News June 24, 2024
వారికి మాత్రమే రూ.2,500 ఆర్థికసాయం?
TG: ‘మహిళలకు రూ.2,500 ఆర్థికసాయం’ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పెన్షన్, ఎలాంటి ఆర్థిక సాయం పొందని మహిళలకు(కొత్త వారికి) మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారట. కొత్త రేషన్ కార్డుల జారీ తర్వాతే ఈ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
Similar News
News November 5, 2024
ఆరు నెలలకోసారి కొత్త పింఛన్లు: మంత్రి కొండపల్లి
AP: ఎన్టీఆర్ భరోసా కింద జనవరిలో కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత 6 నెలలకోసారి అర్హతను బట్టి కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయాలని సూచించారు. భర్త చనిపోయినవారు డెత్ సర్టిఫికెట్ సమర్పించిన మరుసటి నెల నుంచే పింఛన్ ఇవ్వాలని స్పష్టం చేశారు. 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానం డిసెంబర్ నుంచే అమలు చేయాలన్నారు.
News November 5, 2024
కరీనా ‘దైరా’ చిత్రంలో పృథ్వీరాజ్?
మేఘనా గుల్జార్ డైరెక్షన్‌లో కరీనా కపూర్ నటిస్తున్న ‘దైరా’ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఆయన కనిపిస్తారని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని బాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కాల్‌షీట్లు లేకపోవడంతో ఈ చిత్రం నుంచి ఆయుష్మాన్ ఖురానా, సిద్ధార్థ్ మల్హోత్రా తప్పుకున్నారు.
News November 5, 2024
టెన్త్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు
AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 18 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. రూ.50 ఫైన్‌తో ఈనెల 25, రూ.200 జరిమానాతో DEC 3, రూ.500 చెల్లింపుతో DEC 10 వరకు అవకాశం ఉంటుందని చెప్పారు. రెగ్యులర్ విద్యార్థులు రూ.125, సప్లిమెంటరీ రాసేవారు మూడు సబ్జెక్టుల వరకు రూ.110, అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.125 చెల్లించాలి. వృత్తి విద్య విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.