News December 29, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 29, 2024

ఈ రోజు టాప్ న్యూస్

image

* ముగిసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
* మాతృభాషను భవిష్యత్ తరాలకు పదిలంగా అందించాలి: చంద్రబాబు
* డిసెంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
* కేటీఆర్‌కు ఈడీ నోటీసులు
* మన్మోహన్ సింగ్‌కు రుణపడి ఉంటాం: నారా లోకేశ్
* సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
* డిసెంబర్ 31న పార్టీలు చేసుకోవద్దు: హరీశ్ రావు
* మెల్‌బోర్న్ టెస్టులో నితీశ్ కుమార్ రెడ్డి సూపర్ సెంచరీ

News December 29, 2024

RRR సూపర్ గేమ్ ఛేంజర్ కానుంది: కోమటిరెడ్డి

image

TG: రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం పనులకు కేంద్రం టెండర్లు పిలవడంపై మంత్రి కోమటిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు అని వెల్లడించారు. RRR కోసం సీఎంతో కలిసి ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లి గడ్కరీకి వినతిపత్రాలు ఇచ్చినట్లు చెప్పారు. ORRలాగే RRR కూడా సూపర్ గేమ్ ఛేంజర్ కానుందని తెలిపారు. సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఇదని పేర్కొన్నారు.

News December 29, 2024

నాగార్జునసాగర్ భద్రతపై కన్ఫ్యూజన్

image

నాగార్జునసాగర్ డ్యామ్ భద్రతపై గందరగోళం తలెత్తింది. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదం నేపథ్యంలో CRPFకు కేంద్రం గతంలో బాధ్యతలు అప్పగించింది. డ్యామ్ భద్రతా విధుల నుంచి CRPF వైదొలుగుతున్నట్లు చెప్పడంతో తెలంగాణ SPF ఆ బాధ్యతలు స్వీకరించింది. మళ్లీ రాత్రి విధుల్లోకి CRPF సిబ్బంది వచ్చి భద్రతా బాధ్యతలు చేపట్టాయి. దీంతో ఏం జరుగుతుందనేది తెలియక స్థానిక అధికారులు అయోమయానికి గురయ్యారు.

News December 28, 2024

కలెక్టర్ పిల్లలైతే ఇలాగే ఊరుకుంటారా?: తల్లి

image

రాజస్థాన్లో బోరుబావిలో పడిన <<14987957>>చిన్నారి<<>> తల్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా కూతురు అందులో పడి 6 రోజులైంది. ఆకలి, దాహంతో ఎంత వేదన అనుభవిస్తుందో? కలెక్టర్ పిల్లలైతే ఇలాగే వదిలేసేవారా?’ అని ఏడుస్తూ ప్రశ్నించారు. తన కూతురిని త్వరగా బయటికి తీసుకురావాలని వేడుకున్నారు. ఈనెల 23న చిన్నారి పొలం వద్ద ఆడుకుంటూ బోరుబావిలో పడింది. ఆమెను క్షేమంగా తీసుకొచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News December 28, 2024

పవన్ టూర్ నకిలీ ఐపీఎస్ అరెస్ట్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనల్లో నకిలీ IPSగా చెలామణి అయిన సూర్యప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎస్ పేరుతో అందరినీ మోసగిస్తున్నట్లు గుర్తించారు. భూకబ్జాలకు కూడా పాల్పడుతున్నట్లు నిర్ధారించారు. కాగా విజయనగరం జిల్లా ముడిదాం ప్రాంతానికి చెందిన సూర్యప్రకాశ్ పవన్ మన్యం పర్యటనలో ఐపీఎస్ ఆఫీసర్‌గా హల్‌చల్ చేశారు. కొందరు పోలీస్ అధికారులు ఆయనకు సెల్యూట్ కొట్టి ఫొటోలు కూడా దిగారు.

News December 28, 2024

విశాఖలో సింగిల్‌యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం

image

AP: విశాఖ వాసులకు అలర్ట్. GVMC పరిధిలో జనవరి 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమల్లోకి రానుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిబంధనలు కఠినంగా అమలు చేయాలని మేయర్, కమిషనర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. వీటిని వాడే వారిపై జరిమానా విధించడంపై సమాలోచనలు చేస్తున్నారు. ప్రజలకు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు.

News December 28, 2024

పవన్ ‘OG’ మూవీపై మేకర్స్ కీలక ప్రకటన

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ మూవీపై మేకర్స్ కీలక ప్రకటన చేశారు. ‘‘ఓజీ’పై మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానం మా అదృష్టం. కానీ పవన్ ఎక్కడికి వెళ్లినా మీరు ఓజీ.. ఓజీ అని అరిచి ఇబ్బంది పెట్టొద్దు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఆయనను, ఆయన స్థాయిని గౌరవించండి. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. ఓజీ పండుగ వైభవం చూద్దాం’ అని పేర్కొన్నారు.

News December 28, 2024

ప్రధాని మోదీని కలిసిన గుకేశ్

image

వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు ప్రధాని నరేంద్ర మోదీని ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా గుకేశ్‌కు మోదీ చెస్ బోర్డు కానుకగా అందించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ‘ప్రధాని మోదీని కలవడం నా జీవితంలోనే అత్యుత్తమమైన క్షణం’ అని గుకేశ్ పోస్ట్ చేశారు. కాగా ఇటీవల తలైవా రజినీకాంత్‌ను కూడా గుకేశ్ కలిసిన విషయం తెలిసిందే.

News December 28, 2024

డిజిటల్ అరెస్ట్ అనేదే లేదు.. దాన్ని నమ్మొద్దు: డీజీపీ

image

AP: దేశంలో తొలిసారి మనమే స్మార్ట్ పోలీస్ ఏఐ వినియోగిస్తున్నామని డీజీపీ ద్వారకాతిరుమల రావు తెలిపారు. ఏలూరు జిల్లా పోలీసులు దీన్ని ప్రారంభించినట్లు చెప్పారు. నేర నమోదు నుంచి కేసు విచారణ వరకు స్టార్మ్ పోలీస్ ఏఐ సాయం చేస్తుందన్నారు. ఇక డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలాంటి వాటిని నమ్మొద్దని డీజీపీ సూచించారు. ఈ ఏడాది 916 సైబర్ క్రైమ్ కేసులు నమోదయ్యాయని, వీటి ద్వారా నేరస్థులు రూ.1229Cr తస్కరించారన్నారు.