India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పనపై కూలంకషంగా చర్చలు జరుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాలపై లోతుగా సభలో విశ్లేషణలు చేస్తామన్నారు. అటు జనసేన పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదనపు అడ్వకేట్ జనరల్ పదవిని తమ పార్టీనే తీసుకునే ఛాన్స్ ఉందన్నారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్‌గా ప్రదీప్ సింగ్ ఖరోలాను కేంద్రం నియమించింది. ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఛైర్మన్, ఎండీగా ఉన్న ఖరోలాకు ఎన్టీఏ డీజీగా అదనపు బాధ్యతలను అప్పగించింది. కాగా నీట్, నెట్ పరీక్షా పేపర్ల లీకేజీ వ్యవహారం దుమారం రేపడంతో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌పై కేంద్రం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో నేడు జరగాల్సిన నీట్-PG పరీక్షను సైతం రద్దు చేశారు.
AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాపట్ల(D) ఈపురుపాలెం హత్యాచారం కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై CM సీరియస్ కావడం, <<13485589>>హోం మంత్రి<<>> ప్రత్యేక దృష్టి సారించడంతో కేసును సవాలుగా స్వీకరించి 48 గంటల్లోనే ఛేదించినట్లు SP వకుల్ తెలిపారు. నిందితులు దేవరకొండ విజయ్, మహేశ్‌తో పాటు శ్రీకాంత్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. మద్యం మత్తులో యువతిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశారన్నారు.
TG: ట్రాన్స్‌కో ఉద్యోగులకు 3 శాతం డీఏను పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7శాతం డీఏ ఇస్తుండగా, ఈ నెల నుంచి 11.7శాతం అమలు కానుంది. ట్రాన్స్‌కో నుంచి పెన్షన్ తీసుకునే వారికీ 3శాతం పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలను 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూన్ నెల డీఏను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు.
AP: రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న YCP కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటు రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీసుని కూల్చేసిన సంగతి తెలిసిందే.
టీ20 వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తన బౌలింగ్‌తో ప్రత్యర్థులకు చెమటలు పట్టిస్తున్నారు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇప్పటివరకు ఆయన టోర్నీలో 19 ఓవర్లు వేసి 65 పరుగులే ఇచ్చారు. మొత్తం 10 వికెట్లు పడగొట్టారు. ఎకానమీ రేటు 3.42, యావరేజ్ 6.50గా ఉంది. ఈ ఎడిషన్‌లో బుమ్రా 114 బంతులు వేసి ఒకే ఒక సిక్సర్ ఇవ్వడం విశేషం.
AP: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిడదవోలు-కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-లింగంపల్లి జన్మభూమి, విజయవాడ-విశాఖ రత్నాచల్, గుంటూరు-విశాఖ ఉదయ్, విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్, గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఇరువైపులా రద్దు చేశారు.
టీ20 WCలో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య అదరగొడుతున్నారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో చెలరేగుతున్నారు. బంగ్లాతో మ్యాచ్‌లో హార్దిక్ (50) ఫిఫ్టీతోపాటు ఒక వికెట్ కూడా తీసి POTMగా నిలిచారు. అలాగే ఈ మెగా టోర్నీలో మొత్తం 5 మ్యాచుల్లో 89 పరుగులతోపాటు ఏకంగా 8 వికెట్లు పడగొట్టారు. కాగా ఐపీఎల్ 17 సీజన్‌లో హార్దిక్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ఆయన ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయారు.
టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ చరిత్ర సృష్టించారు. వరల్డ్ కప్ ఒక ఎడిషన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా పంత్ రికార్డు నెలకొల్పారు. ఈ ఎడిషన్‌లో ఆయన 10 క్యాచ్‌లు అందుకున్నారు. ఈ క్రమంలో గిల్‌క్రిస్ట్ (7) రికార్డును పంత్ బ్రేక్ చేశారు. కాగా ఈ మెగా టోర్నీలో పంత్ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతున్నారు.
షారుక్ ఖాన్ సినిమాలో సమంత నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీని రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. యాక్షన్-అడ్వెంచర్-పాట్రియాటిక్ అంశాలు మిళితమైన కథతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షారుక్-హిరానీ కలిసి చేసిన ‘డంకీ’ గతేడాది విడుదలై మంచి వసూళ్లు సాధించింది. కాగా సమంత ‘ఖుషి’ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.