News June 12, 2024

Breaking: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల

image

TG: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్షలకు 2,36,487 మంది హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

News June 12, 2024

నేను డైలమాలో ఉన్నా: రాహుల్ గాంధీ

image

2024 లోక్‌సభ ఎన్నికల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేశామని రాహుల్ గాంధీ అన్నారు. కేరళలో రోడ్ షోలో మాట్లాడుతూ వయనాడ్ నుంచి తనను రెండో సారి ఎంపీగా గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తాను వయనాడ్ ఎంపీగా కొనసాగాలా లేక రాయ్‌బరేలీ ఎంపీగా ఉండాలా అనే విషయంలో డైలమాలో ఉన్నానని చెప్పారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా ఆ రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు

News June 12, 2024

చంద్రబాబుకు నవీన్ పట్నాయక్ అభినందనలు

image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నారా చంద్రబాబు నాయుడికి ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనికతతో కూడిన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని కచ్చితంగా నమ్ముతున్నా. మీ అందరికి విజయం చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News June 12, 2024

నిర్మల 2.0లో సెన్సెక్స్ టార్గెట్ లక్ష!

image

కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2019 మే 31న నిర్మల తొలిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు సెన్సెక్స్ 39,700 వద్ద ఉంది. అది కాస్త 93% పెరిగి 77వేల మార్క్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రెండో టర్మ్‌లోనూ మార్కెట్లు దూసుకెళ్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. FY28కు లక్ష మార్క్ దాటుతుందని జోస్యం చెబుతున్నారు.

News June 12, 2024

మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ నేపథ్యం

image

* 2003లో రాజకీయ ప్రస్థానం మొదలు
* 2024లో తొలిసారి ఎమ్మెల్యేగా రాయచోటి నుంచి ఎన్నిక
* రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం
* తండ్రి మండిపల్లి నాగిరెడ్డి మాజీ ఎమ్మెల్యే.. రాయచోటి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా 1985, 1989లో గెలుపు
* సోదరుడు నారాయణ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే (1993, 1994)

News June 12, 2024

పయ్యావుల కేశవ్ పొలిటికల్ ప్రొఫైల్

image

*1994లో ఎన్టీఆర్ పిలుపుతో తొలి సారి ఉరవకొండ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.
*1994, 2004, 2009, 2019, 2024లో విజయాలు. 1999, 2014లో అపజయాలు.
*2015-19 వరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ.
*1999 మినహా టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గెలవలేదు. దీంతో ఆయనకు మంత్రిగా అవకాశం దక్కలేదు.
*మంచి సబ్జెక్టు, వాగ్ధాటితో కీలక నేతగా గుర్తింపు

News June 12, 2024

కొలుసు పార్థసారథి రాజకీయ ప్రస్థానం

image

* 2004, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం
* ఉమ్మడి APలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా, సెకండరీ ఎడ్యుకేషన్‌ మంత్రిగా విధులు
* 2014లో వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి
* 2019 వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు
* 2024లో టీడీపీ నుంచి పోటీ.. అసెంబ్లీకి నాలుగోసారి ఎన్నిక

News June 12, 2024

మంత్రిగా సత్యకుమార్ ప్రమాణం

image

ఏపీ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కూటమిలో బీజేపీ నుంచి మంత్రి పదవి పొందిన ఏకైక ఎమ్మెల్యే సత్య. ధర్మవరం నుంచి కేతిరెడ్డిపై గెలుపొందిన ఈయనకు ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలున్నాయి.

News June 12, 2024

జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు.. జవాన్ మృతి

image

జమ్మూకశ్మీర్‌లోని రియాసి ఘటన మరువక ముందే మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలోని సార్తాల్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోగా సైనిక బలగాల ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. మరోవైపు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. 72 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి.

News June 12, 2024

పవన్‌ను క్లిక్‌మనిపించిన అన్నా లెజినోవా

image

AP: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ మధుర క్షణాలను ఆయన భార్య అన్నా లెజినోవా తన సెల్‌ఫోన్‌లో బంధించారు. ఆమె ఓ వైపు ఫొటోలు తీస్తూనే.. మరోవైపు తన భర్త గెలుపును ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.