News June 24, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News June 24, 2024

శుభ ముహూర్తం

image

తేది: జూన్ 24, సోమవారం
జ్యేష్ఠము
బ.తదియ: తెల్లవారుజామున 01:23 గంటలకు
ఉత్తరాషాడ: మ.03:54 గంటలకు
దుర్ముహూర్తం: మ.12:35-01:27, మ.03:11-04:03, గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజామున.12:40-02:12, రాత్రి 07:40-09:11 గంటల వరకు

News June 24, 2024

HEADLINES

image

* TG: కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల BRS MLA సంజయ్ కుమార్
* TG: రేపు TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
* AP: జగన్ ఏంటి ఈ ప్యాలెస్‌ల పిచ్చి: మంత్రి లోకేశ్
* రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు
* నీట్ పేపర్ లీకేజీ స్కామ్‌పై CBI కేసు నమోదు
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
* T20 WC సెమీస్ చేరిన ఇంగ్లండ్

News June 23, 2024

కాంగ్రెస్‌లో చేరిన BRS MLA

image

TG: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

News June 23, 2024

ఊచకోత.. ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు

image

అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసం సృష్టించారు. 9వ ఓవర్‌లో ఏకంగా 5 సిక్సర్లు బాదారు. దీంతో ఆ ఓవర్‌లో మొత్తం 32 రన్స్ వచ్చాయి. బట్లర్ 38 బంతుల్లో 7 సిక్సర్లు, 6 ఫోర్లతో 83 రన్స్‌తో USA బౌలర్లను ఊచకోత కోశారు. ఇక 116 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీస్ చేరింది.

News June 23, 2024

పాక్ జర్నలిస్టుకు అశ్విన్ కౌంటర్!

image

పాకిస్థాన్‌కు చెందిన వజహత్ కజ్మీ అనే జర్నలిస్టు భారత్‌పై నోరు పారేసుకున్నారు. అన్ని జట్లపై గెలిచే అఫ్గానిస్థాన్ భారత్‌పై మాత్రం ఐపీఎల్ కాంట్రాక్టుల కోసమే ఓడిపోతోందని ట్వీట్ చేశారు. దానిపై భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్రంగా స్పందించారు. ‘ఏం చేయాలో(బ్లాక్ చేయాలని) మీకు నేను చెప్పలేను కానీ నా టైమ్‌లైన్‌లో నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటా’ అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు.

News June 23, 2024

విజయవాడ పరిధిలో రేపటి నుంచి పలు రైళ్లు రద్దు

image

AP: విజయవాడ డివిజన్ పరిధిలో నడిచే పలు రైళ్లను రేపటి నుంచి ఈ ఏడాది ఆగస్టు 11 వరకు రద్దు చేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే లైన్లలో ఆధునికీకరణ పనులు చేపట్టిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రధానంగా విశాఖ-గుంటూరు, విశాఖ-తిరుపతి, విశాఖ-విజయవాడ, రాజమండ్రి-విశాఖ మధ్య నడిచే రైళ్లు వీటిలో ఉన్నాయి.

News June 23, 2024

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ

image

AP: రాష్ట్రంలోని వైసీపీ జిల్లా కార్యాలయాలకు అధికారులు వరుసగా నోటీసులు ఇస్తున్నారు. తాజాగా కడప జిల్లా పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నగరపాలక సంస్థ అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతి లేని భవనాన్ని ఎందుకు కూల్చకూడదో వారంలోగా సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. కాగా నిన్న ఉదయం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. విశాఖ పార్టీ ఆఫీస్‌కు కూడా నోటీసులు ఇచ్చారు.

News June 23, 2024

NEET రీఎగ్జామ్‌కు 750 మంది డుమ్మా

image

నీట్ రీఎగ్జామ్‌కు గ్రేస్ మార్కులు కలిపిన వారిలో సగం మంది డుమ్మా కొట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో NTA 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపింది. దీనిపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ధర్మాసనం ఆదేశాలతో గ్రేస్ మార్కులు రద్దు చేసిన NTA ఇవాళ వారికి మళ్లీ పరీక్ష నిర్వహించింది. 1,563 మందిలో 813 మంది హాజరుకాగా 750 మంది గైర్హాజరయ్యారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దు చేయాలని ఆందోళనలు కొనసాగుతున్నాయి.

News June 23, 2024

రేపు నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు

image

AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. నాలుగోబ్లాక్‌లో ఉన్న ఆయన ఛాంబర్‌లో కొన్ని మార్పుల పెండింగ్ కారణంగా పదవీ స్వీకారం ఆలస్యం అయినట్లు సమాచారం. తాజాగా అవి పూర్తి కావడంతో బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఆయన ఇప్పటి వరకు విధుల్ని నిర్వహిస్తున్నారు.