News December 27, 2024

రేపు వారి టెట్ హాల్ టికెట్లు విడుదల

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) హాల్ టికెట్లు అధికారిక వెబ్‌సైట్లో అందుబాటులోకి వచ్చాయి. టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జర్నల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2025 JAN 2 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయి. సాంకేతిక సమస్య వల్ల JAN 11న ఉదయం సెషన్, 20న ఉదయం, మధ్యాహ్నం సెషన్లకు హాజరయ్యే అభ్యర్థుల హాల్ టికెట్లు రేపు అందుబాటులోకి వస్తాయని విద్యాశాఖ పేర్కొంది.

News December 27, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన

image

AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా YCP నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.

News December 27, 2024

కేటీఆర్ క్వాష్ పిటిషన్.. విచారణ వాయిదా

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం వరకు KTRను అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు.

News December 27, 2024

DAY 2: 5 వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియా

image

ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తొలి ఇన్నింగ్సులో 5 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. క్రీజులో కుదురుకున్నట్లు కనిపించిన జైస్వాల్(82), కోహ్లీ(36) వెంటవెంటనే ఔటయ్యారు. ప్రస్తుతం పంత్(6*), జడేజా(4*) క్రీజులో ఉన్నారు. కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. అంతకుముందు AUS 474 పరుగులు చేసింది. భారత్ ఇంకా 310 రన్స్ వెనుకబడి ఉంది.

News December 27, 2024

సంక్రాంతి సెలవులపై క్లారిటీ

image

AP: సంక్రాంతి సెలవుల కుదింపుపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే జనవరి 10 నుంచి 19 వరకు సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ పేర్కొంది. ఏమైనా మార్పులు ఉంటే అధికారిక ప్రకటన ఇస్తామని తెలిపింది. కాగా ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా హాలిడేస్ ఇచ్చారు. దీంతో సంక్రాంతి సెలవులను JAN 11-15 లేదా 12-16 తేదీలకు పరిమితం చేస్తారని ప్రచారం జరిగింది.

News December 27, 2024

బన్నీ బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

image

అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను జనవరి 10కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. కాగా, బన్నీకి హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

News December 27, 2024

ఈ పుస్తకాల రూపంలో మన్మోహన్ ఎప్పటికీ బతికే ఉంటారు!

image

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆలోచనాపరుడే కాదు మంచి రచయిత కూడా. భారత ఎకానమీ, పాలసీలపై ఆయన పుస్తకాలు రాశారు. అకడమిక్, పాలసీ మేకర్, పొలిటీషియన్‌గా అనుభవంతో ‘Changing India’ పుస్తకాన్ని ఐదు వాల్యూముల్లో అందించారు. ఇండియా ట్రేడ్ పాలసీలపై ‘India’s Export Trends and Prospects for Self-Sustained Growth’, ఆర్థిక అభివృద్ధిలో సమానత్వంపై ‘The Quest for Equity in Development’ పుస్తకాలను రాశారు.

News December 27, 2024

నెలకు రూ.13వేల జీతం.. రూ.21 కోట్ల మోసం!

image

MHలో నెలకు రూ.13వేల జీతం వచ్చే 23 ఏళ్ల ఉద్యోగి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. తాను పనిచేసే సంస్థ పేరుతో నకిలీ ఈ-మెయిల్ సృష్టించి, పాత లెటర్ హెడ్‌తో మెయిల్ మార్చాలని బ్యాంక్‌కు లేఖ రాశాడు. వారు అదే నిజం అనుకొని మార్చగా OTPలు కొత్త మెయిల్‌కు వచ్చేవి. ఇలా e-బ్యాంకింగ్‌తో ₹21 కోట్లు పలు ఖాతాలకు తరలించి GFకు 4BHK, ఖరీదైన కార్లు కొన్నాడు. ఇది సంస్థ దృష్టికి రావడంతో పోలీసులను ఆశ్రయించారు.

News December 27, 2024

జపాన్‌లో ‘దేవర’ తాండవం.. ఎప్పుడంటే?

image

జపాన్‌ను తెలుగు సినిమాలు షేక్ చేయనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ నటించిన ‘కల్కి’ వచ్చే నెల 3న రిలీజ్‌కు సిద్ధమైంది. దీంతోపాటు యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా కూడా జపానీస్‌లో రిలీజ్ కానుంది. 2025 మార్చి 28న ఈ చిత్రం విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించిన టికెట్స్ జనవరి 3 నుంచి అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ‘దేవర’ ఇండియాలో మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

News December 27, 2024

వర్చువల్‌గా విచారణకు అల్లు అర్జున్

image

TG: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కోర్టు విచారణకు వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఈ మేరకు నాంపల్లి కోర్టు అనుమతించింది. తొక్కిసలాట కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియడంతో కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు రిమాండ్ విధించినా AA మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. విచారణ నేపథ్యంలో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కోర్టుకు చేరుకున్నారు.