News June 24, 2024

మహిళలకు వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రాభివృద్ధిలో మహిళా పారిశ్రామికవేత్తల పాత్ర ఎంతో కీలకమని, వారికి వ్యాపారాల్లో తోడ్పాటునందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మహిళలకు ప్రభుత్వం సహకారం ఇస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం రూపొందించే పారిశ్రామిక విధానంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిస్తామన్నారు.

News June 24, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

image

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. మరికాసేపట్లో WAY2NEWS యాప్‌ ఓపెన్ చేయగానే కనిపించే ప్రత్యేక స్క్రీన్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. దీన్ని ఒక్క క్లిక్‌తో ఈజీగా ఇతరులకు షేర్ చేసుకోవచ్చు. మిగతా ప్లాట్‌ఫాంల తరహాలో విసిగించే యాడ్స్, లోడింగ్ సమస్యలు మన యాప్‌లో ఉండవు.
* SHARE IT

News June 24, 2024

తీవ్రత ముగుస్తోంది కానీ యుద్ధం ఆగదు: ఇజ్రాయెల్

image

గాజాలో తీవ్ర స్థాయి పోరాటం ముగింపు దశకు వస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. అయితే ఆ భూభాగంపై హమాస్ పట్టు కోల్పోయేవరకు యుద్ధం కొనసాగుతుందని తేల్చిచెప్పారు. లెబనాన్‌తో ఉన్న ఉత్తర సరిహద్దు వెంబడి మున్ముందు మరిన్ని బలగాలను మోహరిస్తామని పేర్కొన్నారు. హమాస్ బందీలుగా ఉన్న తమ పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి తీరతామని ఆయన స్పష్టం చేశారు.

News June 24, 2024

నిన్న కవితకు విషెస్.. కాసేపటికే BRSకు MLA గుడ్‌బై

image

TG: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ నిన్న BRSను వీడి కాంగ్రెస్‌లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఈక్రమంలో BRS శ్రేణులు ఆయనపై విమర్శలకు దిగాయి. ఆయన గెలుపుకోసం MLC కవిత ఎంతో శ్రమించారని గుర్తుచేస్తున్నారు. నిన్న కవిత వివాహ వార్షికోత్సవం కావడంతో ‘మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ బావకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని సంజయ్ చేసిన ట్వీట్ వైరలవుతోంది.

News June 24, 2024

ఫ్రంట్ రన్నింగ్, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తేడా ఏంటి?

image

నిపుణులు చెప్పే సూచనలు, ట్రేడ్ లావాదేవీల గురించి ముందుగా తెలుసుకుని క్లయింట్లకు ఆ విషయం చేరేలోపే ఫండ్ మేనేజర్/డీలర్లు క్రయవిక్రయాలు చేస్తుంటారు. దీనిని ఫ్రంట్ రన్నింగ్ అంటారు. మరోవైపు సంస్థకు చెందిన అంతర్గత వ్యవహారాలు.. అంటే డీల్స్, మేనేజ్మెంట్ నిర్ణయాలు ముందస్తుగా తెలుసుకుని ట్రేడ్ చేయడాన్ని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటారు. వీటి వల్ల స్టాక్ ధరలు తారుమారై సంస్థలు, ఇన్వెస్టర్లు నష్టపోతుంటారు.

News June 24, 2024

గన్నవరం చేరుకున్న నిర్మాతలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో మరి కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. వీరిలో అల్లు అరవింద్, సురేశ్ బాబు, అశ్వినీదత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ తదితరులున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్‌తో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.

News June 24, 2024

సతీసమేతంగా బెంగళూరుకు వైఎస్ జగన్

image

AP: పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. గడచిన 3 రోజులుగా అక్కడే ఉన్న ఆయన, ప్రజాదర్బార్‌ను నిర్వహించిన సంగతి తెలిసిందే. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, పార్టీ శ్రేణులతోనూ సమావేశమై వారికి ధైర్యం చెప్పారు. ఇక ఈరోజు మధ్యాహ్నంతో పులివెందుల పర్యటన ముగించుకున్న జగన్, సతీసమేతంగా అక్కడి నుంచి బెంగళూరుకు బయలుదేరారు.

News June 24, 2024

కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

image

లిక్కర్ కేసులో CM కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీం కోర్టు జూన్ 26కు వాయిదా వేసింది. ED వేసిన స్టే పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తుది ఉత్తర్వుల కోసం వేచి చూడాలని సూచించింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ED హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆ బెయిల్‌పై తాత్కాలిక స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ SCకి వెళ్లారు.

News June 24, 2024

హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవి: అదానీ

image

గత ఏడాది సంచలనం రేపిన హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ పునరుద్ఘాటించారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు జరిగిన కుట్ర అని 32వ వార్షిక జనరల్ మీటింగ్‌లో షేర్ హోల్డర్లతో పేర్కొన్నారు. ‘అదానీ గ్రూప్ ఆర్థిక వృద్ధిపై అసత్య ఆరోపణలు చేయడమే కాక దీనికి రాజకీయ రంగు పులమాలని ప్రయత్నించారు. FPO క్లోజింగ్‌కు రెండు రోజుల ముందే ఈ దాడి జరిగింది’ అని తెలిపారు.

News June 24, 2024

చంద్రబాబు సంతకాలకు కేబినెట్ ఆమోదం

image

AP: సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1.మెగా డీఎస్సీ ద్వారా 16,347 పోస్టుల భర్తీ
2.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
3.పెన్షన్ రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంపు
4.అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ
5.నైపుణ్య గణన (స్కిల్ సెన్సస్)
>> విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ కేబినెట్ ఆమోదం తెలిపింది.