటుకున్నారని పార్థసారథి కొనియాడారు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. క్రీజులో కుదురుకున్న జైస్వాల్(84) వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. ఆస్ట్రేలియా DRS కోరగా రిప్లైలో బాల్ బ్యాటును తాకనట్లుగా కనిపించింది. పదే పదే పరిశీలించిన థర్డ్ అంపైర్ చివరకు ఔట్‌గా ప్రకటించారు. దీంతో జైస్వాల్ నిరాశగా వెనుదిరిగారు. భారత్ మ్యాచ్ ఓడకుండా ఉండాలంటే మరో 21 ఓవర్లు క్రీజులో ఆడాలి.
Sorry, no posts matched your criteria.