News June 13, 2024

అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలి: కొలికపూడి

image

AP: అమరావతి రైతులకు వైసీపీ అధినేత జగన్ క్షమాపణలు చెప్పాల్సిందేనని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ నెల 17 నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పాల్గొనే ముందే ఆయన క్షమాపణ కోరాలని అన్నారు. బయటివాళ్లు వదిలినా అసెంబ్లీలో తాను వదలనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ఈయన అమరావతి రైతుల ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు.

News June 13, 2024

మోదీ కేబినెట్‌లో 99శాతంమంది కోటీశ్వరులు

image

మోదీ సర్కారులోని కొత్త కేబినెట్‌లో 99శాతం మంది కోటీశ్వరులేనని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 71మందిలో 70మంది కోటీశ్వరులేనని పేర్కొంది. 39శాతంమందిపై క్రిమినల్ కేసులున్నాయని తెలిపింది. 80శాతంమంది గ్రాడ్యుయేషన్ లేదా ఆపై డిగ్రీ కలిగి ఉండగా, 15శాతంమంది 12వ తరగతి వరకే చదువుకున్నారు. మంత్రుల ఆస్తుల సగటు రూ.107.94 కోట్లుగా ఉంది. ఆరుగురు మంత్రుల ఆస్తులు రూ.100 కోట్లకు పైమాటేనని నివేదిక తెలిపింది.

News June 13, 2024

మెగా డీఎస్సీ: ఎందులో ఎన్ని పోస్టులంటే?

image

AP: సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. ఈ డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ – 7,725, ఎస్జీటీ – 6,371, టీజీటీ – 1,781, పీజీటీ – 286, ప్రిన్సిపల్స్ – 52, పీఈటీ – 132 పోస్టులు ఉన్నాయి.
> SHARE

News June 13, 2024

రాష్ట్రంలో డీఎస్సీ పోస్టులు ఎన్నంటే?

image

AP: రాష్ట్రంలో మెగా డీఎస్సీ ద్వారా 16,347 టీచర్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఈమేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

News June 13, 2024

మాజీ సీఎం భార్య.. అరుణాచల్‌ప్రదేశ్‌‌లో తొలి మహిళా మంత్రి

image

అరుణాచల్‌ప్రదేశ్‌లో పెమా ఖండూ సీఎంగా BJP ప్రభుత్వం కొలువుదీరింది. వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన పెమా.. తన కేబినెట్‌లో ఓ మహిళకు స్థానం కల్పించారు. ఆమె హాయులియాంగ్‌ అసెంబ్లీ స్థానంలో గెలిచిన దసాంగ్లు పుల్. దీంతో ఆ రాష్ట్ర చరిత్రలో మంత్రి పదవి పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. ఈమె దివంగత మాజీ CM కలిఖో పుల్ సతీమణి. 2016 నుంచి హాయులియాంగ్‌‌లో గెలుస్తూ వస్తున్నారు.

News June 13, 2024

మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన CM చంద్రబాబు

image

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన, సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

News June 13, 2024

అసలేంటి ఈ పెట్రో డాలర్?

image

చమురు ఎగుమతి చేసే దేశాలకు చెల్లించే US కరెన్సీని <<13432944>>పెట్రో<<>> డాలర్ అని అంటారు. 1972లో బంగారం స్థానంలో US ఈ పెట్రో డాలర్ తీసుకొచ్చింది. ఆర్థిక, సైనిక సహకారం కోసం సౌదీ 1974 జూన్ 8న USతో ఈ డీల్‌ను కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రపంచ వాణిజ్యంపై US డాలర్ ఆధిపత్యం చెలాయించడంలో కీలక పాత్ర పోషించింది. డాలర్ డిమాండ్‌తో ఆర్థిక స్థిరత్వం, లిక్విడిటీ వంటి అంశాల్లో US లబ్ధిపొందిందని విశ్లేషకులు చెబుతున్నారు.

News June 13, 2024

కూటమి విజయానికి పవన్ కళ్యాణే కారణం: YCP ఎమ్మెల్సీ

image

AP: రాష్ట్రంలో NDA కూటమి అధికారంలోకి రావడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కారణమని YCP MLC తోట త్రిమూర్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయనను అంచనా వేయలేకపోవడంతోనే తాము ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు. కూటమి గెలుపులో క్రెడిట్ పవన్ కళ్యాణ్‌కే చెందుతుందని అన్నారు. అందరూ కలిశారు కాబట్టే ప్రజలు కూటమిని నమ్మారని, అందులో తప్పుబట్టాల్సిందేమీ లేదని పేర్కొన్నారు.

News June 13, 2024

అతడి ఫామ్ గురించి ఆందోళన అనవసరం: గవాస్కర్

image

విరాట్ కాస్త ఓపిగ్గా ఆడితే మంచి ప్రదర్శన చేస్తాడని, అతడి ఫామ్ గురించి ఆందోళన అవసరం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నారు. దేశం కోసం ఆడేటప్పుడు మ్యాచ్‌లు గెలవడమే ఏ ఆటగాడికైనా స్ఫూర్తి అని చెప్పారు. భారత్‌కు ఎన్నో విజయాలు అందించిన కోహ్లీకి అది తెలుసని భావిస్తున్నానన్నారు. అసలు సమరం సూపర్-8, సెమీస్, ఫైనల్ రూపంలో ముందుందని చెప్పారు.

News June 13, 2024

‘కశ్మీర్‌’పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష

image

జమ్మూకశ్మీర్‌లో గత 4రోజులుగా నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ తాజాగా ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించారు. అక్కడి భద్రతా ఏర్పాట్ల గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఉగ్ర ముప్పును తుద ముట్టించేలా పూర్తిస్థాయిలో బలగాల్ని మోహరించాలని PM వారికి తేల్చిచెప్పినట్లు సమాచారం. రియాసీ జిల్లాలో హిందూ భక్తులపై ఈ నెల 9న ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.