News December 27, 2024

రేపు ఈ పనులు చేయకండి

image

శని త్రయోదశి(రేపు) రోజున శనీశ్వరుడిని పూజించడం ద్వారా శని దోషం నుంచి విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. రేపు అబద్ధాలు చెప్పడం, కోపం తెచ్చుకోవడం, ఇతరులను అవమానించడం, ఇనుముతో కూడిన వస్తువులు దానం చేయడం, పాదాలతో ఎవరినైనా తాకడం, మాంసం తినడం, మద్యం సేవించడం వంటివి చేయొద్దని అంటున్నారు. నలుపు దుస్తులు ధరించడం, పేదలకు ఆహారం, నల్ల నువ్వులు దానం చేయడం, శని చాలీసా పఠనం వంటివి చేయమని సూచిస్తున్నారు.

News December 27, 2024

26/11 మాస్టర్ మైండ్ హఫీజ్ మృతి

image

ముంబై ఉగ్రదాడి(26/11) వెనుక మాస్టర్ మైండ్‌, లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రహ్మాన్ మక్కీ గుండెపోటుతో మరణించాడు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న అతడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఇవాళ ఉదయం హార్ట్‌ఎటాక్‌తో చనిపోయాడు. 2023లో UNO అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్‌పై విషం చిమ్మే హఫీజ్ రామ్‌పుర, ఎర్రకోట, ముంబై దాడుల్లో కీలకపాత్ర పోషించారు.

News December 27, 2024

రాజ్ ఘాట్ సమీపంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు ఢిల్లీలోని రాజ్ ఘాట్ సమీపంలో నిర్వహించనున్నారు. ఇవాళ ఆయన భౌతికదేహాన్ని నివాసంలోనే సందర్శనార్థం ఉంచారు. రేపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

News December 27, 2024

AI ఫొటోలు: మహా కుంభమేళాలో ప్రపంచ నాయకులు!

image

వచ్చే నెల 13వ తేదీ నుంచి మహాకుంభమేళా ప్రారంభమవనుంది. కోట్లాది మంది హాజరయ్యే ఈ కార్యక్రమానికి ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. అయితే, కుంభమేళాలో ప్రపంచ నాయకులు పాల్గొంటే ఎలా ఉంటుందో చూపే ఫొటోలను AI రూపొందించింది. ఇందులో పుతిన్, జిన్ పింగ్, కమలా హారిస్, డొనాల్డ్ ట్రంప్, కిమ్ జాంగ్ ఉన్, జార్జియా మెలోనీలు నదీ స్నానాలు ఆచరించినట్లున్న ఫొటోలు వైరలవుతున్నాయి.

News December 27, 2024

రేపు వారి టెట్ హాల్ టికెట్లు విడుదల

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2025 JAN 2 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. సాంకేతిక సమస్య వల్ల JAN 11న ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా YCP నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.

News December 27, 2024

కేటీఆర్ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం వరకు KTRను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

News December 27, 2024

DAY 2: 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జైస్వాల్(82), కోహ్లీ(36) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం పంత్(6*), జడేజా(4*) క్రీజులో ఉన్నారు. కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు AUS 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 రన్స్ వెనుకబడి ఉంది.

News December 27, 2024

సంక్రాంతి సెలవులపై క్లారిటీ

image

AP: సంక్రాంతి సెలవుల కుదింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. ఏమైనా మార్పులు ఉంటే అధికారిక ప్రకటన ఇస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా హాలిడేస్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి సెలవులను JAN 11-15 లేదా 12-16 తేదీలకు పరిమితం చేస్తారని ప్రచారం జరిగింది.

News December 27, 2024

బన్నీ బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

image

అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను జనవరి 10కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.