India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1300 మంది మరణించినట్లు తెలుస్తోంది. వీరిలో 130 మందికిపైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేక వీరంతా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా ఈజిప్టుకు చెందినవారే కావడం గమనార్హం. కాగా ఈసారి యాత్రలో 18లక్షల మంది పాల్గొన్నట్లు అంచనా. సౌదీ అరేబియాలో రికార్డు స్థాయిలో 51డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
TG: ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు(కొత్త వారికి) మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారట. కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
AP: మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన ‘దిశ’ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం Women Safety Appగా మార్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2020 ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించగా, ఇప్పటివరకు 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్‌లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారం అందిస్తాయి.
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా సౌతాఫ్రికాతో సూపర్8 మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 135/8కే పరిమితమైంది. రోస్టన్ చేజ్(52) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేశారు. ఓపెనర్ కైల్ మేయర్స్(34బంతుల్లో 35 రన్స్) ఫరవాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీసి విండీస్ నడ్డి విరిచారు. జాన్‌సెన్, మార్క్‌రమ్, మహారాజ్, రబాడ ఒక్కో వికెట్ తీశారు.
2014 నుంచి లోక్‌సభలో ప్రతిపక్షనేత లేరు. ఎందుకంటే ఆ హోదా పొందాలంటే ఏదైనా ఒక పార్టీ కనీసం 55 మంది ఎంపీలను కలిగి ఉండాలి. గత రెండు పర్యాయాల్లో బీజేపీ మినహా ఏ పార్టీ ఆ మార్క్ చేరుకోలేదు. ప్రతిపక్ష కాంగ్రెస్ 2014లో 44, 2019లో 52 ఎంపీ సీట్లు గెలిచింది. అందుకే అధికారికంగా ప్రతిపక్ష నేతను నియమించలేకపోయింది. ఈసారి 99 ఎంపీ సీట్లు గెలిచి పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేతను నియమించేందుకు సిద్ధమైంది.
నేడు ప్రారంభమయ్యే 18వ లోక్‌సభ సమావేశాల్లో సగానికిపైగా కొత్త ఎంపీలు పాల్గొనబోతున్నారు. మొత్తం సభ్యుల్లో దాదాపు 52% అంటే 280 మంది కొత్తవారు ఎంపీలుగా సభలో అడుగుపెట్టనున్నారు. మిగిలిన వారిలో 216 మంది ఎంపీలు గత సభలో ఉన్నవారు కాగా మరికొందరు అంతకుముందు సభ్యులుగా ఎన్నికైనవారు. మొత్తం 41 పార్టీల నుంచి ఎంపీలున్నారు. సంఖ్యాపరంగా బీజేపీ(240), కాంగ్రెస్(99), సమాజ్ వాదీ పార్టీ(37) టాప్-3లో ఉన్నాయి.
AP: రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం తేలికపాటి, మంగళ, బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇవాళ మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
AP: సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రేపు, ఎల్లుండి పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు తాజాగా విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు కుప్పం చేరుకోనున్న సీఎం, అక్కడ అన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తారు. రాత్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బస చేస్తారు. ఎల్లుండి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తారు. ఆ రోజు సాయంత్రం తిరిగి అమరావతి చేరుకుంటారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన BRS ఎమ్మెల్సీ కవిత 100 రోజులుగా తిహార్ జైల్లో ఉంటున్నారు. మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. కవితకు బెయిల్ కోసం ఆమె తరఫు లాయర్లు అనేక ప్రయత్నాలు చేసినా.. ఈడీ ఎప్పటికప్పుడు కోర్టుకు అన్ని ఆధారాలు సమర్పిస్తోంది. పలుమార్లు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
నేడు 18వ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే 544 మంది ఎంపీలతో కొలువుదీరిన ఈ సభ చివరిదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి అందుకు అనుగుణంగా లోక్‌సభ సీట్ల సంఖ్య పెంచే ఛాన్స్ ఉంది. సో, అప్పుడు కొత్త సంఖ్యతో సభ జరగాల్సి ఉంటుంది.
Sorry, no posts matched your criteria.