News November 5, 2024

‘పదకొండు’ సభకు జగన్ వస్తారా?: టీడీపీ శ్రేణులు

image

AP: ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండటంతో టీడీపీ శ్రేణులు వైసీపీ, జగన్‌ను ట్రోల్స్ చేస్తున్నాయి. ‘11వ నెల 11వ తేదిన మొదలై 11 రోజులపాటు జరిగే సమావేశాలకు 11 మంది శాసనసభ్యులు ఉన్న వైసీపీ హాజరవుతుందా? ఆ సభ్యుల్లో ఒకరైన జగన్ వస్తారా?’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలా? వద్దా అనేదానిపై వైసీపీ ఇంకా నిర్ణయించలేదు.

News November 5, 2024

ఈ రెండు జెండాల్లో మాత్రమే ‘పర్పుల్’.. ఎందుకంటే?

image

దేశాల చరిత్ర, ఐడియాలజీని జాతీయ జెండాలు ప్రతిబింబిస్తాయి. రెడ్, బ్లూ, వైట్, గ్రీన్, ఎల్లో తదితర రంగులు జెండాల్లో కామన్‌గా ఉంటాయి. పర్పుల్ కలర్ మాత్రం 2 దేశాల(డొమెనికా, నికరాగ్వా) జెండాల్లోనే ఉంటుంది. పూర్వం ఇది అత్యంత ఖరీదైన రంగు. 1 గ్రాము ఊదా చేయడానికి 10K నత్తలను చంపాల్సి వచ్చేది. అందుకే ఈ రంగును ఎంచుకునేవారు కాదు. 1856లో విలియమ్(UK) ఈ రంగు ఫార్ములా కనిపెట్టడంతో అందరికీ అందుబాటులోకి వచ్చింది.

News November 5, 2024

ఈ రికార్డు కోహ్లీకి తప్ప ఇంకెవ్వరికీ లేదు

image

ప్రపంచ క్రికెట్లో మరెవ్వరికీ లేని అరుదైన రికార్డు విరాట్ కోహ్లీకి మాత్రమే సొంతం. కెరీర్లో 168 సిరీసుల్లో 538 మ్యాచులు ఆడిన అతడు 21సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (POTS)గా ఎంపికయ్యారు. టెస్టుల్లో 3, వన్డేల్లో 11, టీ20ల్లో 7 సార్లు ఈ అవార్డు గెలుచుకున్నారు. సచిన్ 183 సిరీసుల్లో 20 POTSతో రెండో ప్లేస్‌లో ఉన్నారు. ప్రపంచ క్రికెట్లో మారిన డైనమిక్స్‌తో ఈ కోహ్లీ రికార్డును ఇంకెవరైనా బద్దలు కొట్టగలరా?

News November 5, 2024

కేటీఆర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు?

image

TG: ‘ఫార్ములా ఈ కార్’ రేసింగ్ అంశం BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే రూ.55 కోట్లను KTR ఓ విదేశీ సంస్థకు బదిలీ చేయించారని ED అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఈ విషయాన్ని పురపాలకశాఖ మాజీ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ కూడా ఈడీతో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే మంత్రి పొంగులేటి దీపావళి బాంబ్ అని టాక్.

News November 5, 2024

దారుణం.. బాలిక తొడ కొరికిన టీచర్

image

AP: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్ వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. మూడో తరగతి బాలిక తొడపై కొరికి ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ దారుణ ఘటన కృష్ణా(D) నరసింహపురంలో జరిగింది. చిన్నారి ఏడుస్తూ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు వేణుగోపాలరావును అరెస్టు చేసినట్లు సమాచారం.

News November 5, 2024

లక్నోలో ‘గేమ్ ఛేంజర్’ టీజర్ లాంచ్ ఈవెంట్

image

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ టీజర్‌ను మేకర్స్ మరో 4 రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఈనెల 9న లక్నోలో టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న థియేటర్లలో విడుదల కానుంది.

News November 5, 2024

రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే(కులగణన) చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేస్తారని సమాచారం. ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని సర్కార్ భావిస్తోంది. సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వేసేలా ఏర్పాట్లు చేసింది.

News November 5, 2024

HBD KOHLI: సచిన్, గంగూలీ కలిస్తే..

image

మైదానంలో పరుగుల వరదను పారించిన గ్రేటెస్ట్ క్రికెటర్ సచిన్. భారత క్రికెట్‌కు దూకుడైన కెప్టెన్సీ నేర్పించిన నాయకుడు గంగూలీ. ఒకరిది కామ్ అండ్ కంపోజ్డ్ ఆటతీరు. మరొకరిదేమో అగ్రెషన్, ప్రత్యర్థికి వెరవని ధీరత్వం. వీరిద్దరినీ పుణికిపుచ్చుకున్న ఆటగాడు విరాట్ కోహ్లీ. బ్యాటుతో సునామీ సృష్టించిన అతడు కెప్టెన్‌గా అంతకుమించే రాణించారు. SENA కంట్రీస్‌లో ప్రత్యర్థి మాటలకు నోటితో, బౌన్సర్లకు బ్యాటుతో జవాబిచ్చారు.

News November 5, 2024

OTTలోకి ‘దేవర’ సినిమా.. ఎప్పుడంటే?

image

Jr.NTR హీరోగా నటించిన ‘దేవర’ పార్ట్-1 ఈనెల 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ తాజాగా ప్రకటించింది. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో జాన్వీకపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్ తదితరులు నటించారు. సెప్టెంబర్ 27న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ రూ.500కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

News November 5, 2024

ఇవాళ కూరగాయలు తరగకూడదా?

image

కార్తీకమాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చతుర్థ తిథినే నాగులచవితిగా జరుపుకుంటాం. చవితిరోజున చిన్న చిన్న ప్రాణులకు కూడా హానీ తలపెట్టరు. భూమి దున్నడం, మట్టి తవ్వడం, చెట్టు, పుట్టలను కొట్టడం వంటి పనులకు దూరంగా ఉంటారు. కత్తులు, సూదులు, కత్తెర వంటివి వాడరు. కూరగాయలు తరిగి వంట చేయరు. మట్టి పాత్రల్లోనే వంట చేసుకుంటారు. దుంపలు వంటివి ఉడికించుకుని తింటారు. ఈ ఆచారాన్ని భక్తులు అనాదిగా నమ్ముతున్నారు.