News March 26, 2024

రేఖా పాత్రతో మాట్లాడిన ప్రధాని మోదీ

image

‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘మీరు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు. సందేశ్‌ఖాలీలో మీరెంతో గొప్ప పోరాటం చేశారు. ఎంతో మంది శక్తిమంతులను జైలుకు పంపించారు’ అని ప్రధాని కొనియాడారు. ఆమెను ‘శక్తి స్వరూపిణి’గా మోదీ అభివర్ణించారు. కాగా.. బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రేఖా పోటీ చేయనున్నారు.

News March 26, 2024

60 రోజుల్లో మెగా డీఎస్సీ: చంద్రబాబు

image

AP: తాము అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో మెగా DSC నిర్వహిస్తామని TDP అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కుప్పంలో యువతతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన.. ‘రాష్ట్రంలో పెట్టుబడులు లేవు. ఉద్యోగాలు లేవు. యువత ఇతర రాష్ట్రాలు, దేశాలకు వలస వెళ్తున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్, DSC ఇస్తానన్న జగన్ ఏం చేశారు? మేం కియాకు 650 ఎకరాలు ఇచ్చి వేల ఉద్యోగాలు తెచ్చాం. 12 లక్షల కార్లు రోడ్లపై తిరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.

News March 26, 2024

కంగనా వ్యవహారంపై ECకి ఫిర్యాదు చేయనున్న BJP

image

సినీ నటి, BJP MP అభ్యర్థి కంగనా రనౌత్‌ వ్యవహారం ECకి చేరనుంది. ఆమెపై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియ చేసిన ‘వేశ్య’ వ్యాఖ్యలపై బీజేపీ ECకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు కంగనా BJP అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈ రోజు రాత్రి కలవనున్నారు. ఆమె ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో సీనియర్ నటి ఊర్మిళను ‘పోర్న్ స్టార్’ అన్న కంగనా ఇప్పుడెందుకు రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ అంటోంది.

News March 26, 2024

పాక్ హెడ్ కోచ్‌గా రాంకీ?

image

పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ ఆటగాడు ల్యూక్ రాంకీ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. PCB ఇప్పటికే అతడితో సంప్రదింపులు జరిపింది. కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు రాంకీ కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్. కాగా 42 ఏళ్ల రాంకీకి పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన PSLలో ఇస్లామాబాద్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 2018 సీజన్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచారు. ఆ సీజన్ ఫైనల్లోనూ POTM అవార్డు అందుకున్నారు.

News March 26, 2024

మీ పిల్లలను ఓ కంట కనిపెట్టండి: సజ్జనార్

image

TG: స్నాప్ చాట్‌లో పరిచయం చేసుకుని 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడో దుర్మార్గుడు. HYD అమీర్‌పేటలో జరిగిన ఈ ఘటనపై RTC MD సజ్జనార్ స్పందించారు. ‘తల్లిదండ్రులు బిజీ లైఫ్‌ను కాస్త పక్కన పెట్టి పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలి. వారి కదలికలను ఓ కంట కనిపెట్టాలి. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారా? అనేది తెలుసుకోవాలి. పిల్లలు ముభావంగా ఉంటే వారితో మాట్లాడి ధైర్యం కల్పించాలి’ అని ట్వీట్ చేశారు.

News March 26, 2024

12న హ్యాపీ డేస్ రీరిలీజ్

image

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘హ్యాపీ డేస్’ 2007లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ సినిమాను APR 12న రీరిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, తమన్నా, నిఖిల్, రాహుల్ కీలక పాత్రల్లో నటించారు. బీటెక్ లైఫ్, విద్యార్థుల మధ్య స్నేహం, ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ మూవీ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మిక్కీజే మేయర్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్.

News March 26, 2024

మహిళలు పొగ మానలేకపోతున్నారు.. కారణమిదే!

image

మోడ్రన్ కల్చర్‌లో పురుషులతో సమానంగా మహిళలు పొగ తాగుతున్నారు. అయితే మానేయడానికి మాత్రం మగాళ్లతో పోలిస్తే స్త్రీలకు కష్టంగా ఉంటోందని కెంటకీ యూనివర్సిటీ(US) అధ్యయనంలో తేలింది. నికోటిన్‌కు అడిక్ట్ కావడానికి మహిళల్లోని సెక్స్ హార్మోన్ ఈస్ట్రోజన్ కీలక పాత్ర పోషిస్తుందట. ఏదైనా కావాలనుకునే ఆశను వ్యక్తీకరించే మెదడులోని ఒల్ఫాక్టోమెడిన్ ప్రోటీన్ కూడా వ్యసనానికి కారణమని వెల్లడైంది.

News March 26, 2024

FACTCHECK: ఈ మెయిల్స్ ఫేక్

image

ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరోకు సంబంధించిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ రీసెర్చ్ ఆనాలిసిస్ వింగ్ నోటీసులు పంపినట్లు వస్తోన్న మెయిల్స్‌పై PIB FACTCHECK స్పందించింది. ఈ మెయిల్‌ను IB పంపలేదని, వీటిని నమ్మొద్దని ఫ్యాక్ట్‌చెక్ వెల్లడించింది. ‘మీరు ఐపీ అడ్రెస్‌ నిబంధనలు అతిక్రమించింది. వారం రోజుల్లో ఆఫీస్‌‌కు వచ్చి హాజరుకావాలి’ అని ఆ మెయిల్‌లో ఉంది. ఆఫీస్‌కు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News March 26, 2024

వాలంటీర్ల జీవితాలు మారుస్తా: చంద్రబాబు

image

AP: రాష్ట్రంలోని వాలంటీర్ల జీవితాలు మారుస్తానని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ‘మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు నెలకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు సంపాదించుకునేలా చేస్తా. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా వారి భవిష్యత్‌ను తీర్చిదిద్దుతా. ఐటీని అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పిస్తా. 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతా. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టే బాధ్యత నాది’ అని ఆయన పేర్కొన్నారు.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్‌లో ఓ ఎమ్మెల్సీ కీలక పాత్ర?

image

TG: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఓ ఎమ్మెల్సీ పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో అధునాతన పరికరాలు కొని వాటిని హైదరాబాద్‌కు రప్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. తన పలుకుబడిని ఉపయోగించి సైబర్ నిపుణుడు రవిపాల్‌తో కలిసి ఈ పరికరాలు తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. త్వరలో ఆ ఎమ్మెల్సీకి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశముంది.