News March 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 18, 2024

TODAY HEADLINES

image

✒ AP: రాష్ట్ర మంత్రులు అవినీతిలో పోటీ: PM మోదీ
✒ రాష్ట్రంలో కూటమిదే విజయం: CBN, పవన్
✒ ప్రజాగళం సభ అట్టర్ ఫ్లాప్: పేర్ని నాని
✒ AP: గ్రూప్-2.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక
✒ TG: కేసీఆర్ నాటిన గంజాయి మొక్కలను పీకేస్తున్నా: సీఎం రేవంత్
✒ కాంగ్రెస్‌లో చేరిన BRS ఎంపీ రంజిత్, ఎమ్మెల్యే దానం
✒ రేపు సుప్రీంకోర్టులో కవిత కంటెంప్ట్ పిటిషన్
✒ WPL ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం

News March 18, 2024

స్నేహితులున్నది అందుకే: ఎస్ జైశంకర్

image

బల్గేరియాకు చెందిన నౌకను ఇటీవల సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ నౌకను భారత నేవీ రక్షించడంపై బల్గేరియా మంత్రి మరియా గాబ్రియేల్ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సిబ్బంది రక్షణకు కలిసి పనిచేయడాన్ని కొనసాగిద్దాం అని ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్‌పై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్ స్పందించారు. స్నేహితులున్నది అందుకేనని పేర్కొంటూ రాజ్‌నాథ్ సింగ్, భారత నేవీని ట్యాగ్ చేశారు.

News March 17, 2024

స్మృతి మంధానకు కోహ్లీ వీడియో కాల్

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు WPL విజేతగా నిలిచింది. తొలిసారి ఈ జట్టు కప్పు కొట్టడంతో ఆర్సీబీ ఆటగాళ్లు, ఫ్యాన్స్, ఫ్రాంచైజీ ఫుల్ ఖుషీలో ఉన్నారు. కాగా ఆర్సీబీ గెలవగానే ఆ జట్టు పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధానకు వీడియో కాల్ చేసి అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News March 17, 2024

IPLలోనూ గెలిస్తే డబుల్ ధమాకా: విజయ్ మాల్యా

image

మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టుకు వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా అభినందనలు తెలిపారు. ‘మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్‌లో RCB పురుషుల జట్టు ట్రోఫీ గెలిస్తే అది అద్భుతమైన డబుల్ ధమాకా అవుతుంది. గుడ్ లక్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 17, 2024

టీవీల్లోకి వచ్చేస్తున్న సూపర్‌హిట్ మూవీ

image

అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం మార్చి 24న సాయంత్రం 6 గంటలకు స్టార్ మా‌లో ప్రసారం కానుంది. విజయ్ బిన్నీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలకపాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ హీరోయిన్‌గా నటించారు. థియేటర్, OTTల్లో సక్సెస్ అయిన మూవీకి బుల్లితెరపై ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి మరి.

News March 17, 2024

CUET-UG పరీక్షల వాయిదా లేదు: UGC

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో CUET-UG పరీక్షలు వాయిదా పడతాయన్న వార్తలను UGC ఛైర్మన్ జగదీశ్ కుమార్ ఖండించారు. గతంలో ప్రకటించిన విధంగానే మే 15 నుంచి 31 మధ్య ఎగ్జామ్స్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 26న దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంత మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారనే డేటాను విడుదల చేస్తామన్నారు. గత ఏడాది ఈ పరీక్షకు 14.9 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు.

News March 17, 2024

ఇక పురుషుల వంతు..

image

ఆర్సీబీ మహిళల జట్టు WPL సీజన్-2లో టైటిల్ గెలవడంతో పురుషుల జట్టుపై ఫ్యాన్స్‌కు ఆశలు పెరిగాయి. కొన్నేళ్లుగా ఐపీఎల్ ఆరంభం నుంచి వినిపించే ‘ఈ సాలా కప్ నమ్దే’ ఈసారి నిజమవుతుందటూ ఆర్సీబీ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 2008 నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ ఈ సీజన్‌లో ట్రోఫీని ముద్దాడుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మార్చి 22న జరిగే ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభ పోరులో CSKతో ఆర్సీబీ తలపడనుంది.

News March 17, 2024

ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలి: జగదీశ్‌రెడ్డి

image

TG: రాష్ట్రంలో పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ఎండిపోయిన వరి పంటకు ఎకరాకు రూ.50వేలు, మిరప తోటలకు ఎకరాకు రూ.80వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు జలకళతో కళకళలాడాయని, ఇప్పుడు వెలవెలబోతున్నాయని చెప్పారు.

News March 17, 2024

WPL: ఆర్సీబీ ఘన విజయం

image

WPL సీజన్-2 ఫైనల్‌లో ఢిల్లీపై ఆర్సీబీ ఘన విజయం సాధించి తొలిసారి ట్రోఫీని సొంతం చేసుకుంది. 114 పరుగుల లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్(32), స్మృతి మంధాన(31), ఎల్లిస్ ఫెర్రీ(35*) రాణించారు. ఢిల్లీ బ్యాటర్లలో షెఫాలీ వర్మ(44), మెగ్ లానింగ్(23) మినహా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో శ్రేయాంక పాటిల్ 4, సోఫీ మొలినిక్స్ 3, శోభనా ఆశా 2 వికెట్లు పడగొట్టారు.