News December 28, 2024

రాజమౌళి SSMB29 నుంచి క్రేజీ అప్‌డేట్!

image

దేశంలోనే క్రేజీయెస్ట్ ప్రాజెక్టుగా ఇప్ప‌టికే హైప్ ద‌క్కించుకున్న రాజ‌మౌళి-SSMB29 చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్‌కు ప్రియాంకా చోప్రా ఎంపికైనట్టు తెలుస్తోంది. ఈ విష‌యాన్ని సినీ వ‌ర్గాలు ధ్రువీక‌రిస్తున్నాయి. అలాగే మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌లయాళ విల‌క్ష‌ణ న‌టుడు పృథ్విరాజ్ న‌టించనున్నట్లు ఫిలిం న‌గ‌ర్ టాక్‌. రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం పూజా కార్య‌క్ర‌మాలు సంక్రాంతి త‌రువాత జ‌ర‌గొచ్చ‌ని స‌మాచారం.

News December 28, 2024

ప్రొ కబడ్డీ సీజన్-11.. ఫైనల్‌కు పట్నా పైరేట్స్

image

ప్రొ కబడ్డీ సీజన్-11లో పట్నా పైరేట్స్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్-2లో ఢిల్లీ దబాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 32-28 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో హరియాణా, పట్నా జట్లు తలపడనున్నాయి. తొలి సెమీస్‌లో యూపీ యోధాస్‌పై 28-25 తేడాతో హరియాణా గెలిచింది.

News December 28, 2024

ED ఆఫీసుపై CBI రైడ్‌.. అది కూడా లంచం కేసు

image

లంచం కేసులో ED ఆఫీసుపై CBI రైడ్ చేసిన ఘటన తాజాగా వెలుగుచూసింది. సిమ్లా ED ఆఫీసులో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌ విశాల్ దీప్ ఓ కేసులో ప్రైవేటు వ్య‌క్తి నుంచి ₹55 ల‌క్ష‌లు డిమాండ్ చేశారు. దీంతో CBI రంగంలోకి దిగింది. విశాల్‌ తప్పించుకోగా అతని తమ్ముడు దొరికిపోయాడు. లంచం డబ్బు ₹55 ల‌క్ష‌ల‌తోపాటు విశాల్ ఆఫీసులో మ‌రో ₹56 ల‌క్ష‌ల న‌గ‌దును CBI సీజ్ చేసింది. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌న‌మైంది.

News December 27, 2024

APPLY NOW.. భారీ జీతంతో ఉద్యోగాలు

image

ESIC 608 ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. MBBS అర్హత ఉన్న 35 ఏళ్లలోపు వారు దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన వారికి రూ.56,100-రూ.1,77,500 జీతం చెల్లిస్తారు. జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News December 27, 2024

‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి 30న పొంగల్ సాంగ్

image

విక్టరీ వెంకటేశ్ కొత్త మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి థర్డ్ సింగల్ రిలీజ్‌పై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. పొంగల్ అంటూ సాగే ఈ పాటను డిసెంబర్ 30న రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు ట్రెండింగ్‌లో ఉండగా, పొంగల్ సాంగ్ కూడా చాట్‌బస్టర్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది.

News December 27, 2024

MPDOపై దాడి.. పవన్ కళ్యాణ్ ఆగ్రహం

image

AP: అన్నమయ్య(D) గాలివీడు MPDO శ్రీ జవహర్ బాబుపై YCP నేత సుదర్శన్ చేసిన దాడిని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ఖండించారు. ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని, కార్యాలయంలోకి చొరబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ దాడి అప్రజాస్వామిక చర్య అని, ఇలాంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు తావు లేదని స్పష్టం చేశారు. అటు రేపు కడప రిమ్స్‌కు వెళ్లనున్న పవన్ బాధిత MPDOను పరామర్శిస్తారు.

News December 27, 2024

త్వరగా నిద్ర రావాలంటే ఇలా చేయండి!

image

ప్రస్తుతం ఎంతోమందిని నిద్రలేమి సమస్య వెంటాడుతోంది. అలాంటివారికి 10-3-2-1 నియమం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంటే, పడుకునే పది గంటల ముందు టీ/కాఫీ తాగొద్దు. పడుకునే మూడు గంటలలోపే ఆహారం తినాలి. 2 గంటల ముందు పని చేయడం ఆపేయాలి. గంట ముందు మొబైల్/టీవీ ఆఫ్ చేయాలి. ఇవి పాటిస్తే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది. SHARE IT

News December 27, 2024

2024లో ఒక్క నిమిషంలో ఏం జరిగిందంటే?

image

ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌లో సగటున ప్రతి నిమిషంలో ఏం జరిగిందో తెలిపే డేటా వైరలవుతోంది. ఒక్క నిమిషంలో గూగుల్‌లో 5.9M సెర్చులు, 10.41 లక్షల ప్రశ్నలకు సిరి జవాబివ్వడం, యూట్యూబ్‌లో 34.72 లక్షల వ్యూస్, 18.8 మిలియన్ల టెక్స్ట్ మెసేజ్‌లు, ఇన్‌స్టా& ఫేస్‌బుక్‌లో 138.9M వ్యూస్, 251.1 మిలియన్ల మెయిల్స్, 9వేల మంది లింక్డ్‌ఇన్‌లో జాబ్ అప్లికేషన్లు నమోదైనట్లు డేటా తెలిపింది.

News December 27, 2024

రోహిత్ శర్మ రిటైర్ అవుతారా?

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఫామ్‌లేమితో ఆయన ఇబ్బందిపడుతున్నారు. ఆసీస్‌తో BGT సిరీస్‌లో ఇంతవరకు అతడు ఒక్క మంచి ఇన్నింగ్స్ ఆడలేదు. బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ 3 పరుగులకే ఔట్ కావడంతో అతడి ఆటతీరుపై ఫ్యాన్స్‌లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. దీంతో కెప్టెన్సీని ఇతరులకు రోహిత్ అప్పగించాలని, లేదంటే టెస్టులకు వీడ్కోలు పలకాలనే డిమాండ్ వినిపిస్తోంది.

News December 27, 2024

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 5 రోజుల్లో అక్కడక్కడ ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పడిపోతాయని హెచ్చరించింది. రేపు, ఎల్లుండి పొగమంచు ఎక్కువగా ఉంటుందని రేపు 20-27 డిగ్రీలు, ఎల్లుండి 18-27 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. తూర్పు/ఆగ్నేయ దిశలో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.