India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇండియాలో మరో 4 రిటైల్ స్టోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలోనే యాపిల్‌కు చెందిన రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది బెంగళూరు, పుణే, ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబైలో మరో నాలుగు స్టోర్స్ ఓపెన్ చేయనున్నట్లు పేర్కొంది. ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లో తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. మేడ్-ఇన్-ఇండియా iPhone 16 Pro, Pro Maxల సరఫరా ఈనెల నుంచి ప్రారంభంకానుంది.
తండ్రీకూతుళ్ల మధ్య ఉండే ప్రత్యేక బంధం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. కూతురి సంతోషం కోసం తండ్రి ఎంతైనా కష్టపడుతుంటాడు. అలాంటి ఓ తండ్రి తన కూతురి పెళ్లి కోసం ఏకంగా 50kms నడిచారు. హెలెన్ హరికేన్ USలో విధ్వంసం సృష్టించింది. వరదలు ముంచెత్తి రాకపోకలు నిలిచిపోయాయి. అలాంటి ప్రమాదకర పరిస్థితుల్లోనూ తండ్రి జోన్స్ సౌత్ కరోలినా నుంచి కూతురు ఎలిజబెత్ పెళ్లి జరిగే జాన్సన్ సిటీకి 12 గంటల్లో చేరుకున్నారు.
TG: హైడ్రా కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ KA పాల్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. కూల్చివేతలను ఇప్పటికిప్పుడు నిలిపివేయలేమంది. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం, హైడ్రాకు నోటీసులు ఇచ్చింది. పిటిషన్‌లో G.O.99పై స్టే విధించాలని, కూల్చివేతలకు 30రోజుల ముందే నోటీసులు ఇవ్వాలని, హైడ్రాకు చట్టబద్ధత కల్పించాకే కూల్చివేతలు చేపట్టాలని పాల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 14న జరగనుంది.
AP: తిరుపతి లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామని TTD మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నామని చెప్పారు. సిట్ దర్యాప్తుతో నిర్దోషులను దోషులుగా చూపించే అవకాశం ఉందనే అనుమానాలతో దానిని వ్యతిరేకించామన్నారు. తాను ఛైర్మన్‌గా ఉన్నప్పుడు AR కంపెనీ నెయ్యి సప్లై చేయలేదని వైవీ స్పష్టం చేశారు.
బెంచ్‌మార్క్ సూచీలు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి. అప్పటికప్పుడు పెరుగుతూ తగ్గుతూ వణుకు పుట్టిస్తున్నాయి. ఉదయం స్వల్ప నష్టాల్లో ట్రేడైన సూచీలు మధ్యాహ్నం భారీగా పుంజుకున్నాయి. 12.30PM తర్వాత మళ్లీ తగ్గాయి. 160 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ ప్రస్తుతం 26 పాయింట్ల నష్టంలో ఉంది. 800 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ -160కి వెళ్లింది. ఇంట్రాడే గరిష్ఠాల నమోదుకు ఇన్ఫీ, యాక్సిస్ బ్యాంకు షేర్లు తోడ్పడ్డాయి.
AP: రాష్ట్రంలో టమాటా ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. బయటి రాష్ట్రాల్లో పంట దిగుబడి తగ్గడంతో మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు పెరిగాయి. ఇవాళ ఉదయం ఒకటో రకం టమాటా 10 కిలోల కనిష్ఠ ధర రూ.820, గరిష్ఠ ధర రూ.880, మోడల్ కాయల ధర రూ.860 పలికింది. ఇక్కడ నిన్న కిలో ధర గరిష్ఠంగా రూ.90 పలికింది. ఇటు బహిరంగ మార్కెట్‌లో ఏ గ్రేడ్ టమాటా రూ.90-100, కాస్త తక్కువ రకం రూ.60-70 వరకు పలుకుతోంది. మీ ఏరియాలో ధరలెలా ఉన్నాయి?
తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘కల్తీ జరిగిందో లేదో దర్యాప్తు చేసేందుకు సుప్రీం కోర్టు సీబీఐ, ఏపీ పోలీసులు, FSSAI అధికారులతో కూడిన సిట్‌ను ఏర్పాటు చేసింది. సత్యమేవ జయతే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు స్వతంత్ర సిట్‌ను ఏర్పాటుచేసిన అంశంపై మాట్లాడే అవకాశం ఉంది. కాగా ధర్మాసనం తీర్పుపై ఆయన YCP ముఖ్య నేతలతో సమావేశమై చర్చిస్తున్నారు.
AP: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంపై <<14268817>>సుప్రీంకోర్టు<<>> ఆగ్రహం వ్యక్తం చేసిందని టీడీపీ Xలో వెల్లడించింది. ఇది సీరియస్ వ్యవహారమని చెప్పిందని పేర్కొంది. రాష్ట్ర అధికారులతోపాటు సీబీఐ, FSSAI సభ్యులతో సిట్ కొనసాగింపునకు ఓకే చెప్పిందని తెలిపింది. దీంతో జగన్& కో పాపం పండిందని రాసుకొచ్చింది. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కొవ్వు నేతలు విచారణకు సిద్ధంగా ఉండాలంది.
మంత్రి కొండా సురేఖపై టాలీవుడ్ హీరో నాగార్జున వేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. సురేఖ తమ కుటుంబ పరువుకు భంగం కలిగించారంటూ నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈరోజు విచారణ జరగాల్సి ఉండగా న్యాయమూర్తి సెలవులో ఉన్న నేపథ్యంలో వాయిదా పడింది. ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు వెలువరిస్తుందనే ఆసక్తి నెలకొంది.
Sorry, no posts matched your criteria.