News March 18, 2024

అధిక ఛార్జీ వసూలు.. ఉబర్‌కు రూ.20వేల ఫైన్

image

ఉబర్‌కు వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. ప్రయాణికుడి నుంచి 8.83 కిలోమీటర్ల దూరానికి రూ.1,334 ఛార్జీ వసూలు చేయడంపై రూ.20 వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన అశ్వనీ ప్రశార్ ఉబర్ క్యాబ్ ఎక్కగా తొలుత ఛార్జీ రూ.359 అని పేర్కొంది. గమ్యాన్ని చేరుకున్నాక రూట్ డీవియేషన్‌ల కారణంతో ట్రిప్ ఛార్జీ రూ.1,334 అని రావడంతో అతడు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు
ఉబర్ సంస్థకు జరిమానా విధించింది.

News March 18, 2024

అందుకే నా సమస్య చెప్పాను: సమంత

image

తనకు ఉన్న మయోసైటిస్ సమస్యను పబ్లిక్‌‌కు బలవంతంగా చెప్పాల్సి వచ్చిందని నటి సమంత వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సమస్యను బహిర్గతం చేయడానికి గల కారణాలు వెల్లడించారు. ‘ఆ సమయంలో నా సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ, నా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అయితే సినిమా కోసం ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉండటంతో ఈ విషయాన్ని వెల్లడించాల్సి వచ్చింది’ అని ఆమె అన్నారు.

News March 18, 2024

పగలు బీజేపీ.. రాత్రి కాంగ్రెస్‌తో బాబు దోస్తీ: పేర్ని

image

AP: టీడీపీ అధినేత చంద్రబాబు పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో చేతులు కలుపుతారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ‘ఐదేళ్ల కిందట మోదీని ఉగ్రవాది అని బాబు తిట్టారు. మరి ఇప్పుడు విశ్వగురులా ఎలా కనిపించారు? పవన్, మోదీ, బాబు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు చెప్పలేదు? మీ పొత్తులు, ఒప్పందాలు ప్రజలకు అవసరం లేదు. మళ్లీ జగన్‌కే ఓటు వేసేందుకు ప్రజలు సిద్ధమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2024

ప్రియుడితో కలిసి కప్పుతో ఫోజుచ్చిన స్మృతి

image

WPL రెండో సీజన్ విజేతగా ఆర్సీబీ నిలిచింది. కాగా ప్రియుడు పలాస్ ముచ్చల్‌తో కలిసి ట్రోఫీతో కెప్టెన్ స్మృతి మంధాన ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారు. వీలుచిక్కినప్పుడల్లా వీరు విదేశాల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పలాస్ బాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్నారు. ఓ ఈవెంట్‌లో వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.

News March 18, 2024

గాజాలో దాడులు ఆపేదే లేదు: నెతన్యాహు

image

గాజాపై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. ‘అంతర్జాతీయ ఒత్తిళ్లకు మేం తలొగ్గం. యుద్ధంలో మా లక్ష్యాన్ని మధ్యలోనే ఆపలేం. గాజాపై దాడుల విషయంలో ప్రపంచ దేశాల ఒత్తిడిని పట్టించుకోం. మరికొన్ని వారాలపాటు దాడులు కొనసాగిస్తాం. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకర దాడులు అందరూ మర్చిపోవచ్చు. కానీ మేం అంత త్వరగా మర్చిపోం’ అని ఆయన పేర్కొన్నారు.

News March 18, 2024

రోహిత్ తిట్టినా పట్టించుకోం: కుల్‌దీప్ యాదవ్

image

భారత కెప్టెన్ రోహిత్ శర్మ తమను తిట్టినా పట్టించుకోమని స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ అన్నారు. ‘ఫీల్డింగ్ మిస్ అయినప్పుడు రోహిత్ అనే మాటలకు మేమేమీ బాధపడం. మైదానంలో దిగినప్పుడు అలాగే ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వచ్చాక తిరిగి తను మా మీద చాలా ప్రేమ చూపిస్తాడు. తనతో మా అందరికీ మంచి అనుబంధం ఉంది. మ్యాచ్‌లో నా బౌలింగ్‌ గురించి ఏం చెప్పడు కానీ.. బ్యాటింగ్‌లో మాత్రం మెరుగవ్వమంటాడు’ అని పేర్కొన్నారు.

News March 18, 2024

కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా మారింది: శివ్‌రాజ్‌‌సింగ్

image

కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారిందని మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బదులు రాజ్యసభ రూట్‌ను ఎంచుకున్నారు. ఆ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలవనుంది. రాహుల్ గాంధీకి ఎప్పుడేం చేయాలో తెలీదు. ఎన్నికల సమయంలో యాత్రలు చేస్తుంటారు’ అని విమర్శించారు.

News March 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 18, 2024

మార్చి 18: చరిత్రలో ఈ రోజు

image

1998: భారత ప్రధానమంత్రిగా ఐ.కె.గుజ్రాల్ పదవీ విరమణ
1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మా గాంధీకి 6 ఏళ్ల జైలు శిక్ష
1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
1871: భారత సంతతికి చెందిన గణిత, తర్క శాస్త్రవేత్త అగస్టస్ డీ మోర్గాన్ మరణం
1837: అమెరికా మాజీ అధ్యక్షుడు గ్రోవర్ క్లీవ్‌లాండ్ జననం
1953 – పశ్చిమ టర్కీలో భూకంపం సంభవించి 1,070 మంది మరణం

News March 18, 2024

ఏపీ ప్రజల మద్దతు ఎన్డీయేకే: ప్రధాని మోదీ

image

AP: ప్రజాగళం సభపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సభకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్ర ప్రజానీకం ఎన్డీయేకు పూర్తి మద్దతుగా ఉన్నారు. అవినీతిమయమైన వైసీపీ పాలన నుంచి టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాయని ప్రజలు నమ్ముతున్నారు’ అని ప్రధాని మోదీ రాసుకొచ్చారు.