News March 26, 2024

వీగన్స్.. ఎముకలు జాగ్రత్త

image

మాంసాహారంతో పాటు పాల పదార్థాలూ తినకుండా ఉండే వారిని వీగన్స్ అంటారు. అయితే ఇలాంటి వారిలో బాడీమాస్ ఇండెక్స్ తగ్గుతోందని.. దీంతో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువని శాస్త్రవేత్తలు తెలిపారు. కాల్షియం స్థాయులు తగ్గడమే ఇందుకు కారణమంటున్నారు. మాంసాహారులతో పోలిస్తే వీరికి చిన్న దెబ్బలు తగిలినా తుంటి, కాలి ఎముక విరిగే ఛాన్స్ ఎక్కువట. సో.. వీగన్స్ శరీరంలో జరిగే మార్పుల్ని పరిశీలించుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు.

News March 26, 2024

ఆమె కోసమే పరీక్ష వదిలేశాడు..

image

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అందరికీ సుపరిచితమే. ఆయనది ప్రేమ వివాహమే. ఇండోర్‌లో ఓ ఫిల్మ్ షూట్ సమయంలో అనురాధతో ప్రేమలో పడ్డారట. ఆమెతోనే ఉండాలనుకొని సెమిస్టర్ పరీక్ష రాయకుండా ఉండిపోయారు. ఆ తర్వాత ప్రేమలో మునిగిపోయి హీరో లెవల్లో అనురాధకు ప్రపోజ్ చేశారట. వీరిద్దరి వివాహం 1985 జూన్ 17న పెద్దల సమక్షంలో వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత వీరు చదువుకోవడానికి బోస్టన్ యూనివర్సిటీకి వెళ్లారు.

News March 26, 2024

బిలియనీర్ల అడ్డా ముంబై.. ఆసియాలో నంబర్-1

image

దేశ వాణిజ్య రాజధాని ముంబై బిలియనీర్లకు అడ్డాగా మారింది. ఈ ఏడాది కొత్తగా 26 మంది బిలియనీర్లు చేరడంతో వారి సంఖ్య 92కు పెరిగినట్లు హురున్ గ్లోబల్ రిచ్ నివేదిక వెల్లడించింది. దీంతో బీజింగ్(91)ను వెనక్కి నెట్టి ఆసియాలోనే నంబర్-1, ప్రపంచంలో మూడో స్థానానికి ముంబై చేరింది. న్యూయార్క్‌లో అత్యధికంగా 119 మంది, లండన్‌లో 97 మంది బిలియనీర్లు ఉన్నారు. ముంబైలోని బిలియనీర్ల ఆస్తుల విలువ $445 బిలియన్లు.

News March 26, 2024

నిరాహార దీక్ష చేస్తున్నా పట్టించుకోరా?

image

లద్దాక్‌లో ప్రముఖ ఇంజినీర్, సంస్కరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న నిరాహార దీక్ష 21వ రోజుకు చేరింది. వాంగ్‌చుక్ ఆధ్వర్యంలో హక్కుల కోసం స్థానికులు పోరాడుతున్నా కేంద్రం స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రకటించినట్టు నేడు ఆయన దీక్ష విరమించే అవకాశం ఉంది. వాంగ్‌చుక్ స్థానంలో స్థానికులు విడతల వారీగా దీక్ష చేపట్టనున్నారు. ఆయన కోలుకున్నాక మళ్లీ నిరాహార దీక్ష చేపట్టే అవకాశం ఉంది.

News March 26, 2024

అర్చకులపై వైసీపీ దాడి దుర్మార్గం: లోకేశ్

image

AP: రాష్ట్రంలో వైసీపీ మూకల అరాచకానికి హద్దు లేకుండా పోతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ Xలో విమర్శించారు. పూజ సరిగా చేయలేదంటూ కాకినాడలోని ఓ గుడిలో పూజారులపై వైసీపీ నేత దాడి చేశారని ఆరోపించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు.

News March 26, 2024

కస్టడీ నుంచే కేజ్రీవాల్ పాలన.. మరోసారి ఆదేశాలు!

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ CM కేజ్రీవాల్ ED కస్టడీలో ఉన్నారు. తాజాగా అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులు ఇచ్చినట్లు ఆప్ వర్గాలు తెలిపాయి. మొహల్లా క్లినిక్‌లలో టెస్టుల సంఖ్యను పెంచాలని ఆదేశించినట్లు చెప్పాయి. అంతకుముందు నీటి సమస్య నివారణకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కేజ్రీవాల్ ఆదేశాలు బయటకు ఎలా వెళ్తున్నాయని తెలుసుకునేందుకు ఈడీ చర్యలు చేపట్టింది.

News March 26, 2024

పెండింగ్ స్థానాల్లో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే

image

టీడీపీ పెండింగ్‌లో ఉంచిన స్థానాల్లో IVRS సర్వేలు చేపడుతోంది. విజయనగరం MP సీటు కోసం ముగ్గురి పేర్లు తెరపైకి తెచ్చారు. విజయనగరం అసెంబ్లీ సీటు ఆశించి భంగపడ్డ మీసాల గీత, ఎచ్చెర్ల సీటు ఆశిస్తున్న అప్పలనాయుడుతో పాటు కంది చంద్రశేఖర్ పేరుతో సర్వే చేస్తున్నారు. ఇటు కడప MP సీటు కోసం శ్రీనివాసులు రెడ్డి, భూపేశ్ రెడ్డి, వీరశివారెడ్డి పేర్లు పరిశీలిస్తున్నారు. ఒంగోలు, అనంతపురం ఎంపీ సీట్లూ పెండింగ్‌లో ఉన్నాయి.

News March 26, 2024

రజనీ-లోకేశ్ సినిమా ఎప్పుడంటే?

image

డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో మూవీ తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ జూన్‌లో ప్రారంభిస్తామని లోకేశ్ ఓ కార్యక్రమంలో తెలిపారు. ప్రస్తుతం ప్రీ పొడక్షన్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రజనీ సినిమా తర్వాత ‘ఖైదీ-2’ సినిమాను మొదలు పెడతానని పేర్కొన్నారు.

News March 26, 2024

వెల్లుల్లి, మిరియాల సారంతో గుండె జబ్బులకు ఔషధం

image

గుండె జబ్బుల నుంచి రక్షణ కోసం మూలికలతో HYD కంపెనీ లీ హెల్త్ డొమైన్ ‘లైఫోస్టెరాల్ సాఫ్ట్ జెల్’ అనే క్యాప్సూల్‌ను తయారుచేసింది. వెల్లుల్లి సారం, పసుపు నుంచి తీసిన కుర్కుమిన్, ఫైటోస్టెరాల్, లైకోపిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన ఫైపెరిన్ తదితరాలతో దీన్ని రూపొందించింది. ఈ క్యాప్సూల్ కొలెస్టరాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను సమతుల్యం చేసి ఫ్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తుందని కంపెనీ తెలిపింది.

News March 26, 2024

ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్యాపింగ్‌తో అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నట్లు విచారణలో తేలింది. వ్యాపారులు, హవాలా ముఠాల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి.. విలాసవంతమైన విల్లాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. డబ్బులు వసూలు చేసిన పోలీసుల లిస్ట్‌ను ఏసీబీ సిద్ధం చేసినట్లు సమాచారం. త్వరలో వీరిని విచారించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.