India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించారు. 9వ ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదారు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 32 రన్స్ వచ్చాయి. బట్లర్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్లతో 83 రన్స్‌తో USA బౌలర్లను ఊచకోత కోశారు. ఇక 116 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ చేరింది.
పాకిస్థాన్‌కు చెందిన వజహత్ కజ్మీ అనే జర్నలిస్టు భారత్‌పై నోరు పారేసుకున్నారు. అన్ని జట్లపై గెలిచే అఫ్గానిస్థాన్ భారత్‌పై మాత్రం ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమే ఓడిపోతోందని ట్వీట్ చేశారు. దానిపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా స్పందించారు. ‘ఏం చేయాలో(బ్లాక్ చేయాలని) మీకు నేను చెప్పలేను కానీ నా టైమ్‌లైన్‌లో నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా’ అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు.
AP: విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను రేపటి నుంచి ఈ ఏడాది ఆగస్టు 11 వరకు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్లలో ఆధునికీకరణ పనులు చేపట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా విశాఖ-గుంటూరు, విశాఖ-తిరుపతి, విశాఖ-విజయవాడ, రాజమండ్రి-విశాఖ మధ్య నడిచే రైళ్లు వీటిలో ఉన్నాయి.
AP: రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలకు అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. తాజాగా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా నిన్న ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. విశాఖ పార్టీ ఆఫీస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.
నీట్ రీఎగ్జామ్‌కు గ్రేస్ మార్కులు కలిపిన వారిలో సగం మంది డుమ్మా కొట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో NTA 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఆదేశాలతో గ్రేస్ మార్కులు రద్దు చేసిన NTA ఇవాళ వారికి మళ్లీ పరీక్ష నిర్వహించింది. 1,563 మందిలో 813 మంది హాజరుకాగా 750 మంది గైర్హాజరయ్యారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.
AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. నాలుగోబ్లాక్‌లో ఉన్న ఆయన ఛాంబర్‌లో కొన్ని మార్పుల పెండింగ్ కారణంగా పదవీ స్వీకారం ఆలస్యం అయినట్లు సమాచారం. తాజాగా అవి పూర్తి కావడంతో బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఆయన ఇప్పటి వరకు విధుల్ని నిర్వహిస్తున్నారు.
T20 WCలో మరో సంచలనం నమోదైంది. అమెరికాతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్ హ్యాట్రిక్ సహా ఒకే ఓవర్‌లో మొత్తం 4వికెట్లు పడగొట్టారు. 19వ ఓవర్ వేసిన అతడు తొలి బంతికి కోరీ అండర్సన్‌ను వెనక్కి పంపారు. తర్వాత 3,4,5 బంతుల్లో వరుసగా అలీ ఖాన్, నొతుష్, నేత్రావల్కర్‌ను ఔట్ చేశారు. ఇవాళ ఉదయమే అఫ్గాన్‌పై కమిన్స్ హ్యాట్రిక్ తీశారు. ఈ WCలో ఇది మూడో హ్యాట్రిక్ కాగా కమిన్స్ రెండుసార్లు ఈ ఘనత సాధించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకున్నారు. కొద్దిమంది బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ ఫొటోలను సోనాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి సమయంలో ఆమె తెలుపురంగు ‘చికంకారి’ ఎంబ్రాయిడరీ చీర ధరించారు. కాగా ఏడేళ్లుగా జహీర్, సోనాక్షి ప్రేమలో ఉన్నారు.
ప్రభాస్ ‘కల్కి2898AD’కి బదులు తన ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యాయన్న వార్తలపై హీరో రాజశేఖర్ స్పందించారు. ‘నాకు అస్సలు సంబంధం లేదు’ అని నవ్వుతున్న ఎమోజీలతో ట్వీట్ చేశారు. ప్రభాస్, నాగ్‌అశ్విన్, అశ్వినీదత్‌కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభాస్ కల్కి చరిత్ర సృష్టించాలని రాజశేఖర్ అన్నారు. కాగా ఆయన ట్వీట్‌పై స్పందించిన కూతురు శివాత్మిక.. ‘మా నాన్న! లివింగ్ లెజెండ్’ అంటూ నవ్వుతున్న ఎమోజీలు పెట్టారు.
Sorry, no posts matched your criteria.