News March 25, 2024

నానీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ చిట్‌చాట్

image

హీరో నానీని కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గెరాత్ వైన్. కెమెరా ముందు, వెనక తన కెరీర్ గురించి ఆయన పలు విషయాలు పంచుకున్నట్లు చెప్పారు. టాలీవుడ్‌తో బ్రిటన్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి సూచనలు చేసినట్లు వెల్లడించారు. తన సినిమాలు చూడాలంటూ కొన్నింటిని సజెస్ట్ చేశాడన్నారు. నానీతో దిగిన ఫొటోలను Xలో షేర్ చేసిన గెరాత్ ‘మీరైతే ఏ సినిమా(నానీవి)లు రికమెండ్ చేస్తారు?’ అని అడిగారు.

News March 25, 2024

అందుకే కథలు రాయడం మొదలుపెట్టా: సిద్ధూ

image

హీరో సిద్ధూ జొన్నలగడ్డ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ప్రారంభంలో మంచి కథలు వచ్చేవి కావని చెప్పారు. తన పాత్రలో ఎలా ఉండాలో నిర్ణయించుకొని కథలు రాయడం మొదలు పెట్టానని తెలిపారు. కొత్త ప్రపంచాన్ని సృష్టించేలా స్టోరీస్ రాయడం బాగుందన్నారు. డీజే టిల్లు సీక్వెల్‌కు డైరెక్టర్ విమల్ కృష్ణ అందుబాటులో లేకపోవడంతో మల్లిక్‌తో తెరకెక్కించామని చెప్పారు. ఈ నెల 29న ‘టిల్లు స్క్వేర్’ మూవీ విడుదల కానుంది.

News March 25, 2024

మోదీ అని నినదించే యువత చెంప పగలగొట్టాలి: కర్ణాటక మంత్రి

image

కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ.. మోదీ అని నినదించే యువత చెంప పగలగొట్టాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. మంచి దుస్తులు ధరించి, సముద్రపు లోతుల్లోకి వెళ్లి స్టంట్స్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనకు మద్దతిచ్చే యువత సిగ్గుపడాలని ఘాటుగా వ్యాఖ్యానించారు.

News March 25, 2024

ఏదైనా ఉంటే జడ్జికి చెప్పండి.. EDపై ఆతిశీ ఫైర్

image

ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం కేజ్రీవాల్ ఫోన్లు కనిపించడం లేదని ED పేర్కొనడంపై AAP మంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ ఏమైనా చెప్పాలనుకుంటే జడ్జి ముందు చెప్పాలన్నారు. ఈడీ అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని ఆమె గుర్తు చేశారు. రాజ్యాంగం ఈడీకి ప్రత్యేక అధికారాలు కల్పించిందని, వాటిని తుంగలో తొక్కి రాజ్యాంగాన్ని అవమానించవద్దని ఆమె అన్నారు.

News March 25, 2024

తొలిసారి ఎన్నికలకు దూరంగా KCR ఫ్యామిలీ

image

TG: మాజీ CM KCR కుటుంబం మొదటిసారి ఎన్నికలకు దూరంగా ఉంటోంది. 2001లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి KCR ఫ్యామిలీ ఎన్నికలకు దూరంగా ఉండటం ఇదే తొలిసారి. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో KCR, KTR, హరీశ్‌రావు, కవితల్లో ఎవరో ఒకరు పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా జాబితాలో వారి పేర్లు ప్రకటించలేదు. కాగా ఆవిర్భావం నుంచి ప్రతి అసెంబ్లీ/పార్లమెంట్ ఎన్నికల్లో KCR ఫ్యామిలీలో ఎవరో ఒకరు కచ్చితంగా పోటీ చేస్తూ వచ్చారు.

News March 25, 2024

ఎయిర్‌టెల్, జియో యూజర్లకు షాక్?

image

సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎయిర్‌టెల్, జియో తమ ఆదాయం పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నాయి. ధరలు పెంచి యూజర్ నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ప్యాకేజీ ధరలు పెంచకుండా డేటా వినియోగం మరింత పెంచి తద్వారా అధిక ధరలు గల ప్యాకేజీల వైపు కస్టమర్లను మళ్లించేలా జియో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఎయిర్‌టెల్ 15శాతం వరకు టారిఫ్‌లను పెంచే ఛాన్సుంది.

News March 25, 2024

నా అకౌంట్లు ఎవరో హ్యాక్ చేశారు: సుప్రియా

image

బాలీవుడ్ నటి, బీజేపీ నేత కంగన రనౌత్‌పై కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనతే చేసిన వివాదాస్పద <<12924073>>పోస్ట్<<>> వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పోస్ట్‌పై సుప్రియా స్పందించారు. ఎవరో తన FB, ఇన్‌స్టా అకౌంట్లు హ్యాక్ చేసి, తప్పుడు పోస్టులు పెట్టారని ట్వీట్ చేశారు. తాను మహిళల పట్ల ఎలా వ్యవహరిస్తానో సన్నిహితులకు తెలుసని పేర్కొన్నారు. తన పేరుతో ట్విటర్‌లో ఉన్న పేరడి అకౌంట్‌పై రిపోర్ట్ చేసినట్లు తెలిపారు.

News March 25, 2024

ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్

image

ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే సిరీస్‌లో మార్పు చోటు చేసుకోనుంది. ఐదు టెస్టుల సిరీస్‌గా దీనిని నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఎక్కువగా 4 టెస్టుల సిరీస్‌ను నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నారు.

News March 25, 2024

రామ్ చరణ్ బర్త్ డే.. CDP ఇదే

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘కామన్ డీపీ’ని విడుదల చేసింది. ‘ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని విడుదల చేశాం. తన అభిరుచి, నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు’ అని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఆయన ఫ్యాన్స్ అంతా తమ సోషల్ మీడియా డీపీలో ఈ పోస్టర్‌ను ఉంచనున్నారు.

News March 25, 2024

హైదరాబాద్‌లో మరో 5 IPL మ్యాచులు

image

ఐపీఎల్ 2024 ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే రెండు మ్యాచులు HYDలో ఖరారు కాగా, రెండో షెడ్యూల్‌లో మరో ఐదు మ్యాచులు జరగనున్నాయి. ఏప్రిల్ 25న ఆర్సీబీ, మే 2న రాజస్థాన్‌, 8న LSG, 16న గుజరాత్‌, 19న పంజాబ్‌తో SRH తలపడనుంది. తొలి షెడ్యూల్‌లో ఉప్పల్ వేదికగా ఈ నెల 27న ముంబై, ఏప్రిల్ 5న సీఎస్కేతో SRH తలపడనున్న సంగతి తెలిసిందే. వైజాగ్ వేదికగా మార్చి 31, ఏప్రిల్ 3న రెండు మ్యాచులు జరగనున్నాయి.