News March 21, 2024

16 నుంచి ఒంటిమిట్ట కోదండ రాముడి బ్రహ్మోత్సవాలు

image

AP: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో వచ్చే నెల 16 నుంచి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. 17న శ్రీరామనవమి రోజున ధ్వజారోహణం, 22న సీతారాముల కళ్యాణం జరుగుతుందని తెలిపింది. అన్నప్రసాదాలు, తలంబ్రాల పంపిణీకి 2 వేల మంది సేవకులను సిద్ధం చేయాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు నిర్మించాలని సూచించారు.

News March 21, 2024

రష్యా, ఉక్రెయిన్‌లో పీఎం మోదీ పర్యటన?

image

భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉంది. ఈమేరకు ఆ రెండు దేశాల అధ్యక్షులు ఆయన్ను కోరారని పీఎంఓ వర్గాలు వెల్లడించాయి. ఆ దేశాల అధ్యక్షులతో ఆయన తాజాగా ఫోన్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. తమ మధ్య శాంతిని నెలకొల్పడంలో భారత్ సమర్థమైన పాత్ర పోషిస్తుందని వారు భావిస్తున్నట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి.

News March 21, 2024

భీమిలిపై ఎందుకంత మోజు?

image

AP: భీమిలి నియోజకవర్గం మొదటి నుంచి TDPకి కంచుకోట. 1980 నుంచి ఇక్కడ ఆ పార్టీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ TDPకి బలమైన కేడర్ ఉంది. ఇతర పార్టీలు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలవాల్సిందే. అందుకే ఈ సీటు అంటే అందరికీ ఇష్టం. ఇక్కడి ప్రజలు కొత్తవారిని బాగా ఆదరిస్తారు. ఇక్కడ కాపు, యాదవుల ఓట్లే అధికం. దీంతో భీమిలిలో పోటీ చేసేందుకు నేతలు పోటీ పడుతుంటారు. మరీ ముఖ్యంగా టీడీపీలో పోటీ అధికంగా ఉంటుంది.

News March 21, 2024

58 ఏళ్ల వయసులో IVFకు అనుమతి ఎలా?

image

దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు రెండో బిడ్డకు జన్మనివ్వడం వివాదాస్పదంగా మారుతోంది. సిద్ధూ తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ పద్ధతిలో రెండో బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో ఆమెకు 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని పంజాబ్ ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశ్నించింది. ఐవీఎఫ్ పద్ధతిలో బిడ్డను కనడానికి 21 నుంచి 50 ఏళ్ల వారికే అనుమతి ఉందని తెలిపింది. దీనిపై నివేదిక సమర్పించాలని లేఖ రాసింది.

News March 21, 2024

ముగ్గురు ఎస్పీలకు ఈసీ పిలుపు

image

AP: గిద్దలూరు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు, మాచర్లలో వాహనం తగలబెట్టిన ఘటనలపై EC రంగంలోకి దిగింది. ఈ అంశాలపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని SPలు పరమేశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, రఘువీరారెడ్డిలను ఆదేశించింది. ఈ ఘటనలు ఎందుకు జరిగాయి? ఎవరు చేశారు? ఎందుకు నియంత్రించలేదు? అనే అంశాలపై నేడు వివరణ తీసుకోనుంది. అటు ప్రధాని మోదీ బొప్పూడి సభలో భద్రతా వైఫల్యంపై కేంద్రానికి నివేదికలు పంపింది.

News March 21, 2024

ఖమ్మం పార్లమెంట్ బరిలో TDP?

image

TG: ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి TDP పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. TDP, BJP పొత్తులో భాగంగా ఈ సీటును ఆ పార్టీకి కేటాయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి కమ్మ సామాజికవర్గ అభ్యర్థిని బరిలోకి దించుతున్నట్లు టాక్. మొత్తం 17 స్థానాలకు గానూ 15 స్థానాలకు BJP అభ్యర్థులను ఖరారు చేసింది. వరంగల్, ఖమ్మం సెగ్మెంట్లను పెండింగ్‌లో ఉంచింది. వరంగల్ నుంచి ఆరూరి రమేశ్, ఖమ్మం నుంచి TDP పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

News March 21, 2024

ఏపీ ఎలక్షన్.. సిబ్బంది లెక్క ఇలా..

image

✒ బందోబస్తుకు రాష్ట్ర పోలీసులు- 1.50 లక్షలు
✒ స్టేట్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్- 522 కంపెనీలు
✒ సెంట్రల్ ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీస్- 465 కంపెనీలు
✒ పోలింగ్ అధికారులు- 2,48,814
✒ ప్రిసైడింగ్ అధికారులు- 55,269
✒ బూత్‌స్థాయి సిబ్బంది- 46,165
✒ మైక్రో అబ్జర్వర్లు- 18,961
✒ సెక్టోరల్ అధికారులు- 5,067
<<-se>>#ELECTIONS2024<<>>

News March 21, 2024

రత్నం విద్యాసంస్థల అధినేత కేవీ రత్నం కన్నుమూత

image

AP:ప్రముఖ విద్యావేత్త, రత్నం విద్యాసంస్థల అధినేత కొర్రపాటి వెంకటరత్నం(82) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. APలోనే తొలిసారిగా కోచింగ్ సెంటర్లను నెల్లూరులో ఏర్పాటు చేసిన ఘనత ఆయనది. పేద విద్యార్థులకు తమ సంస్థల్లో ఉచిత బోధన అందించిన ఆయన.. గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు సొంత డబ్బుతో శస్త్రచికిత్సలు చేయించారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

News March 21, 2024

48 గంటల్లో ‘సెట్‌టాప్’ సేవల పునరుద్ధరణ: APSFL

image

AP: రాష్ట్రంలోని అన్ని సెట్‌టాప్ బాక్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు APSFL వెల్లడించింది. ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా డేటాను మార్చుతున్నామని, 48 గంటల్లో సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. ప్రభుత్వ ప్రకటనలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారం సెట్‌టాప్‌లలో ప్రసారం కావడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News March 21, 2024

జనసేనాని ప్రచార షెడ్యూల్ ఇదే

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 27 నుంచి ఆయన ఉత్తరాంధ్రలో తొలివిడత పర్యటన ప్రారంభిస్తారని జనసేన పార్టీ తెలిపింది. కీలక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారని పేర్కొంది. పవన్ వారాహి యాత్ర కొన్ని నెలల క్రితం అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారని, ఈ మేరకు హైదరాబాద్‌ నుంచి మంగళగిరికి వారాహి వాహనం బయలుదేరిందని జనసేన వర్గాలు వెల్లడించాయి.