India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మర్డర్ కేసులో అరెస్టైన కన్నడ హీరో దర్శన్ పోలీస్ స్టేషన్‌లో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నట్లు తెలుస్తోంది. ‘ఒక్క సిగరెట్ ఇవ్వండి’ అంటూ పోలీసులను ఆయన వేడుకున్నట్లు సమాచారం. కానీ పోలీసులు సిగరెట్ ఇవ్వలేదట. సెలబ్రిటీ కావడంతో కార్పెట్, దిండు ఇచ్చినా నిద్రపోలేదని, దొన్నె బిర్యానీ తెప్పించినా హీరో తినలేదని సమాచారం. ఓ అభిమాని హత్యకేసులో దర్శన్‌ను బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పీఎస్‌లో విచారిస్తున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ సీఎంగా వరుసగా మూడోసారి పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. చౌనా మీన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. ఈటానగర్‌లోని డీకే స్టేట్ కన్వెన్షన్ సెంటర్‌లో గవర్నర్ కేటీ పర్నాయక్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. కాగా రాష్ట్రంలోని మొత్తం 60 సీట్లలో 46 స్థానాలు బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ కలిసి ఉండాలని నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ ఆకాంక్షించారు. ‘పదవులు, హోదాలు, డబ్బులు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ బంధం అనేది విడదీయరానిది. నా చంద్రన్న, నా రేవంత్ అన్న రెండు రాష్ట్రాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఇలానే ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు.
TG: ముందుమాట మార్చకుండా పాఠ్య పుస్తకాలను ముద్రించడం వివాదాస్పదమవడంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 1-10వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేసిన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లను వెనక్కి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిని పేర్కొంటూ అప్పటి అధికారుల పేర్లతో పుస్తకాలను ముద్రించడంపై <<13430349>>విమర్శలొచ్చిన<<>> సంగతి తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ మూవీ నుంచి ఓ పోస్టర్ విడుదలైంది. హీరోయిన్ దిశా పటానీ బర్త్ డే సందర్భంగా ఆమె పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె ‘రాక్సీ’ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ నెల 27న మూవీ విడుదల కానుంది.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. గండోహ్ ప్రాంతంలో సెర్చ్ టీమ్‌పై కాల్పులకు తెగబడ్డారు. జవాన్లు ఇందుకు దీటుగా బదులిచ్చారు. ఈ ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతోందని, ముష్కరుల కోసం మరిన్ని బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న నలుగురి ఉగ్రవాదుల ఊహాచిత్రాలను పోలీసులు రిలీజ్ చేశారు. కాగా జమ్మూకశ్మీర్‌లో గత మూడు రోజుల్లో ఇది నాలుగో ఉగ్రదాడి కావడం గమనార్హం.
NEET UG-2024 ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది. గ్రేస్ మార్కులు కావాలనుకుంటే జూన్ 23న మరోసారి ఎగ్జామ్ రాయొచ్చని, 30లోపు ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది. NEET కౌన్సెలింగ్ యథావిధిగా కొనసాగించొచ్చని సుప్రీంకోర్టు కేంద్రానికి తెలిపింది. దానిపై స్టే విధించబోమని స్పష్టం చేసింది.
టీ20 వరల్డ్ కప్‌లో యూఎస్ఏపై విజయంతో టీమ్ ఇండియా సూపర్-8కు దూసుకెళ్లింది. కాగా సూపర్-8లో ఆసీస్-భారత్ జూన్ 24న తలపడనున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సూపర్-8 చేరుకుంది. ఈ నెల 20న గ్రూప్ Cలోని అఫ్గానిస్థాన్ లేదా వెస్టిండీస్, 22న గ్రూప్ Dలోని బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ జట్లతో టీమ్ ఇండియా మ్యాచ్‌లు ఆడే ఛాన్స్ ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
AP: తనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని సీఎం చంద్రబాబు అన్నారు. ‘గత ప్రభుత్వంలో తిరుమలలో అవినీతి జరిగింది. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తాను. మంచి వాళ్లను రక్షిస్తూ చెడ్డవారిని శిక్షించాలని దేవుడే చెప్పారు. నేటి నుంచి రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. ఏపీ నంబర్ 1గా ఉండాలి. తెలంగాణ బాగుండాలి. నేను అందరివాడిని’ అని వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల విడుదల తేదీలను TTD ప్రకటించింది.
1.రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు- జూన్ 24
2.ఆర్జిత సేవా టికెట్స్ ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు- జూన్ 18
3.కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లు- జూన్ 21
4.తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు- జూన్ 22
5.తిరుమలలో వసతి కోటా- జూన్ 24న
>>టికెట్లన్నీ ఉ.10 గం.కు విడుదలవుతాయి.
Sorry, no posts matched your criteria.