News March 29, 2024

తెలంగాణలో యువ జనాభా తగ్గుతోంది

image

TG: రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా(19-29 ఏళ్లు) భారీగా తగ్గనుందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్-2024 వెల్లడించింది. 2021లో తెలంగాణలో 26.4 శాతం ఉన్న యువత సంఖ్య.. 2036 నాటికి 20.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న యువత 77.7 శాతం ఉండగా, నిరుద్యోగ రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి చేరినట్లు పేర్కొంది.

News March 29, 2024

కేజ్రీవాల్‌పై మరో కొత్త ఆరోపణ

image

ఢిల్లీ CM కేజ్రీవాల్‌ తాజాగా మరో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అంబేడ్కర్ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్‌ బదిలీకి సంబంధించిన ఫైల్‌‌ను ఆయన 45 రోజులుగా నిలిపివేశారని గవర్నర్ సక్సేనా ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి సౌరభ్ తాజాగా ఎల్జీని కోరడంతో ఈ విషయం వెల్లడైంది. కాగా ఈ కేసులో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పోలీసులు, CSను గవర్నర్ ఆదేశించారు.

News March 29, 2024

CSK అభిమాని తల పగలగొట్టిన రోహిత్ శర్మ ఫ్యాన్స్

image

ముంబై ఫ్యాన్స్ దాడిలో చెన్నై అభిమాని తీవ్రంగా గాయపడిన ఘటన MHలోని కొల్హాపూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి SRHపై రోహిత్ శర్మ ఔట్ కావడంతో CSK అభిమాని బండోపంత్ టిబిలే(63).. ‘రోహిత్ ఔటైపోయాడు. ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది’ అంటూ హేళన చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ బల్వంత్, సాగర్ పట్టరాని కోపంతో టిబిలే తలపై కర్రతో కొట్టారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.

News March 29, 2024

డకౌట్ అయినా అలాగే ఉంటా: రియాన్ పరాగ్

image

ఢిల్లీతో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాజస్థాన్ ప్లేయర్ రియాన్ పరాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం తనకు అలవాటైపోయిందన్నారు. డకౌట్ అయినా అలాగే ఉంటానని చెప్పారు. గత నాలుగేళ్లుగా తన కష్టాలను అమ్మ ప్రత్యక్షంగా చూశారన్నారు. తొలి మ్యాచ్‌కు ముందు మూడు రోజులు బెడ్‌పైనే ఉన్నానని తెలిపారు. నిన్నటి మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డానని.. ఫలితం అందుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

News March 29, 2024

కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం: KTR

image

TG: వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంపై కేటీఆర్ స్పందించారు. ‘అసాధ్యం అనుకున్న తెలంగాణను సాధించిన ధీశాలి మన కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన KCRను, BRSను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారు చేస్తాం’ అని ట్వీట్ చేశారు.

News March 29, 2024

తనఖా భూముల పాస్‌బుక్‌ల విడుదలకు గ్రీన్ సిగ్నల్

image

TG: తనఖా భూముల పాస్‌బుక్‌లను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సబ్ రిజిస్ట్రార్లకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి కారణంగా తనఖా పాస్‌బుక్‌ల రిలీజ్ ప్రక్రియ కొన్నేళ్లుగా నిలిచిపోయింది. దీంతో అప్పులు చెల్లించినా రైతులకు పాస్‌బుక్‌లు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఉపశమనం కలగనుంది.

News March 29, 2024

ఐపీఎల్: ALL TIME RECORD

image

ఐపీఎల్‌లో కొత్త రికార్డు నమోదైంది. ఈ సీజన్లో తొలి రోజు చెన్నై, ఆర్సీబీ మ్యాచ్‌ను ‘స్టార్‌’లో ఏకంగా 16.8 కోట్ల మంది చూశారు. ఇప్పటివరకు ఏ సీజన్లో‌నైనా తొలి రోజు మ్యాచ్‌ను ఇంతమంది తిలకించడం ఇదే మొదటి సారి. ఈ మ్యాచ్‌ను ఏకకాలంలో 6.1 కోట్ల మంది చూశారు. రికార్డు స్థాయిలో 1,276 కోట్ల నిమిషాలు వీక్షించారు. జియో సినిమా డిజిటల్‌లో 11.3 కోట్ల మంది మ్యాచ్‌ను తిలకించారు.

News March 29, 2024

వాళ్లు నాకు అన్యాయం చేయరు: రఘురామ

image

AP: నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్‌పై పూర్తి విశ్వాసం ఉందని, వారు తనకు అన్యాయం చేయరని పేర్కొన్నారు. కచ్చితంగా తనకు నరసాపురం టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ను ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

News March 29, 2024

హనుమ విహారికి షోకాజ్ నోటీస్

image

భారత క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం షోకాజ్ నోటీస్ జారీ చేసింది. గత నెలలో ఏసీఏపై అతడు చేసిన ఆరోపణల గురించి తెలుసుకునేందుకు ఈ నోటీసు జారీ చేసినట్లు ఏసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా ఈ నెల 25న మెయిల్ ద్వారా వచ్చిన ఈ షోకాజ్ నోటీసుకు తాను బదులిచ్చానని హనుమ విహారి పేర్కొన్నారు. తన పట్ల అన్యాయంగా వ్యవహరించారని, రాబోయే దేశవాళీ సీజన్‌లో ఇతర రాష్ట్ర జట్టుకు ఆడేందుకు NOC అడిగినట్లు తెలిపారు.

News March 29, 2024

కర్నూలు జిల్లా సిద్ధమా?: సీఎం జగన్

image

AP: సీఎం వైఎస్ జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర నంద్యాల జిల్లాలో ముగించుకుని కర్నూలు జిల్లాకు చేరుకుంది. ఇవాళ మొత్తం ఈ జిల్లాలో బస్సు యాత్ర సాగనుండటంతో ‘కర్నూలు జిల్లా సిద్ధమా?’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. నేటి యాత్రలో భాగంగా సాయంత్రం ఎమ్మిగనూరు బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించనున్నారు.