India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రిప్టో కరెన్సీ మార్కెట్లు గత 24 గంటల్లో కాస్త డీలా పడ్డాయి. మార్కెట్ విలువ 1.43% తగ్గి $3.29Tగా ఉంది. బిట్‌కాయిన్ $1492 (Rs1.2L) నష్టపోయింది. ప్రస్తుతం స్వల్పంగా పెరిగి $94,472 వద్ద ట్రేడవుతోంది. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 1.23% నష్టంతో $3335 వద్ద కొనసాగుతోంది. BTC, ETH డామినెన్స్ వరుసగా 56,8%, 12.2%గా ఉన్నాయి. BNB, TRX 2% పెరగ్గా XRP 1.35, SOL 2.31, DOGE 0.55, AVAX 2.78% మేర తగ్గాయి.

AP: ‘పుష్ప-2’లో టన్ను ఎర్రచందనానికి రూ.కోటిన్నర వస్తాయని హీరో చెప్పడం గుర్తుందా? కానీ అటవీశాఖ మాత్రం అంత సీన్ లేదంటోంది. ఎర్రచందనం అమ్మేందుకు టెండర్లు పిలిచినా అంతగా స్పందన కనిపించట్లేదట. టన్ను ధర రూ.70 లక్షలుగా నిర్ణయించగా, చాలా మంది రూ.50 లక్షలకు మించి బిడ్లు వేయలేదు. చైనా, జపాన్, సింగపూర్, అరబ్ దేశాల్లో ఆర్థిక సంక్షోభం వల్ల ఖరీదైన ఫర్నిచర్ వినియోగం తగ్గి ఎర్రచందనానికి డిమాండ్ పడిపోయిందని అంచనా.

ఆస్ట్రేలియా గడ్డపై సూపర్ రికార్డు ఉన్న రిషభ్ పంత్ ఈసారి విఫలం అవుతున్నారు. BGT 2024-25లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. మొదటి టెస్టులో 38, రెండో టెస్టులో 49, మూడో టెస్టులో 9, నాలుగో టెస్టు (ఫస్ట్ ఇన్నింగ్స్)లో 28 పరుగులు మాత్రమే చేశారు. పంత్ బలహీనతలపై ఆస్ట్రేలియా బౌలర్లు ఫోకస్ చేసి ఔట్ చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

AP: 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పలుమార్లు వాయిదా పడటంతో నిరుద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జూన్ నాటికి పోస్టులు భర్తీచేస్తామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంలో సాధ్యం అవుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు 3 నెలల గడువు ఉంది. ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు కనీసం 3-4 నెలలు పట్టే అవకాశం ఉంది. కొత్త టీచర్లకు శిక్షణ, పోస్టింగ్ మరింత ఆలస్యమవుతుందని తెలుస్తోంది.

TG: న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది.

AP: విజయవాడ కేబీఎన్ కాలేజీ వేదికగా నేడు, రేపు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సభలను ప్రారంభించనుండగా, ముఖ్య అతిథులుగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హాజరవుతారు. 2 రోజుల్లో 25కు పైగా సదస్సులు, కవిత, సాహిత్య సమ్మేళనాలు జరగనున్నాయి. దేశవిదేశాల నుంచి 1,500 మందికి పైగా భాషాభిమానులు, కవులు పాల్గొంటారు.

TG: టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్ విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఫస్ట్ ప్రయారిటీ కాకుండా లాస్ట్/ఇతర ప్రయారిటీ ఇచ్చిన జిల్లాల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. చాలా దూరం ప్రయాణం చేసి పరీక్ష రాయాల్సి ఉంటుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనవరి 11, 20వ తేదీల్లో జరిగే పరీక్షలకు హాల్ టికెట్లను ఇవాళ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అధికారులు తెలిపారు.

TG: ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు TGB సేవలు నిలిచిపోనున్నట్లు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్‌ల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు. కస్టమర్ల అత్యవసరాల నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అన్నమయ్య(D) గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శిస్తారు. అనంతరం గాలివీడులోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. దాడి జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

మన్మోహన్ సింగ్ <<14998092>>అంత్యక్రియలపై వివాదం<<>> రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.
Sorry, no posts matched your criteria.