India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
అన్ని కంపెనీల ఫోన్లకు ఒకే టైప్ ఛార్జర్ ఉండాలనే నిబంధనను కేంద్రం తీసుకురానుంది. టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్ మాత్రమే ఉండేలా కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తేనుంది. దీనికి 2025 జూన్ వరకు గడువు విధించింది. ఇకపై కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను సీ టైప్ ఛార్జింగ్ పోర్టు ఉండేలా తయారు చేయాలంది. ఇప్పటికే యురోపియన్ యూనియన్‌లో ఈ రూల్ అమలవుతోంది. 2026 చివరి నుంచి ల్యాప్‌టాప్‌లకూ ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు సమాచారం.
AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం వెలగపూడి సచివాలయంలో ప్రారంభమైంది. అమరావతి, పోలవరం నిర్మాణంతో పాటు సూపర్ సిక్స్ హామీలు, ఐదు సంతకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ సెన్సస్‌కు ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది.
AP: తిరుమల శ్రీవారి దర్శన టికెట్లు విడుదలయ్యాయి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లు టీటీడీ ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబర్ నెల వసతి గదుల కోటాను విడుదల చేయనుంది. దీని ద్వారా తిరుపతి, తిరుమలలో గదులు బుక్ చేసుకోవచ్చు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. శ్రీవారిని నిన్న 81,455మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 31,251మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. రూ3.67కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.
T20WCలో భాగంగా వెస్టిండీస్VSసౌతాఫ్రికా సూపర్8 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించారు. DLS ప్రకారం సౌతాఫ్రికా టార్గెట్ 123 రన్స్‌గా మారింది. విండీస్ బౌలర్లలో ఇద్దరు 4 ఓవర్లు, ముగ్గురు 3 ఓవర్ల చొప్పున వేసుకోవచ్చు. కాగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 135/8 చేయగా ఛేదనలో సౌతాఫ్రికా 2 ఓవర్లు ముగిసేసరికి 15/2 చేసింది.
AP: పులివెందులలో తనను కలిసిన వైసీపీ శ్రేణులకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. మళ్లీ మంచిరోజులొస్తాయని వారితో అన్నారు. ‘నేను మళ్లీ ప్రజల్లోకి వస్తా. అందరికీ అండగా ఉంటా. రాబోయే రోజులు మనవే’ అని భరోసా ఇచ్చారు. కాగా.. పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ నుంచి కాంట్రాక్టర్లకు రూ.100 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ ఉంటే తనకెందుకు చెప్పలేదంటూ సన్నిహితులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
TG: కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్‌లో చేరనున్నట్లు వార్తలు వస్తున్న వేళ కీలక పరిణామం జరిగింది. నిన్న KCRతో గంగుల, 29 మంది కార్పొరేటర్లు భేటీ అయ్యారు. కరీంనగర్ జిల్లాలో బలమైన నేతగా ఉన్న కమలాకర్ BRSను వీడితే పార్టీకి నష్టమని భావించి కేసీఆరే.. ఆయన్ను ఫామ్‌హౌస్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. భవిష్యత్ అంతా BRSదేనని, ఎవరూ పార్టీ మారొద్దని గులాబీ దళపతి సూచించినట్లు తెలుస్తోంది.
TG: అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే ప్రజల శక్తి ఎప్పుడూ బలంగానే ఉంటుందని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ <<13498328>>ఎమ్మెల్యేలు<<>> కాంగ్రెస్‌లో చేరడంపై X వేదికగా స్పందించారు. ‘2004-06లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేకసార్లు ఎమ్మెల్యేల ఫిరాయింపులను ఎదుర్కొన్నాం. ఆ తర్వాత తెలంగాణ ప్రజలు దీటుగా స్పందించారు. చివరికి కాంగ్రెస్ తల వంచాల్సి వచ్చింది. మరోసారి చరిత్ర పునరావృతమవుతుంది’ అని పేర్కొన్నారు.
AP: చంద్రన్న బీమా పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రకటించారు. త్వరలో పాత్రికేయులు, న్యాయవాదుల్ని కూడా ఈ బీమా కిందకు తీసుకొస్తామన్నారు. YCP ప్రభుత్వం పథకం పేరు మార్చడమే కాక ఎంతోమందికి పరిహారాన్ని ఆపిందని విమర్శించారు. కార్మికులు కార్మికశాఖలో రూ.15 కట్టి ఈ పథకంలో చేరొచ్చు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల పరిహారం అందుతుంది.
TG: వ్యక్తిగత మరుగుదొడ్లపై సర్వే చేయించాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో 100% మరుగుదొడ్లు ఉన్నాయా లేదా నిర్ధారించనుంది. లేని వారికి మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్తమ పంచాయతీలకు పురస్కారాల కోసం ప్రభుత్వం ఏటా మరుగుదొడ్లపై సమాచారం సేకరిస్తోంది. దీనిలో 100% ఉన్నట్లు గణాంకాలు నమోదవుతున్నాయి. మరోవైపు ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్‌పై సర్వే జరుగుతోంది.
Sorry, no posts matched your criteria.