News December 28, 2024

ఓటీటీలోకి కొత్త చిత్రం

image

కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్‌ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.

News December 28, 2024

DAY 3: నిలిచిన ఆట.. నితీశ్-సుందర్ సెంచరీ భాగస్వామ్యం

image

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీశ్(85*), సుందర్(40*) క్రీజులో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్‌లో టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో నితీశ్-సుందర్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.

News December 28, 2024

మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

image

టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది DECలో 15% టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. ARPU లెవెల్స్ పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఇక నుంచి తరచూ ఈ పద్ధతి కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా గత ఐదేళ్లలో మూడు సార్లు (2019, 21, 24)టారిఫ్ పెంచారు. 2019 SEPలో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 SEPకు రూ.193కి ఎగబాకింది.

News December 28, 2024

RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం

image

సంపద, సంపన్నులు పెరగడంతో లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకో ₹50L పైబడిన కారును అమ్మింది. తొలిసారి ఒక ఏడాదిలో 50వేల లగ్జరీ కార్ల ఘనతను అందుకుంది. 2025లో 54వేలకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20వేలు, BMW 12వేల కార్లను అమ్మినట్టు సమాచారం. ఇవి సగటున 15% గ్రోత్ నమోదు చేశాయి. వివిధ కారణాలతో AUDI కార్ల సేల్స్ 16% తగ్గాయి.

News December 28, 2024

BREAKING: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

image

TG: ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News December 28, 2024

రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్

image

రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్‌ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.

News December 28, 2024

శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటలంటే?

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 66,715 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,503 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో రూ.4.06 కోట్ల హుండీ ఆదాయం చేకూరింది.

News December 28, 2024

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడిపై ఎఫెక్ట్!

image

ఏపీలో కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై ప్రభావం చూపుతోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆ రాష్ట్రంతో సరిహద్దు ఉన్న జిల్లాల్లో మద్యం అమ్మకాలు తగ్గాయి. గతంతో పోలిస్తే ఒక్క డిసెంబర్‌లోనే రూ.40 కోట్ల రాబడి తగ్గినట్లు తెలుస్తోంది. నాగర్ కర్నూల్, సూర్యాపేట, KMM, కొత్తగూడెం, NLG, గద్వాల్ సరిహద్దుల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో ఆర్థిక సంవత్సరంలో రూ.300 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉన్నట్లు గణాంకాలు పేర్కొన్నాయి.

News December 28, 2024

క్రిప్టో డీలా: రూ.1.2L నష్టపోయిన బిట్‌కాయిన్

image

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కాస్త డీలా పడ్డాయి. మార్కెట్ విలువ 1.43% తగ్గి $3.29Tగా ఉంది. బిట్‌కాయిన్ $1492 (Rs1.2L) నష్టపోయింది. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి $94,472 వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.23% నష్టంతో $3335 వద్ద కొనసాగుతోంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56,8%, 12.2%గా ఉన్నాయి. BNB, TRX 2% పెరగ్గా XRP 1.35, SOL 2.31, DOGE 0.55, AVAX 2.78% మేర తగ్గాయి.

News December 28, 2024

అంత సీన్ లేదు ‘పుష్పా’..!

image

AP: ‘పుష్ప-2’లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కనిపించట్లేదట. టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించగా, చాలా మంది రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. చైనా, జపాన్, సింగపూర్, అరబ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గి ఎర్రచందనానికి డిమాండ్ పడిపోయిందని అంచనా.