India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పునరావాసం కోసం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదని CM పినరయి విజయన్ తెలిపారు. ఈ ప్రాంతంలో PM మోదీ తన పర్యటన సందర్భంగా నిధుల కొరత ఉండదని చెప్పారన్నారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి కేంద్ర కేటాయింపులతో పాటు అత్యవసర సహాయం ₹219 కోట్లు కోరినట్టు తెలిపారు. మరోసారి ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.
AP: వైసీపీ కార్యకర్తలంతా కలిసి కట్టుగా ఉండాలని మాజీ మంత్రి పేర్ని నాని పిలుపునిచ్చారు. వైసీపీ కార్యకర్తలు తిరగబడితే కూటమి నేతలు కొట్టుకుపోతారని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారికి సూచించారు. చంద్రబాబులా జగన్‌కు మద్దతు అవసరం లేదని, ఆయన ఒంటరిగా వస్తారని చెప్పారు.
కంటెంట్ క్రియేటర్స్‌కి యూట్యూబ్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు 60 సెకన్లు మాత్రమే ఉంటున్న షార్ట్స్ నిడివిని ఈ నెల 15 నుంచి 3 నిమిషాలకు పెంచనున్నట్లు ప్రకటించింది. కంటెంట్‌ని మరింత విస్తృతంగా చెప్పేందుకు ఎక్కువ నిడివి కావాలంటూ చాలాకాలంగా తమకు విజ్ఞప్తులు వస్తున్నాయని ఈ సందర్భంగా వివరించింది. దీంతో పాటు మరిన్ని అదనపు ఫీచర్లు కూడా తీసుకొస్తున్నామని పేర్కొంది.
AP: చంద్రబాబు పాలనలో ఫెయిలవడంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు లడ్డూ వివాదం సృష్టించారని జగన్ ఆరోపించారు. ‘JULY 23న లడ్డూ తయారీకి సంబంధించిన రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ అని చెప్పి సెప్టెంబర్ 18న తన 100 రోజుల పాలన మీద మాట్లాడుతూ ఈ రిపోర్ట్ గురించి చెప్పారు’ అని జగన్ అన్నారు. నెయ్యిలో కలిసింది జంతు కొవ్వు కాదని, అయినా దాన్ని తిరస్కరించామని TTD EO అంటుంటే బాబు అబద్ధాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
ఐపీఎల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు ఎప్పుడూ వదులుకోలేదు. వీరిలో మహేంద్ర సింగ్ ధోనీ-సీఎస్కే, విరాట్ కోహ్లీ-ఆర్సీబీ, సచిన్ టెండూల్కర్-ముంబై ఇండియన్స్, సునీల్ నరైన్-కేకేఆర్, రిషభ్ పంత్-డీసీ ఉన్నారు. వీరిలో ధోనీ మినహా అందరూ ఒకే జట్టుకు ఆడారు. IPL-2025 సీజన్‌కు కూడా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న జట్లకే ఆడతారని అంచనా. వీరి రిటెన్షన్లపై ఆయా ఫ్రాంచైజీలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు టాక్.
AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. దీనిపై త్వరలోనే అఖిలపక్షంతో కలిసి సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. ‘ప్రధాని మోదీ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి పవన్‌కు లేదు. లడ్డూ వ్యవహారంపై స్పెషల్ సిట్‌ను ఆహ్వానిస్తున్నాం. నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.
గోళ్లు చూసి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయొచ్చని న్యూట్రీషనిస్ట్ సిమ్రున్ చోప్రా చెబుతున్నారు. ‘సన్నగా, మెత్తగా ఉండే గోళ్లు విటమిన్ బి, కాల్షియం, ఐరన్ లోపానికి సూచన కావొచ్చు. స్పూన్‌లా మధ్యలో గుంట పడినట్లుగా ఉండే గోళ్లు రక్తహీనత, లివర్ సమస్యలను, తెల్ల మచ్చలుండే గోళ్లు జింక్ లోపాన్ని సూచిస్తుండొచ్చు. అధిక ధూమపానానికి, థైరాయిడ్, శ్వాసకోశ సమస్యలకు పసుపు రంగు గోళ్లు సూచన కావొచ్చు’ అని వివరించారు.
ఇజ్రాయెల్‌పై ఇస్లామిక్ రిపబ్లిక్ దేశాల దాడులు చట్టబద్ధమైనవని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ పేర్కొన్నారు. ఐదేళ్ల తరువాత ఆయన బహిరంగ ఉపన్యాసం ఇచ్చారు. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి కూడా చట్టబద్ధమైనదిగా ఆయన అభివర్ణించారు. అఫ్గానిస్థాన్ నుంచి యెమెన్ వరకు, ఇరాన్ నుంచి గాజా, లెబనాన్ వరకు దురాక్రమణులను తిప్పికొట్టేందుకు ముస్లిం దేశాలు భద్రతను పటిష్ఠం చేసుకోవాలన్నారు.
AP: తిరుమల లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తిచూపిందని వైసీపీ చీఫ్ నేత జగన్ అన్నారు. ‘ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మతవిశ్వాసాలను రాజకీయ దుర్బుద్ధితో రెచ్చగొడుతున్నారని సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. అందుకే దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దని గట్టిగా స్పందించింది’ అని మీడియా సమావేశంలో జగన్ వ్యాఖ్యానించారు.
జమ్మూకశ్మీర్‌లోని కొంత భాగాన్ని పాకిస్థాన్ భూభాగంగా తప్పుగా చిత్రీకరించిన భారత మ్యాప్‌ను ఇజ్రాయెల్ తొలగించింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఇజ్రాయెల్ తన అధికార వెబ్సైట్ నుంచి దాన్ని తొలగించింది. దీనిపై భారత్‌లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ మాట్లాడుతూ ‘ఇది వెబ్సైట్ ఎడిటర్ పొరపాటు. దీన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు. మ్యాప్‌ను తొలగించాం’ అని తెలిపారు.
Sorry, no posts matched your criteria.