News March 21, 2024

ధోనీ నిర్ణయంపై CSK యాజమాన్యం రియాక్షన్ ఇదే..

image

CSK కెప్టెన్‌గా ధోనీ తప్పుకోవడంపై ఆ జట్టు CEO కాశీ విశ్వనాథన్ స్పందించారు. కెప్టెన్ల సమావేశానికి ముందే ఈ విషయం తనకు తెలిసినట్లు చెప్పారు. ధోనీ నిర్ణయాన్ని గౌరవించామన్నారు. మిస్టర్ కూల్ ఏం చేసినా అది జట్టుకు మేలు చేస్తుందన్నారు. కాగా కెప్టెన్ల ఫొటోషూట్‌లో ధోనీ లేకపోవడంతో ఆయన సారథిగా తప్పుకున్న విషయం బయటకు వచ్చింది. ఫొటోషూట్ తర్వాత కాసేపటికే CSK కొత్త కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్‌ను ప్రకటించింది.

News March 21, 2024

బాడీ మసాజర్‌‌ను సెక్స్ టాయ్‌గా పరిగణించలేం: హైకోర్టు

image

బాడీ మసాజర్‌ను అడల్ట్ సెక్స్ టాయ్‌గా పరిగణించలేం బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అందుకే దానిని నిషేధిత దిగుమతి వస్తువుల జాబితాలో చేర్చకూడదని పేర్కొంది. బాడీ మసాజర్‌ సెక్స్ టాయ్ కాదంటూ 2023 మేలో సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ టాక్స్ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాలు చేస్తూ కస్టమ్స్ అధికారులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు తాజాగా కొట్టేసింది.

News March 21, 2024

ఆ నలుగురిలో అతనే బెస్ట్ బ్యాటర్: సిద్ధూ

image

భారత్ తరఫున అద్భుతంగా ఆడిన బ్యాటర్లలో బెస్ట్ ఎవరో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సిద్ధూ వెల్లడించారు. సునీల్ గవాస్కర్, సచిన్, ధోనీ, కోహ్లీలలో అత్యుత్తమ బ్యాటర్‌గా విరాట్‌నే ఎంపిక చేస్తానన్నారు. కోహ్లీ మూడు ఫార్మాట్లలోనూ అదరగొట్టారని, టెక్నికల్‌గా అతడు ఉత్తమ ఆటగాడని అభిప్రాయపడ్డారు. తన జట్టు కోసం అత్యుత్తమంగా ఆడతారని చెప్పారు.

News March 21, 2024

BREAKING: బీజేపీ మూడో జాబితా.. తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే?

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మూడో జాబితాను విడుదల చేసింది. తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై బరిలో నిలవనున్నారు. కోయంబత్తూరు-అన్నామలై, చెన్నై సెంట్రల్-వినయ్ పి.సెల్వం, వెల్లూర్-ఏసీ షన్ముగం, కృష్ణగిరి-సి.నరసింహన్, నీలగిరి-మురుగన్, పెరంబళూర్-పారివేంధర్, తూత్తుకుడి-నాగేంద్రన్, కన్యాకుమారి-రాధాకృష్ణన్ పోటీ చేయనున్నారు.

News March 21, 2024

BREAKING: టెట్ ఫలితాలపై క్లారిటీ

image

AP: టెట్ ఫలితాలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. ఈ విషయాన్ని https://aptet.apcfss.in/లో ప్రకటించింది. కాగా, షెడ్యూల్ ప్రకారం మార్చి 14నే రిజల్ట్స్ రావాల్సి ఉన్నా అధికారులు వెల్లడించలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు వెల్లడిస్తామని తాజాగా ప్రకటించారు.

News March 21, 2024

ఈ ఏడాది కొత్త కెప్టెన్లు వీరే..

image

ఈ ఏడాది ఐపీఎల్‌లో పలు జట్లకు కెప్టెన్లు మారారు. గుజరాత్ కెప్టెన్‌గా గిల్, చెన్నై కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్, ముంబైకి హార్దిక్ పాండ్య, SRHకి కమిన్స్ బాధ్యతలు స్వీకరించారు. వీరిని ఆయా జట్లకు కెప్టెన్లుగా చూడటం ఇదే తొలిసారి. ఈ జట్లన్నీ గతంలో ఐపీఎల్ ట్రోఫీ విజేతలే కావడం గమనార్హం. మరోవైపు ఢిల్లీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పంత్‌కు గతంలో ఇదే టీమ్‌కు సారథ్యం వహించిన అనుభవం ఉంది.

News March 21, 2024

పవన్ కాపులకు ఏం చేశారు?: భరత్

image

AP: కాపులకు పవన్ కళ్యాణ్ ఏం చేశారని వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. ‘కాకినాడ ఎంపీతో పాటు ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని 6 అసెంబ్లీ స్థానాల్లో కాపులకు సీట్లు ఇచ్చాం. పవన్ కళ్యాణ్ ఏం చేశారు? ఒక్క చంద్రబాబుకే న్యాయం చేశారు. రాజకీయాల్లో మెచ్యూరిటీ లేని నేత పవన్. చంద్రబాబు ఆయన్ను కరివేపాకులాగా తీసిపారేస్తారు’ అని సెటైర్లు వేశారు భరత్.

News March 21, 2024

ఛీ.. ఛీ.. అసలు ఈమె తల్లేనా?

image

TS: మంచిర్యాల జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. ఓ తల్లి 8 నెలల పసికందును చేనులో వదిలేసింది. నిన్న రాత్రి చేనులో వదిలేసి వెళ్లడంతో వీధి కుక్కలు ఆ పసిపాపపై దాడి చేసి, చంపేశాయి. శరీర భాగాలను పీక్కుతిన్నాయి. తల్లి గంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమిని మండలం కేస్లాపూర్ గ్రామంలో ఈ అమానుష ఘటన చోటు చేసుకుంది.

News March 21, 2024

ధోనీ కొత్త లుక్ అదిరింది

image

ఐపీఎల్-2024 ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ ధోనీ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో నెట్టింట ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. తలా లుక్ అదిరిపోయిందంటూ CSK ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రేపు RCB, CSK మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.

News March 21, 2024

జపనీస్ యానిమేపై రాజమౌళి దృష్టి

image

జపాన్ పర్యటనలో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళి యానిమేపై దృష్టిసారించారు. బాగా ఫేమస్ అయిన జపనీస్ యానిమే గురించి అక్కడి నిపుణులతో చర్చించారు. ‘అద్భుతమైన జపనీస్ యానిమే ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి నేను ఎప్పుడూ ఆసక్తిగా ఉంటా. యానిమే గురించి నాకు వివరించిన రుయి కురోకి-సాన్, కజుటో నకాజవా-సాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సృజనాత్మక చర్చలను పూర్తిగా ఆస్వాదించా’ అని ఆయన ట్వీట్ చేశారు.