News June 24, 2024

ఎల్లుండి పాఠశాలల బంద్‌‌కు ABVP పిలుపు

image

TG: రాష్ట్రవ్యాప్తంగా జూన్ 26న పాఠశాలల బంద్‌కు ABVP పిలుపునిచ్చింది. స్కూల్స్ ప్రారంభమై 15 రోజులైనా పుస్తకాలు పంపిణీ చేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందని మండిపడింది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేసింది. స్కూల్స్ స్వచ్ఛందంగా మూసివేసి సహకరించాలని ABVP కోరింది.

News June 24, 2024

‘Groww’ ట్రేడింగ్ యాప్‌పై ఫ్రాడ్ ఆరోపణలు!

image

ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ యాప్ ‘గ్రో’ మోసాలకు పాల్పడుతోందని ఓ యూజర్ సంచలన ఆరోపణలు చేశారు. తన డబ్బును గ్రో యాప్ మ్యూచువల్ ఫండ్‌లో మదుపు చేయలేదని, ఓ నకిలీ పోర్ట్‌ఫోలియో నంబర్ ఇచ్చిందన్నారు. పొరపాటుగా ఇలా జరిగిందని, కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కాలేదని సంస్థ తెలిపింది. కానీ సంస్థపై నమ్మకం కోల్పోకుండా ఆ మొత్తాన్ని క్రెడిట్ చేస్తున్నామన్న గ్రో, కస్టమర్ తన బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరింది.

News June 24, 2024

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు BRS!

image

TG: తమ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న MLAలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని BRS నిర్ణయించింది. ఈనెల 27న MLA దానం నాగేందర్ అనర్హత అంశంపై హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలను బట్టి పార్టీ మారిన ఎమ్మెల్యేలందరిపై ఒకేసారి SCకి వెళ్లాలని BRS భావిస్తోంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం MLAల అనర్హత‌ పిటిషన్‌పై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆ పార్టీ చెబుతోంది.

News June 24, 2024

బీఆర్ఎస్ ఖతం అయ్యింది: షబ్బీర్ అలీ

image

TG: పార్టీ ఫిరాయింపులపై BRS నేతలు మాట్లాడుతుంటే నవ్వు వస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో కాంగ్రెస్ MLAలు, MLCలను BRSలో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. ‘భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసింది KCR కాదా? శాసనమండలిలో నా ప్రతిపక్ష హోదా తొలగించలేదా?’ అని ఫైరయ్యారు. BRS పార్టీ ఖతం అయ్యిందని, కోకాపేటలో ఆ పార్టీకి ఇచ్చిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు.

News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలదే పైచేయి

image

TG: ఇంటర్ సప్లిమెంటరీ/ఇంప్రూవ్‌మెంట్ పరీక్ష ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించారు. 2,54,498 మంది ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాయగా 63.86% ఉత్తీర్ణత నమోదైంది. 70.26% బాలికలు, 58.39% బాలురు పాసయ్యారు. 1,38,477 మంది సెకండ్ ఇయర్ పరీక్షలు రాయగా 43.77% ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 47.54%, బాలురు 41.37% మంది పాస్ అయ్యారు. ఫలితాలకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 040 24655027కు కాల్ చేయవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది.

News June 24, 2024

బేగంపేట ఎయిర్‌పోర్టుకు బాంబ్ బెదిరింపు మెయిల్

image

TG: బేగంపేట ఎయిర్‌పోర్టులో బాంబు ఉందంటూ ఓ ఆగంతకుడు మెయిల్ చేశాడు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాంబ్ స్క్వాడ్‌తో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల దేశంలోని పలు ఎయిర్‌పోర్టులు, విమానాలు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు బాంబ్ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే.

News June 24, 2024

7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం

image

ఏపీ కేబినెట్ భేటీ 4 గంటలపాటు కొనసాగింది. CM చంద్రబాబు చేసిన 5 సంతకాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మెగా DSC, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్న క్యాంటీన్లు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్, YSR హెల్త్ వర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మార్పునకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 7 శాఖలపై శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ భేటీ అనంతరం రాజకీయ అంశాలపై మంత్రులకు CM CBN దిశానిర్దేశం చేశారు.

News June 24, 2024

మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని, వారికి వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు ప్రభుత్వం సహకారం ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించే పారిశ్రామిక విధానంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు.

News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మరికాసేపట్లో WAY2NEWS యాప్‌ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని ఒక్క క్లిక్‌తో ఈజీగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు.
* SHARE IT

News June 24, 2024

తీవ్రత ముగుస్తోంది కానీ యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్

image

గాజాలో తీవ్ర స్థాయి పోరాటం ముగింపు దశకు వస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఆ భూభాగంపై హమాస్ పట్టు కోల్పోయేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లెబనాన్‌తో ఉన్న ఉత్తర సరిహద్దు వెంబడి మున్ముందు మరిన్ని బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. హమాస్ బందీలుగా ఉన్న తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.