India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఇటలీ వెళ్లనున్నారు. మూడోసారి పీఎం పదవి చేపట్టాక మోదీకిది తొలి విదేశీ పర్యటన కావడం విశేషం. ఈ సమావేశాలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, జపాన్ పీఎం ఫ్యూమియో కిషిడా, కెనడా పీఎం జస్టిన్ ట్రూడో తదితరులు హాజరుకానున్నారు. మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సులో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా సంఘర్షణలపై చర్చించనున్నారు.
AP: ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్‌లోని సీఎం ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ తర్వాత మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేస్తారు. దాదాపు 13వేల ఖాళీలున్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ల నగదు పెంపు, అన్న క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేస్తారు.
TG: జిల్లా స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు CM రేవంత్ త్వరలో జిల్లాల్లో పర్యటించనున్నారు. ఒక్కో జిల్లాలో ఒకటి లేదా రెండు రోజులపాటు పర్యటించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నేతలను సిద్ధం చేసేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. అలాగే సంక్షేమ పథకాల అమలు, అధికారుల పనితీరు గురించి తెలుసుకోవచ్చని యోచిస్తున్నట్లు సమాచారం.
లింగభేదాన్ని అరికట్టేందుకు కేరళ సర్కారు వినూత్న ప్రయోగం చేపట్టింది. కొత్త పాఠ్యపుస్తకాల్లో మహిళలతో పాటు పురుషులూ వంటలో పాల్గొనే చిత్రపటాలను రూపొందించింది. ‘పుస్తకంలోని ఫొటోలో ఓ తండ్రి కొబ్బరి తురుము చేయడం చూసి ఆశ్చర్యపోయానని, అది మా నాన్నకు చూపించి నువ్వు ఎందుకు చేయవని ప్రశ్నించా’ అని ఓ మూడో తరగతి విద్యార్థిని చెప్పింది. ఈ ప్రయత్నం వల్ల లింగభేదం తగ్గుతుందని అధికారులు తెలిపారు.
నిన్న USతో మ్యాచ్‌లో భారత్‌కు అదృష్టం కలిసొచ్చింది. 30 బంతుల్లో 35 రన్స్ చేయాల్సి ఉన్నప్పుడు స్టాప్ క్లాక్ <<13354118>>రూల్<<>> వల్ల 5 పరుగులు కరిగిపోయాయి. ICC కొత్త రూల్ ప్రకారం ఓవర్ ముగిశాక 60 సెకన్లలో మరో ఓవర్ మొదలుపెట్టాలి. ఇన్నింగ్సులో US జట్టు ఇలా చేయడంలో మూడు సార్లు విఫలమవడంతో అంపైర్లు 5 పరుగులు జరిమానా విధించారు. దీంతో భారత్ లక్ష్యం తగ్గిపోయింది. మొత్తంగా 111 పరుగుల టార్గెట్‌ను 18.2 ఓవర్లలో ఛేదించింది.
పాలసీదారులు కోరుకుంటే లైఫ్ ఇన్సూరెన్స్ సేవింగ్స్ పాలసీలపై తప్పనిసరిగా రుణం ఇవ్వాలని బీమా సంస్థలను IRDAI ఆదేశించింది. పాలసీ నచ్చకపోతే దానిని వాపసు ఇచ్చే గడువును 15 రోజుల నుంచి 30 రోజులకు పెంచింది. నామినీ వివరాలను ఎప్పుడైనా మార్చుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. పాలసీ రెన్యువల్ సమయంలో గడువులోపు ప్రీమియం చెల్లించకపోతే అదనంగా మరో 30రోజుల వ్యవధిని ఇవ్వాలని(నెలవారీ ప్రీమియంకు 15రోజులు) ఆదేశించింది.
జీ7 సదస్సు కోసం ఇవాళ ప్రధాని మోదీ ఇటలీ వెళ్లనుండటంతో ఖలిస్థానీ సానుభూతి పరులు రెచ్చిపోయారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని నిన్న ధ్వంసం చేశారు. కెనడాలో హత్యకు గురైన ఖలిస్థానీ టెర్రరిస్ట్ హర్దీప్‌సింగ్ నిజ్జర్‌కు అనుకూలంగా నినాదాలు రాశారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారు. ఈ దాష్టీకానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని భారత రాయబార కార్యాలయం కోరింది.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను డిప్యూటీ సీఎం చేస్తారని తెలుస్తోంది. అలాగే కీలకమైన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. పవన్ కోరిక మేరకే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారట. అలాగే నాదెండ్ల మనోహర్‌కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేశ్‌కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలను అప్పగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ CBN మంత్రులకు శాఖలు కేటాయించనున్నారు.
భారత తొలి మహిళా ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ బయోపిక్ త్వరలో తెరకెక్కనుంది. దీనికి ‘బేడీ: ది నేమ్ యు నో, ది స్టోరీ యు డోంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కుషాల్ చావ్లా దర్శకత్వం వహిస్తుండగా, గౌరవ్ చావ్లా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ‘ఇది భారత్‌లో పెరిగి, చదువుకొని దేశ ప్రజల కోసం పనిచేసిన ప్రతి స్త్రీ కథ’ అని బేడీ ఓ ప్రకటనలో తెలిపారు.
TG: ఊరూరా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. దీనికోసం మొబైల్ ల్యాబ్‌లను సిద్ధం చేయనుంది. 26-70 ఏళ్ల వయసున్న వారికి అన్ని రకాల రక్తపరీక్షలు, క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనుంది. ఆరోగ్య సమస్యలున్న వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. NHMలో భాగంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు సమకూర్చనున్నాయి.
Sorry, no posts matched your criteria.